ఆంధ్రుల అమరావతి అభివృధ్హిలో ప్రవాసాంధ్రుల పాత్ర గురించి ఆంధ్ర ప్రదేశ్ సభాపతి గౌరవనీయులు కోడెల శివప్రసాద్ రావు గారు ,గౌరవ పార్లమెంట్ సభ్యులు సి ఎం రమేష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎలమంచిలి శివాజీ గారితో ఒక టివి వ్యాఖ్యాత విజయ్ నిర్వహించిన చర్చ కార్యక్రమము
ఆంధ్రుల మొదటి రాజధాని, శాతవాహనుల పరిపాలన కేంద్రము, పంచారామాలలో ఒకటైన , ధాన్యకటకంగా పేరు గాంచిన, బౌద్ధ, జైన మత కేంద్రంగా, అమరలింగేశ్వర స్వామి ఆలయ నిలయంగా విలసిల్లిన అమరావతి గురించి ఒక అద్భుతమైన ఆడియో విజ్యుల్ ప్రోగ్రాంతో చర్చ కార్యక్రమము మొదలైంది
మొదటిగా టివి 5 యాంకర్ శ్రీ విజయ్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణంతో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి ఎలా ముడిపడిందో వివరించారు తరువాత శ్రీ కోడెల గారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం, దాని అవశక్యత గురించి మాట్లాడారు. తన ప్రసంగం ఆయన వివిధ అంశాలు, రాజకీయ ప్రయోజనాలు కోసం ఆంధ్ర ప్రదేశ్ ను విభజించిన తీరు విభజన క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన జరిగిన అన్యాయం, ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ గురించిన అంశాల పై ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ ఎటువంటి అవమానాలు, ఆటుపోట్లు నుంచి అయిన తిరిగి ఉజ్జ్వల స్థాయికి చేరుక్కున్తుందన్న ప్రగాడ ఆశాభావం వ్యక్త పరిచారు. రాష్ట్రాలు విడిపోయిన, మనుషులు కలిసి వుండాలని, కలిసి ఎదగాలని ఆకాక్షించారు. ఆంధ్ర ప్రదేశ్ కి ఉన్న పురోగతి కి ఉన్న బలాలు- నీటి లభ్యత, సారవంతమైన భూమి, మానవ వనరులు,వివిధ రంగాలొ పేరు గాంచిన, వ్రుత్తి నిపుణులు గురించి ప్రస్తావించారు
ప్రత్యేకించి, రాజధాని గా అమరావతిని ఎంపిక గల కారణాలు- నది అభిముఖం, చారత్రిక ప్రాధాన్యం,రాష్ట్ర మధ్యలో వుండటం-వివరించారు.
రాజధాని నిర్మాణకి 33000 ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చిన రైతుల అద్వితనియమైన సహకారం, ప్రభుత్వం భూ సమీకరణ విధానం, అద్భుతమైన ప్యాకజ్ గురించి ప్రసంశించారు
సింగపూర్, జపాన్ భాగస్వామ్యం, రాజధాని పై ప్రభుత్వంకు ఉన్న స్పష్టమైన విధానం- మూడు అంచెలుగా రాజధాని నిర్మాణం, కేవలం రాజకీయ రాజధానిగానే కాకుండా,ఒక సాంసృతిక, ఆర్ధిక రాజధానిగా, పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా అభివృద్ధి చెయ్యాలన్న ప్రభుత్వ దార్శనికత , దృఢ సంకల్పం, సమర్ధవంతమైన నాయకత్వం గురించి ప్రస్తావించారు
శ్రీ కోడెల గారు మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల సహకారం ఎంతైనా అవసరం ఉందన్నారు, ప్రవాసాంధ్రుల కార్యదక్ష్యత, క్రమశిక్షణ నూతన రాజధాని నిర్మానంకి తోడ్పదతాయ్ అన్నారు
ఈ సందర్భముగా ప్రముఖ వైద్య నిపుణులు శ్రీ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ అమరావతి కున్న నామ బలం, సమర్ధుడైన ముఖ్యమంత్రితో నవ్యన్ధ్రప్రదేశ్ రాజధాని మంచి పురోగతి సాధించాలని ఆకాంక్షిచారు
పార్లమెంట్ సభ్యులు శ్రీ సి ఎం రమేష్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని నిర్మాణలో ప్రవాసాంధ్రుల సహకారం కున్న అవకాశాలు వివరించారు, ఇతర రాజధానుల అధ్యయన క్రమం తదితర అంశాల గురించి ప్రస్తావించారు
మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎలమంచిలి శివాజీ గారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకించి క్షేత్ర స్థాయి సిబ్బంది, ఎంత తొందరగా హైదరాబాద్ నుంచి మారితే ఆంధ్ర ప్రదేశ్ పురోగతి , రాజధాని అభివృద్ధి కి అంత మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు
ఈ సందర్భంగా మాట్లాడిన వివిధ ప్రవాసాంధ్రులు పదవి విరమణ చేసిన ప్రవాస వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు