Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

ఛాన్సు మిస్సయిన బాబు: భాజపాదే తొలిదెబ్బ!

ఛాన్సు మిస్సయిన బాబు: భాజపాదే తొలిదెబ్బ!

చంద్రబాబునాయుడు ఇంకా ముసుగులో గుద్దులాట నడిపిస్తూనే ఉన్నారు. భాజపాతో తెగతెంపులు చేసుకావాలని ఆయన అనుకుంటున్నట్లు చాలా రోజుల కిందటే వార్తలు వచ్చాయి. ఆయన మాత్రం చెప్పలేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించేశారు. ఈలోగా తెలుగుదేశం పెద్దలు ఆయనకు తలంటుపోయడమూ.. ఆయన నాలుక్కరుచుకుని తన వ్యక్తిగత అభిప్రాయం అని దిద్దుకునే ప్రయత్నం చేయడమూ జరిగింది.

ఇన్ని నాటకాలు ఇటువైపు జరుగుతూ ఉండగా.. రెండో వైపున... భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా దూకుడుగా చెప్పేసింది. వాళ్లకసలు తెలుగుదేశం పార్టీ అంటే పెద్దగా పట్టింపు కూడా లేనట్లు ప్రవర్తించేసింది. రాష్ట్రంలో మంత్రి వర్గం నుంచి తప్పుకోడానికి సిద్ధంగా ఉన్నామంటూ అధికారికంగా ప్రకటించేశారు. కాకపోతే.. ఢిల్లీనుంచి ఓ గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉన్నదని చెప్పారు.

ఆ రకంగా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు వ్యూహాలమీద పైచేయి సాధించినట్లు అయింది. తొలిదెబ్బ భాజపానే కొట్టింది. ఇప్పుడిక చంద్రబాబునాయుడు ఆత్మరక్షణలో పడడమే. తాను తప్పుకుంటానని బెదిరించడం కాదు.. మీరు తప్పుకోవద్దని బతిమాలాల్సిన పరిస్థితి.

తాను తప్పుకున్నా.. వారు తప్పుకున్నా.. ఇద్దరూ మునగక తప్పదని చంద్రబాబుకు చాలా బాగా తెలుసు. వారు తనను వదిలించుకుంటే.. వారిని కౌగిలించుకోవడానికి వైకాపా సిద్ధంగా ఉందని కూడా చంద్రబాబుకు అనుమానం ఉంది. అదే తనను నమ్మి తనతో జట్టుకట్టే వాళ్లు పవన్ తప్ప మరొకరు లేరనే భయం కూడా ఆయనలో ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో భాజపా కొట్టిన తొలిదెబ్బ నుంచి తేరుకోడానికి ఆయన చాలా కష్టపడాలి. ఈ బంధం తెగకుండా... ఢిల్లీలో పెద్దల్ని బతిమాలి ఒప్పించుకోవాల్సి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?