ఎన్టీఆర్ ఇంటర్ పోల్?

కాస్త చిన్నా పెద్దా అంతే తేడా, పోలీస్ కానివ్వండి..సిబిఐ అనండి. అందుకే ఈ తరహా పాత్రలు ఏవైనా మన హీరోలకు ఇష్టం. దర్శకులు అవే కథలు వండుతుంటారు. అందుకే దర్శకుడు సుకుమార్ ఓ మెట్టు…

కాస్త చిన్నా పెద్దా అంతే తేడా, పోలీస్ కానివ్వండి..సిబిఐ అనండి. అందుకే ఈ తరహా పాత్రలు ఏవైనా మన హీరోలకు ఇష్టం. దర్శకులు అవే కథలు వండుతుంటారు. అందుకే దర్శకుడు సుకుమార్ ఓ మెట్టు ముందుకు వేసి, ఇంటర్ పోల్ కు వెళ్లిపోయాడు. ఎన్టీఆర్ ను ఇంటర్ పోల్ ఆఫీసర్ ను చేసేసాడు. బోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న నాన్నకు ప్రేమతో (ఈ టైటిల్ మార్చే అవకాశం కూడా వుంది) సినిమా లో హీరో, ఇంటర్ పోల్ లో పనిచేయడమో, ఆ విధంగా కనిపించడమో ఏదో వుందట. దానికి సంబంధించిన గెటప్ నే ఇటీవల బయటకు వచ్చింది. ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.