Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 04

ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 04

క్యారీ తన అక్క యింట్లో వున్నపుడు ఆమె కూతుళ్లిద్దరూ చిన్నవాళ్లయినా తీవ్రవాదు గురించి ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకుంది. ‘‘మీకేం ఫరవాలేదర్రా, నేనున్నానుగా కాపాడేందుకు’’ అని వాళ్లకు చెప్పింది. వాళ్లకే కాక తనకూ చెప్పుకుంది ` దేశం కోసమైనా, మానాభిమానాు పక్కన పెట్టి అదే వృత్తిలో కొనసాగాని. లాంగ్లీకి తిరిగి వచ్చింది. హమీద్‌కు బ్లేడ్‌ ఎలా వచ్చిందో తెలియాంటే అందరికీ పాలీగ్రాఫ్‌ టెస్టు జరిపించాని ప్రతిపాదించింది. ఎవరైనా అబద్ధం చెపితే వారి శరీరంలో కలిగే మార్పును పసిగట్టే పరీక్ష అది. స్టాఫ్‌తో బాటు బ్రాడీని కూడా రప్పిస్తారని అతని నిజస్వరూపం బయటపడుతుందని ఆమె ఆలోచన. విధిలేక డేవిడ్‌ దానికి ఒప్పుకోవసి వచ్చింది.

మొదట క్యారీనే పిలిచారు. అన్నీ బాగానే చెప్పింది కానీ ‘చాటుగా మందులేవైనా తీసుకుంటున్నావా?’ అని అడిగినపుడు కాస్త తడబడి చివరకు ఔనని చెప్పేసింది. అయితే అది ప్రస్తుతానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి వాళ్లు పట్టించుకోలేదు. డేవిడ్‌ కూడా టెస్టు చేయించుకున్నాడు. వైవాహిక జీవితం గురించి అడిగినపుడు అతను తడబడ్డాడు. ఎందుకంటే భార్య అతన్నుంచి విడిపోయి వేరే ఉంటోంది. అప్పుడప్పుడు ప్లిల్ని యితని దగ్గరకు పంపిస్తోంది.

ఇక్కడ యిది జరుగుతూండగానే సాల్‌ రకీమ్‌ యింటికి వెళ్లి చుట్టుపక్క వాకబు చేశాడు. అతనితో బాటు ఒక అమ్మాయి కూడా వుండేదని తెలిసిందతనికి. ఆ పాటికే రకీమ్‌, ఐలీన్‌ కారులో వేరే ఊరిలో ఉన్న ఒక ఖాళీ యింటికి చేరారు. అక్కడకి వెళ్లి కొన్నాళ్లు అణగిమణగి వుండమని ఐలీన్‌కు ఆదేశాు వచ్చాయి. ఇంట్లోకి వెళ్లబోతూండగానే తుపు మీద ఒక బూబీ ట్రాప్‌ పెట్టారని  అర్థమైంది. తమ గురించి సిఐఏకు తెలిసిపోయింది కాబట్టి అల్‌ఖైదా తమనిక వద్చుకుందామని చూస్తోందని, అందుకే యిక్కడకు రప్పించి తుపు తెరిస్తే బాంబు పేలేలా ఏర్పాటు చేసి చంపేద్దామనుకున్నారని అర్థమైంది ఐలీన్‌కు. రకీమ్‌ను హెచ్చరించి, వెనక్కి లాగింది. ఇద్దరూ కారెక్కారు.

‘‘మనకిప్పుడు టెర్రరిస్టునుంచి, ప్రభుత్వాన్నుంచి యిద్దరి నుంచి ముప్పుంది. తప్పు ఒప్పుకుని లొంగిపోదాం.’’ అన్నాడు రకీమ్‌. అతను స్వతహాగా పిరికివాడు. కొందరు సౌదీల్లా అతనికి టెర్రరిజం మీద ప్రేమ ఏమీ లేదు. ఐలీన్‌మీద ప్రేమతో ఆమె చెప్పినది చేస్తున్నాడంతే. అవటానికి అమెరికనే అయిన ఐలీన్‌కు అల్‌ఖైదా అంటే సానుభూతి వుంది. ‘‘నేను నిన్ను యిందులోకి దింపినందుకు క్షమించు. కానీ యీ పరిస్థితుల్లో సిఐఏకు పట్టుబడితే వాళ్లు అల్‌ఖైదా గురించి చెప్పమని చిత్రహింసు పెడతారు. సిఐఏ లోని అల్‌ఖైదా మనుష్యు మనల్ని చంపేస్తారు. మనం మెక్సికో పారిపోయి, దాంకుందాం.’’ అంది రకీమ్‌తో. ఏం చెయ్యాలో తోచక అతను తూపాడు. కారును ముందుకి పోనిచ్చాడు.

మర్నాడు బ్రాడీతో బాటు ఖైదీగా పట్టుబడి హతుడైన టామ్‌ స్మారక కార్యక్రమం చర్చిలో జరిగింది. అతనితో పని చేసిన మెరీన్స్‌ అందరూ వచ్చారు. కుటుంబంతో సహా వచ్చిన బ్రాడీ తన ఉపన్యాసంలో టామ్‌కు ఘనమైన నివాళి అర్పించాడు. కానీ మనసులో టామ్‌ను తను చితకబాదుతున్న దృశ్యాు మెదుతూనే ఉన్నాయి. అందరూ టామ్‌ను తచుకుని కన్నీరు కార్చారు. చర్చి హాల్లోంచి బయటకు వచ్చాక క్యారీ అక్కడకు వచ్చి బ్రాడీని విడిగా కలిసి ‘నువ్వు రేపు లాంగ్లీకి రావాని చెప్పమన్నారు.’ అని చెప్పి వెళ్లిపోయింది. జెసికా అది చూసింది కానీ తనెవరో ఆమెకు తెలియలేదు.

స్మారక కార్యక్రమం తర్వాత ఆ సాయంత్రం టామ్‌ భార్య హెలెన్‌, ఆమె ప్రస్తుత భర్త విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మెరీన్సందరూ తాగుతూ పాత విషయాను నెమరేసుకున్నారు. వారిలో లాడర్‌ (వేక్‌ఫీల్డ్‌) అని యుద్ధంలో కాు పోగొట్టుకుని అవిటివాడైన అతనున్నాడు. పక్కా తాగుబోతు. అవేళ కూడా తాగుతూనే మీ యిద్దరూ ఎలా పట్టుబడ్డారు? అని అడిగాడు. బ్రాడీ చెప్పాడు. తర్వాత లాడర్‌ హఠాత్తుగా ‘‘టామ్‌ని చంపేసి, నిన్ను మాత్రం సజీవంగా ఎందుకు వదిలేశారు?’’ అని సూటిగా అడిగాడు. బ్రాడీ ఏమీ చెప్పలేక ‘నేను అదృష్టవంతుణ్న నుకుంటున్నాను. అంతకంటె నాకూ ఏ కారణమూ తోచటం లేదు’ అన్నాడు. ‘‘అవును, యిప్పుడేమిటి? మిటరీలో చేరమని అందరికీ ఉపన్యాసాలిస్తున్నావు. ప్రభుత్వానికి సాయపడడంలో ఏదైనా ఉద్దేశం ఉందా?’’ అని అడిగాడు లాడర్‌.

అంతటితో ఆగకుండా, ‘‘దాని సంగతి సరే, నీ భార్య చాలా అందంగా ఉంటుంది. నువ్వు పోయావు కాబట్టి మేమంతా కావాంటే ఆమె కోసం ట్రై చేసి వుండవచ్చు. కానీ ఎవ్వరం చేయలేదు ` ఒక్కడు మాత్రం చెడగొట్టేదాకా ఊరుకోలేదు...’’ అని అంటూండగానే మైక్‌ అతని మీద పడి కొట్టసాగాడు. జెసికా, ప్లిు, యితర మెరైన్స్‌, వారి కుటుంబసభ్యు అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. బ్రాడీ వెంటనే వారిద్దరినీ విడదీసి, మైక్‌ను విడిగా లాగి, ‘‘నీ పేరు చెప్పలేదుగా’’ అని అడిగాడు. మైక్‌ తడబడడం చూసి ‘‘నిన్ను నా స్నేహితుడనుకున్నాను చూడు, నాదీ తప్పు’’ అంటూ పిడికిలి బిగించి మైక్‌ మొహం మీద గుద్దాడు. మైక్‌ తిరగబడలేదు. దాంతో ఎడాపెడా నాుగు వాయించి, అతని ముక్కులోంచి రక్తం కారుతూండగా తన కుటుంబం పరువు యిలా బజార్న పడినందుకు బాధపడుతూ కారు వేసుకుని చర్రున ఎక్కడికో వెళ్లిపోయాడు.

మనసు బాగా లేక ఊరంతా తిరిగి, తిరిగి రాత్రికి ఒక బార్‌లో కూర్చుని మందు తాగడం మొదుపెట్టాడు. కాస్సేపటికి అతనికి మర్నాటి టెస్టు గుర్తుకు వచ్చింది. మనసు ఆందోళనగా వుంది, పాల్గొనలేనని చెప్పడానికి క్యారీకి ఫోన్‌ చేశాడు. ఆఫీసు నుంచి తిరిగి వచ్చి యింట్లో రిలాక్సవుతున్న క్యారీ ఫోన్‌ తీసుకుంది. బ్రాడీ చెప్పినది విన్నాక బార్లో మత్తులో ఉండగానే, అనునయంగా మాట్లాడి, నిజాు కక్కించాలి అనుకుని నేను వస్తున్నా అంటూ వెంటనే బయుదేరింది. బార్‌లో అనేక రౌండ్ల మద్యం తాగుతూ యిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ క్రమంలోనే బ్రాడీ ఆమెకు నచ్చాడు. తక్కిన విషయా మాట ఎలా వున్నా పెద్దమనిషే అనిపించాడు.

మైక్‌ గొడవ గురించి బ్రాడీ ఉన్నదున్నట్లు చెప్పేశాడు. బాగా పొద్దు పోయేదాకా వుండి యిద్దరూ లేచారు. పార్కింగ్‌ స్థంలో ఉన్న క్యారీ కారు దగ్గరకు వచ్చి మాట్లాడుతూండగా క్యారీకి అతనిమీద అభిమానం ముంచుకు వచ్చి ‘‘హమీద్‌కు నువ్వే బ్లేడ్‌ యిచ్చావేమోనని మా వాళ్ల అనుమానం. అందుకే టెస్టుకి పిలిచారు.’’ అని చెప్పేసింది. ‘‘ఓకే’’ అంటూ అతను క్యారీ కేసి అభిమానంగా చూస్తూ ముద్దాడాడు. క్యారీ స్పందించింది. చివరకు యిద్దరూ కలిసి క్యారీ కారులోనే శృంగారంలో పాల్గొన్నారు.

సిఐఏలో ఐలీన్‌ గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఆమె ఒక అమెరికన్‌ ధనవంతుని కూతురు. చిన్న వయసులో వుండగా సౌదీ అరేబియాలో ఐదేళ్లు వుంది. అప్పుడే రకీమ్‌తో స్నేహం ఏర్పడి వుండాలి. అమెరికన్‌ విధానాకు ప్రతిఘటిస్తూ జి4 సమ్మేళనానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న దృశ్యం కనబడిరది. వీళ్లిలా వివరాు సేకరిస్తూండగానే రకీమ్‌, ఐలీన్‌ ఒక మోటల్‌లో మారుపేర్లతో బస చేశారు. అయినా వారిని టెర్రరిస్టు రహస్యంగా వెంటాడుతూనే వుండి వుండాలి. ఆమె బాత్‌రూమ్‌లో ఉన్న సమయంలో ఆ గదిపైకి మెషిన్‌గన్‌తో గుళ్లు కురిపించారు. రకీమ్‌ చనిపోయాడు. ఐలీన్‌ బాత్‌రూమ్‌ కిటికీ ద్వారా బయటకు తప్పించుకుని పారిపోయింది.

సాల్‌ పోలీగ్రాఫ్‌ టెస్టు పూర్తయ్యాక క్యారీ అడిగింది ` ‘‘నిన్న చేయలేక పోయావట’’ అని. ‘‘అవును, నా భార్య నన్ను విడిచి వెళ్లిపోతానంటూండంతో ఆందోళనగా వుంది. డేవిడ్‌తో చెప్పాను, నన్ను మళ్లీ ఫ్డీులోకి పంపేయి. న్యూఢల్లీికి పోస్టు చేస్తే సంతోషిస్తాను అని. అతను ఆలోచిస్తానన్నాడు. ఈ సంగతి చెపితే మీరా సంతోషపడలేదు. నువ్వేమీ ఢల్లీికి రానక్కరలేదు, ఒంటరిగానే వెళతానులే అంది. అంటే విడాకు తీసుకుందామనే అనుకుంటోందన్నమాట. ఇవన్నీ మనసులో మెదడంతో నిన్న పరీక్షలో ఫెయియ్యాను. అసటగా వుందని చెప్పి, యివాళ్టికి వాయిదా వేయించుకున్నాను.’’ అన్నాడు. అతనూ బ్లేడు యివ్వలేదని తేడంతో వదిలేశారు.

ఇక ముఖ్య అనుమానితుడు బ్రాడీ టెస్టు తీసుకుంటూండగా క్యారీ, సాల్‌ అబ్జర్వేషన్‌ రూములో కూర్చుని చూడసాగారు. బ్రాడీ తొణక్కుండా, బెణక్కుండా సమాధానాు చెప్పేస్తున్నాడు. బ్లేడ్‌ యిచ్చావా అంటే లేదని చెప్పాడు. క్యారీ ప్రశ్నలేసే అతన్ని మళ్లీ అదే ప్రశ్న వేయమంది. అతను వేశాడు. అయినా అదే జవాబు. టెస్టులో అబద్ధం చెప్పినట్లు ఏమీ రాలేదు. ఈసారి క్యారీ నీ భార్య పట్ల నమ్మకద్రోహం చేశావా? అని అడగమంది. ఆ ప్రశ్నకు బ్రాడీ ‘ఎన్నడూ లేదు’ అని చెప్పాడు. ముందు రోజు రాత్రి తనతో రమించి యీ రోజు యింత నిబ్బరంగా అబద్ధమాడ గలిగేవాణ్ని బ్రేక్‌ చేయడం కష్టమని క్యారీకి అర్థమైంది. కానీ ఆ విషయం సాల్‌తో చెప్పలేకపోయింది. ఎందుకంటే ఒక పక్క టెర్రరిస్టు అని అనుమానిస్తున్న వ్యక్తితో పడుక్కోవడమేమిటని అతను తిట్టవచ్చు.

బ్రాడీ టెస్టు పూర్తయింది. బయటకు వెళ్లాడు. సాల్‌ ‘‘ఇకపైనన్నా అతను టెర్రరిస్టు అనే అనుమానించడం మానేయ్‌‘’’ అన్నాడు. క్యారీ ఏమీ అనలేక త వూపింది. ఆఫీసు పని ముగిసింది కాబట్టి బయటకు కారు దగ్గరకు వచ్చింది. బ్రాడీ ఆమె వద్దకు వచ్చి స్నేహపూర్వకంగా నవ్వి, నాతో పాటు కారులో రా అన్నాడు. అతని నిజస్వభావం తెలియాంటే సన్నిహితంగా మెగక తప్పదనుకుందో లేక అతనిపై యిష్టం కలిగిందో తనకే తెలియకుండా క్యారీ అతని కారు ఎక్కింది.

