Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఈవారం జాతక ఫలితాలు

ఈవారం జాతక ఫలితాలు

రాశిఫలాలు...25.03.18 నుంచి 31.03.18 వరకు

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మేషం...
వ్యూహాత్మకంగా వ్యవహరించి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులు సహకరిస్తారు. రాబడి పెరిగి అప్పులు తీరి ఊరట చెందుతారు. భూములు, భవనాలు కొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు  పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు ఎదురుచూస్తున్న పదవులు దక్కే అవకాశం. కళాకారులు ఉత్సాహంగా సాగుతారు. అవార్డులు లభించవచ్చు. మహిళలకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. అశ్వని వారికి సోమవారం ఉద్యోగయత్నాలు సఫలం. ఆకస్మిక ధనలాభం. గురువారం వివాదాలు. చోరభయం., భరణి వారికి బుధవారం శుభవార్తలు. వాహనయోగం. శనివారం అనారోగ్యం, కుటుంబంలో చికాకులు. కృత్తిక 1వ పాదం వారికి ఆదివారం విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. గురువారం అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

వృషభం...
పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గం నుంచి ఒత్తిడులు నిర్ణయాలలో జాప్యం. ఆర్థిక వ్యవహారాలలో హామీలు వద్దు. రాబడి కొంత నిరాశ పరుస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు. కొత్త వ్యాపారయత్నాలు మందగిస్తాయి. పెట్టుబడులు సకాలంలో అందకపోవచ్చు. ఉద్యోగులకు పనిభారం, ఇంక్రిమెంట్లు నిలిచిపోయే అవకాశం. పారిశ్రామికవేత్తలకు ఆటంకాలు. రాజకీయరంగంవారికి అవకాశాలు తృటిలో చేజారతాయి. మహిళలు ఆరోగ్యం విషయంలో పాటించాలి. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. కృత్తిక 2,3,4పాదాల వారికి ఆదివారం విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. గురువారం అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. రోహిణి వారికి సోమవారం ఆస్తి వివాదాలు. మానసిక అశాంతి. గురువారం విందువినోదాలు. కార్యజయం. మృగశిర 1,2పాదాల వారికి మంగళవారం ఒత్తిడులు.అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. శనివారం కార్యజయం. వాహనయోగం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి.

మిథునం.....
కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నైపుణ్యానికి తగిన గుర్తింపు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలోని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది.ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. విస్తరణయత్నాలు సఫలం. ఉద్యోగులకు ఆశించిన విధంగా పదోన్నతులు రాగలవు. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. మహిళలకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. షేర్ల విక్రయాల్లో లాభాలు. మృగశిర 3,4పాదాల వారికి మంగళవారం ఒత్తిడులు.అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. శనివారం కార్యజయం. వాహనయోగం. ఆరుద్ర వారికి ఆదివారం వ్యయప్రయాసలు. చోరభయం. అనారోగ్యం. గురువారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పునర్వసు 1,2,3పాదాల వారికి మంగళవారం వివాదాలు. మానసిక ఆందోళన. శుక్రవారం వాహనయోగం. చర్చలు సఫలం. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

కర్కాటకం...
నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో విజయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతమిత్రులు కలుస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులను చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు. నూతన పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులు, రాజకీయవర్గాలవారు కొత్త∙అవకాశాలు దక్కించుకుని ముందుకు సాగుతారు. మహిళలకు విశేష యోగదాయకంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.పునర్వసు 4వ పాదం వారికి మంగళవారం వివాదాలు. మానసిక ఆందోళన. శుక్రవారం వాహనయోగం. చర్చలు సçఫలం. పుష్యమి వారికి ఆదివారం కార్యజయం. భూలాభాలు. బాకీలు వసూలవుతాయి.గురువారం వ్యయప్రయాసలు.చోరభయం. ఆశ్లేష వారికి సోమవారం కీలక నిర్ణయాలు. విందువినోదాలు. వాహనసౌఖ్యం. గురువారం ఖర్చులు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం...
ప్రతిభాపాటవాలకు గుర్తింపు లభించే సమయం. ఆప్తులు చేదోడుగా నిలుస్తారు. పనుల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సమస్యలు తీరతాయి. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.ఇంటి నిర్మాణాలు చేపడతారు. కొత్త వ్యాపారాలు చేపడతారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. కళాకారులకు అవార్డులు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. మఖ వారికి ఆదివారం కార్యజయం. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. బుధవారం వృథా ఖర్చులు. మానసిక అశాంతి. పుబ్బ వారికి మంగళవారం కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. శుక్రవారం చర్చలు విçఫలం. అనారోగ్యం. ఉత్తర 1వ పాదం వారికి బుధవారం చర్చలు సఫలం. విందువినోదాలు. శుక్రవారం చోరభయం. మానసిక అశాంతి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

కన్య...
ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. బంధువులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందుతారు. ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. రాబడి పెరుగుతుంది. వ్యాపారులు ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. కొత్త పెట్టుబడులకు సానుకూలమైన వారం. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. అధికారుల ప్రశంసలు. కళాకారులకు అనుకోని అవకాశాలు  ఆశ్చర్యపరుస్తాయి. మహిళలకు సంతోషరమైన సమాచారం.. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఉత్తర 2,3,4పాదాల వారికి బుధవారం చర్చలు సçఫలం. విందువినోదాలు. శుక్రవారం చోరభయం. మానసిక అశాంతి. హస్త వారికి ఆదివారం వ్యయప్రయాసలు. చోరభయం. మానసిక ఆందోళన. గురువారం వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. చిత్త 1,2పాదాల వారికి సోమవారం వివాదాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. బుధవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

