ఎయిర్‌టెల్‌ సిగ్నల్స్‌ కట్‌.. గోటు హెల్‌.!

ఏమయ్యిందో తెలియదు.. ఈ రోజు ఉదయం నుంచీ హైద్రాబాద్‌లో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ డౌన్‌ అయ్యింది. మొబైల్స్‌లో సిగ్నల్స్‌ కట్‌ అయ్యాయి. మామూలుగా అయితే ఇలాంటి టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌కి ఎవరూ ఏమీ చేయలేదు. త్వరితగతిన పరిస్థితిని…

ఏమయ్యిందో తెలియదు.. ఈ రోజు ఉదయం నుంచీ హైద్రాబాద్‌లో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ డౌన్‌ అయ్యింది. మొబైల్స్‌లో సిగ్నల్స్‌ కట్‌ అయ్యాయి. మామూలుగా అయితే ఇలాంటి టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌కి ఎవరూ ఏమీ చేయలేదు. త్వరితగతిన పరిస్థితిని సమీక్షించి, నెట్‌వర్క్‌ని పునరిద్ధరించాల్సి వుంటుంది. ఆ పనిలో ఎయిర్‌టెల్‌ సంస్థ ఇప్పటికే పని ప్రారంభించి వుండాలి.

కానీ, మొబైల్‌ ఇప్పుడు నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది. పొద్దున్నే నిద్రలేచాక బెడ్‌ కాఫీ తాగే అలవాటు చాలామందికి వుండొచ్చు, వుండకపోవచ్చుగానీ.. మొబైల్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ దాన్ని ఓ సారి చూసుకోవాల్సిందే. ఎటు చూసినా స్మార్ట్‌ ఫోన్లే కదా.. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఈ`మెయిల్‌.. ఇలా స్మార్ట్‌ ఫోన్‌లోని ఏదో ఒక ఫీచర్‌ని ఓపెన్‌ చెయ్యాల్సిందేనని అనుకోనివారుండరు. అలాంటివారికి ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ డౌన్‌ అయ్యేసరికి ‘గోటు హెల్‌..’ అన్నంత పనయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎయిర్‌టెల్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది.

వ్యాపార కార్యకలాపాలు, ఇతరత్రా అనేక కార్యక్రమాలు (ముఖ్యంగా మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటివి) నిలిచిపోయేసరికి, పరిస్థితి అత్యంత దారుణంగా తయారయ్యిందని వినియోగదారులు వాపోతున్నారు. ఎయిర్‌టెల్‌ ఆఫీసుల చుట్టూ వినియోగదారులు చక్కర్లు కొడుతోంటే, వారికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదు సిబ్బందికి. హమ్మో.. ఒక్క రోజుకీ.. అదీ నాలుగైదు గంటలకే పరిస్థితి ఇలా వుంటే, ఏదన్నా సాంకేతిక సమస్య వచ్చి ఓ రెండు మూడు రోజులు మొత్తం మొబైల్‌ నెట్‌ వర్క్‌ బ్లాక్‌ అయితే ఇంకేమన్నా వుందా.?