కారులో బ్రాడీ క్యారీని అడిగాడు ` తను పాలీగ్రాఫ్‌ పరీక్ష పాసయినట్లేనా అని. నువ్వు అబద్ధాలాడడంలో ఎక్స్‌పర్ట్‌వి అయినట్లున్నావ్‌. నా విషయంలోనే అబద్ధమాడేశావు అంది క్యారీ. నా జీవితాన్ని కాపాడుకునే ప్రయాసలో అందరికీ అబద్ధాు చెప్పిచెప్పి అలా అయిపోయాను అన్నాడు బ్రాడీ. ‘నేను చచ్చిపోయాననుకుని మా ఆవిడ దారి తప్పిందన్న విషయం అర్థమవుతున్నా, ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. పైగా అది అందరికీ తెలిసిపోయిందన్న విషయం, నన్ను చూసి నవ్వుకుంటున్నారనే విషయం నన్ను దహించి వేస్తోంది. తనను దండిరచలేను, అలా అని క్షమించలేను. అందుకే ఆమె నుంచి యీ వీకెండ్‌ దూరంగా ఉందామని ఎక్కడికైనా వెళదామనుకుంటున్నా’ అని చెప్పాడు.

‘నాకూ వేరే పని లేదు. ఇద్దరం కలిసే తిరుగుదాం’ అంది క్యారీ. దారిలో ఓ బార్‌కి వెళితే అక్కడ నియో నాజీు క్యారీని వేధించారు. ఆమె వాళ్లను తన్ని బ్రాడీ సాయంతో బయటపడిరది. ‘బయట తిరిగితే యిలాటి గొడవలే వస్తాయి. మా కుటుంబానికి ఓ పల్లెటూళ్లో అడవు మధ్య ఓ కేబిన్‌ ఉంది. అక్కడకు పోదాం’ అంది క్యారీ. సరేనన్నాడు బ్రాడీ. కారు అటువైపు తిప్పారు.

ఐలీన్‌ టెక్సాస్‌కు వెళ్లి అక్కణ్నుంచి మెక్సికోకు బస్సు టిక్కెట్టు కొనుక్కుంది. ఆ విషయం సిఐఏకు తెలిసిపోయింది. మెక్సికన్‌ పోలీసు చేత ఆమెను అరెస్టు చేయిద్దామని డేవిడ్‌ అంటూంటే సాల్‌ ‘నేను విమానంలో మెక్సికో వెళ్లి ఆమెను కారులో వెంటపెట్టుకుని వస్తాను. 30 గంట ప్రయాణంలో ఆమెతో అనునయంగా మాట్లాడితే నోరు విప్పుతుందని నా నమ్మకం. ఆమె ప్రియుణ్ని నజీర్‌ చంపించాడు కాబట్టి, కసి వుండవచ్చు, భయమూ వుండవచ్చు. ఎఫ్‌బిఐ వాళ్లు మామూు పద్ధతుల్లో హింస పెడితే ఏమీ చెప్పకపోవచ్చు.’’ అన్నాడు. డేవిడ్‌ సరేనంటే బయుదేరాడు. ఇంటిగొడవ నుంచి ఈ ప్రయాణం ఒక రిలీఫ్‌ యిస్తుందని కూడా అతనికి తోచింది.