తుల....
కొన్ని కార్యక్రమాలలో జాప్యం. పట్టుదల పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆదాయం కాస్త మెరుగుపడుతుంది. ఉద్యోగులు ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. లాభాలు అందుతాయి. రాజకీయరంగం వారికి కొత్త పదవులు దక్కే ఛాన్స్‌. ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు. మహిళలు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. షేర్ల విక్రయాలు సామాన్యంగా లాభిస్తాయి. చిత్త 3,4పాదాల వారికి సోమవారం వివాదాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. బుధవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్వాతి వారికి బుధవారం ఆకస్మిక ధన,వస్తులాభాలు. కొన్ని వివాదాల పరిష్కారం. శనివారం అనుకోని ఖర్చులు. మిత్రులతో విభేదాలు.విశాఖ 1,2,3పాదాల వారికి మంగళవారం ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో విరోధాలు. శుక్రవారం వస్తులాభాలు.ఆకస్మిక ధనలాభం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాఛాలీసా పఠించండి.

వృశ్చికం...
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సోదరులతో వివాదాల సర్దుబాటు కాగలవు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. మీకు అన్నింటా కుటుంబసభ్యులు చేయూతన్తిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వివాహ,ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులు పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీయానం. కళాకారులకు సన్మానాలు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.విశాఖ 4వ పాదం వారికి మంగళవారం ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో విరోధాలు. శుక్రవారం వస్తులాభాలు.ఆకస్మిక ధనలాభం. అనూరాధ వారికి ఆదివారం కార్యజయం. ధన, వస్తులాభాలు. ఆస్తిఒపμందాలు. బుధవారం అనారోగ్యం. బంధువిరోధాలు. జ్యేష్ఠ వారికి బుధవారం ధననష్టం. కుటుంబంలో సమస్యలు. శనివారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు....
ఈ వారం కొన్ని పనులు వాయిదా వేస్తారు. రాబడి కొంత సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సంçఘంలో గౌరవం. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాల్లో .కొద్దిపాటి లాభాలు లభిస్తాయి. పెట్టుబడులలో తొందరవద్దు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కళాకారులు ఉత్సాహంగా గడుపుతారు. సన్మానాలు. మహిళలకు అన్నింటా విజయం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. మూల నక్షత్రం ఆదివారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన. చర్చలు విఫలం. బుధవారం కీలక నిర్ణయాలు. కార్యజయం. పూర్వాషాఢ వారికి మంగళవారం వ్యయప్రయాసలు. చోరభయం. సమస్యలు ఎదుర్కొంటారు. శుక్రవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సోమవారం మానసిక అశాంతి. చోరభయం. బుధవారం విందువినోదాలు. ఆర్థిక లాభాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మకరం....
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన విద్యావకాశాలు లబిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు.ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టు పనులు చేపడతారు. ఆలయాలు సందర్సిస్తారు. సంçఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త వ్యాపారాలు చేపడతారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. మహిళలకు అరుదైన సత్కారాలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఉత్తరాషాఢ 2,3,4పాదాల వారికి సోమవారం మానసిక అశాంతి. చోరభయం. బుధవారం విందువినోదాలు. ఆర్థిక లాభాలు. శ్రవణం వారికి ఆదివారం అనుకోని ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఒత్తిడులు పెరుగుతాయి. గురువారం కార్యజయం. భూలాభాలు. ధనిష్ట 1,2పాదాల వారికి సోమవారం చర్చలు సఫలం. విందువినోదాలు. ఒపμందాలు. బుధవారం ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు.

కుంభం...
పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితి. మిత్రులతో ముఖ్యæ విషయాలు చర్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు ఆలస్యమవుతాయి. లాభాలు ఉంటాయి.ఉద్యోగులకు కొన్ని మార్పులు జరిగే సూచనలు. రాజకీయరంగం వారికి అనుకూల సమయం. మహిళలకు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. ధనిష్ట 3,4పాదాల వారికి సోమవారం చర్చలు సçఫలం. విందువినోదాలు. బుధవారం ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. శతభిషం వారికి మంగళవారం అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. శుక్రవారం విందువినోదాలు. కార్యసిద్ధి. వాహనయోగం. పూర్వాభాద్ర 1,2,3పాదాల వారికి ఆదిЫéరం కీలక నిర్ణయాలు. నూతన . ధనప్రాప్తి. బుధవారం మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మీనం...
ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి. గతంలో జరిగిన సంఘటన గుర్తుకువస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ప్రమోషన్‌ అవకాశాలు. రాజకీయరంగం వారికి కొత్త పదవులు దక్కుతాయి. ప్రజాదరణ పొందుతారు. మహిళలకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి ఆదివారం కీలక నిర్ణయాలు. నూతన ఒపμందాలు. ధనప్రాప్తి. బుధవారం మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. ఉత్తరాభాద్ర వారికి సోమవారం వివాదాలు. మానసిక ఆందోళన. చర్చలు విçఫలం. బుధవారం విందువినోదాలు. కార్యసిద్ధి. రేవతి వారికి బుధవారం అనుకోని ఖర్చులు. వ్యయప్రయాసలు. చోరభయం. శనివారం వస్తులాభాలు. నూతన ఒపμందాలు. తూర్పు..

దిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.

Vakkantham Chandramouli
Phone: (91) 98852 99400, (91) 99634 70077
Email: [email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?