Advertisement

Advertisement


Home > Articles - Chanakya

పవన్ కు అప్పు తెచ్చిన తిప్పలు

పవన్ కు అప్పు తెచ్చిన తిప్పలు

మొహమాటానికి పోతే ఏదో అయిందన్నది సామెత. పాపం కాస్త నిబద్ధత కలిగినవాడన్న పేరున్న పవన్ కళ్యాణ్ కు మొహమాటం ప్లస్ అప్పు కలిసి, తలకాయనొప్పలు తెచ్చిందని వినికిడి. అసలు సంగతేమిటంటే, పవన్ కు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పివిపి నుంచి కాస్త భారీ మొత్తమే తీసుకున్నాడని వినికిడి. దానికి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే, పెద్దమనుషులు కొందరు, మధ్యవర్తిత్వం జరిపి, పివిపి కి ఓ సినిమా చేసేందుకు, అంతవరకు ఆ మొత్తం వడ్డీలేని అడ్వాన్సుగా మార్చేందుకు తీర్మానం చేసారట.

అక్కడిదాకా బాగానే వుంది. కానీ పివిపి అధినేత రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడే వచ్చింది తంటా. వైకాపాలోకి వెళ్లారు. టికెట్ రాలేదు. జగన్ తో పొసగలేదు. టీడీపీ తలుపు తట్టారు. విజయవాడ ఖాళీ లేదన్నారు. దాంతో పవన్ వత్తిడి చేసి, కిందా మీదా చేసి  పార్టీ దిశగా నడిపించారు. తీరా అన్నివైపుల నుంచి వచ్చిన విమర్శలు, అన్న చిరంజీవి పీకిన గట్టి క్లాసు పుణ్యమా అని పవన్ పోటీ చేయడం లేదని ప్రకటించక తప్పలేదు. కానీ సమస్య ఇక్కడితో తీరలేదు. ఎలాగైనా పవన్ కోటాలో అయితే భాజపా లేకుంటే టీడీపీ టికెట్ తనకు ఇప్పించాలని పివిపి నుంచి పవన్ పై తీవ్ర వత్తిడి వస్తోందట. దాంతో పవన్ తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఈ మేరకు బతిమాలుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో 24గంటల్లో పివిపి టికెట్ సంగతి తేలిపోతుంది. 

ఒక పక్క ఓ ఉన్నతాథికారి, మరోపక్క కొన్ని మీడియా శక్తుల ప్రోద్బలం, ఇంకోపక్క ఈ పివిపి వత్తిడి కలిసి పవన్ ను జన సేన దిశగా నడిపించాయి. ఇప్పుడు పవన్ అటు ఇటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతుంటే, వాళ్లంతా బాగానే వున్నారు. ఇతగాడి ఇజ్జత్ కాస్తా కుదేలైపోతోంది. ఇది చూసి అభిమానులు కిందా మీదా అవుతున్నారు. ఎవరి కోసమో పవన్ తన ప్రతిష్టం అంతా మసకబార్చుకున్నారని, ఎందుకిలా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇంత హడావుడి చేయకుండా బాబునో, మరొకర్నినో ఫలానా వారికి టికెట్ ఇవ్వండి అంటే, ఆనందంగా ఇచ్చేవారని, ఇదంతా చేసి, ప్రజల్లో పలుచనయ్యారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ఏమిటన్నది తమకు తెలుసని, అలాంటిది ఆయన మొహమాటానికి పోయి, నేలకు పోయేది నెత్తికి రాసుకున్నారని అభిమానులు అంటున్నారు. ఈ విషయం నేరుగా పవన్ కే చెప్పాలని తమకు వుందని, కానీ ఆ అవకాశం లేదని వారంటున్నారు. 

ఇదిలా వుంటే పవన్ మరోసారి జనంపైకి రావడం అన్నది పవన్ కోరిన వారికి తేదేపా లేదా భాజపా టికెట్ ఇవ్వడంపై ఆధారపడి వుంటుందని. అందుకే ప్రస్తుతానికి ఆయన మరే ఎత్తు వేయకుండా సైలెంట్ గా వున్నారని తెలుస్తోంది

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?