బ్రాడీ, క్యారీ కాబిన్‌ చేరారు. తాళంచెవి కనబడలేదు. క్యారీ అక్కకు ఫోన్‌ చేసి ఎక్కడుందో కనుక్కుని తుపు తీసి, ముందుగా లోపలికి వెళ్లి రివ్వార్‌ తీసుకుని దానిలో గుళ్లు లోడ్‌ చేసి డ్రాయర్లో పెట్టింది.  తర్వాత బ్రాడీని లోపకి పిలిచి సరసాలాడసాగింది. ఇద్దరూ చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నట్టే ఎదుటివాళ్లకు కనబడ్డారు. కాస్సేపటిలోనే సెక్స్‌లో పాల్గొన్నారు. మర్నాడు పొద్దున్న లేచి దగ్గర్లో ఉన్న చెఱువు దగ్గరకు వెళ్లారు. అవీయివీ మాట్లాడుకున్నారు. ‘నీతో ఉన్నంత కులాసాగా నా భార్యతో కూడా లేను’ అన్నాడు బ్రాడీ.

క్యారీకి కూడా అతనంటే అభిమానం పుట్టుకువచ్చింది. తన తల్లి గురించి, కుటుంబం గురించి అతనితో చెప్పింది. ఆ రాత్రి మద్యం తీసుకోకూడదని నిశ్చయించుకున్నారు. సాధారణంగా వంట చేయని క్యారీ అవేళ డిన్నర్‌ వండిరది. భోజనం చేసి, మళ్లీ శృంగారంలో పాల్గొన్నారు. చాలా హాయిగా అనిపించింది యిద్దరికీ. త్లెవారురaామున బ్రాడీకి పీడక వచ్చింది. ‘‘ఐసా, ఐసా’’ అని పవరించాడు. క్యారీ అతన్ని ఓదార్చి పడుక్కోబెట్టింది.

ఇతనిలా వుండగా అతని యింటి దగ్గర నానా గొడవగానూ వుంది. చెప్పాపెట్టకుండా మొగుడు మాయమై పోవడంతో, ఫోన్‌ తీయకపోవడంతో జెసికా కంగారుపడిరది. కూతురు డానా ‘అంతా నీ వనే జరిగింది’ అని నిందించింది. జెసికాకు కోపం వచ్చి ‘మూడు రోజు పాటు య్లిు వదిలి వెళ్లడానికి వీల్లేద’ంది. మర్నాడు డానా స్నేహితు వచ్చి వీకెండ్‌కు బయటకు వెళదామని అడిగితే కుదరదని చెప్పి యింట్లోనే వాళ్లతో కలిసి మందు కొట్టి, డ్రగ్స్‌ తీసుకుంది. ఆ మత్తులో ఓ గ్లాసుడోరుకి వెళ్లి కొట్టుకుని చెయ్యి గాయపరచుకుంది. తల్లి గాభరా పడిపోయి, మైక్‌కు కబురు పెట్టి, కూతుర్ని తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లింది.

అవత ఐలీన్‌ బస్సు దిగేసరికి మెక్సికో పోలీసు సిద్ధంగా ఉన్నారు. వారితో బాటు సాల్‌ కూడా. నాతో పాటు వస్తే వర్జీనియాకు కారులో తీసుకెళతా. లేదంటే మెక్సికో పోలీసు నిన్ను తీసుకెళ్లి ఎఫ్‌బిఐకు అప్పగిస్తారు అన్నాడు. అతని పెద్దరికం, వాత్స్యం చూసి ఐలీన్‌ అతనితో వెళ్లడానికి నిశ్చయించుకుంది కానీ ఎంత ఆప్యాయంగా మాట్లాడినా చాలాసేపు నోరు విప్పలేదు. సాల్‌ భార్యతో తనకున్న గొడమ అవీ మాట్లాడి, నీ గురించి కొన్ని వివరాు మాకు యిప్పటికే తెలిశాయి, నువ్వు ఖాళీు పూరించవచ్చు అన్నాడు.

‘మీ నాన్న వ్యాపారరీత్యా సౌదీ అరేబియాలో ఉన్నపుడు నువ్వు చిన్నప్లివి. బహుశా రకీమ్‌ చుట్టుపట్ల ఆడుకునే బీద కుర్రవాడై వుంటాడు. అతనితో స్నేహం చేసినందుకు మీ నాన్న తిట్టి వుంటాడు’ అని సాల్‌ అనగా ఐలీన్‌ ‘అవును, ఒక బ్రౌన్‌తో ప్రేమేమిటి?’ అన్నాడంది ఐలీన్‌. ‘నా భార్య కూడా బ్రౌనే. ఇండియన్‌.’ అన్నాడు సాల్‌. దారిలో ఇండియానాలో సాల్‌ సొంత వూరు తగిలింది. తన పాత యింటికి తీసుకెళ్లి, తనది యూదుకుటుంబమని, యింట్లో చాలా ఛాందసత్వం ఉండేదని అన్నీ చెప్పుకుని వచ్చాడు.

ఒక పోలీసు అధికారిలా కాకుండా ఆత్మీయుడిగా, ఒక మేనమామలా మాట్లాడడంతో ఐలీన్‌ కరిగిపోయింది. రకీమ్‌కు సరైన ఇస్లామిక్‌ అంత్యక్రియు జరిపించానే షరతుపై నోరు విప్పి మాట్లాడసాగింది. చిన్నపుడు పరిచయమైన రకీమ్‌ పెద్దయ్యాక మళ్లీ ఎలా కలిశాడో, తన మీద ప్రేమతో టెర్రరిస్టుకు ఎలా తోడ్పడ్డాడో తనకు తెలిసున్నదంతా చెప్పింది. సెల్‌ఫోన్‌ ద్వారా తనకు ఆదేశాు వచ్చేవని, ఎయిర్‌పోర్టు దగ్గర ఫలానా య్లిు తీసుకోమని చెపితే తీసుకున్నానని చెప్పింది. ఓ రోజు ఒక అమెరికన్‌ వాళ్లింటికి వచ్చాడని, వాళ్ల యింటి కప్పు మీద ఒక గంటసేపు కూర్చుని వెళ్లాడని చెప్పింది. సాల్‌ వెంటనే ఆమెను స్కెచ్‌ ఆర్టిస్టు వద్దకు తీసుకెళ్లి ఆ అమెరికన్‌ బొమ్మ గీయించాడు.

ఓ పక్కన అది జరుగుతూండగానే డేవిడ్‌కు ఫోన్‌ చేసి ఐలీన్‌ చెప్పినదంతా చెప్పాడు. డేవిడ్‌ తన వద్ద పనిచేసే గాల్వెజ్‌ అనే అతన్ని ఆ యింటికి పంపాడు. ఆ యింటి కప్పు మీద నుంచి చూస్తే అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే మెరీన్‌ ఒన్‌ అనే హెలికాప్టర్‌ దిగే హెలిపాడ్‌ కనబడుతోంది. సరిగ్గా మైు దూరం. ఎక్స్‌పర్ట్‌ అయిన షూటర్‌ అక్కణ్నుంచి హెలికాప్టర్‌లో దిగే అధ్యక్షుణ్ని కాల్చేసేయవచ్చు. ఇది తెలియగానే సాల్‌, డేవిడ్‌ ఉలిక్కిపడ్డారు. సాల్‌కు గబుక్కున ఒకవేళ క్యారీ అనుకున్నది నిజమేనేమో, బ్రాడీయే ఐలీన్‌ను కలిసిన అమెరికన్‌యేమో అని అనుమానం వచ్చింది. అతని ఫోటో వెంటనే తనకు పంపితే, ఐలీన్‌కు చూపి నిర్ధారించుకుంటానని అన్నాడు.(సశేషం)  (ఫోటో ఎడమవైపు రకీమ్, ఐలీన్ కుడివైపు మీరా (పాత్రధారిణి భారతీయ మూలాలున్న సరితా చౌధురి, సాల్) 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?