బాహుబలి టెన్షన్..టెన్షన్..

బాహుబలి సినిమాకు ఇంకా రీరికార్డింగ్ జరుగుతోందా? అదే పనిలో రాజమౌళి, కీరవాణి అండ్ కో బిజీగా వున్నారా? పదో తేదీ విడుదల. అంతకు ముందు క్యూబ్ వర్క కావాలి..హార్డ్ డిస్క్ లు ఓవర్ సీస్…

బాహుబలి సినిమాకు ఇంకా రీరికార్డింగ్ జరుగుతోందా? అదే పనిలో రాజమౌళి, కీరవాణి అండ్ కో బిజీగా వున్నారా? పదో తేదీ విడుదల. అంతకు ముందు క్యూబ్ వర్క కావాలి..హార్డ్ డిస్క్ లు ఓవర్ సీస్ కువెళ్లాలి. అంటే కనీసం ఎనిమిది నాటికైనా అవి బయల్దేరాలి. 

కేవలం ఇక నాలుగు రోజులే వుంది. కీరవాణి బర్త్ డే శనివారం నాడు. అయినా ఆయన సెలబ్రేషన్స్ కు దూరంగా ముంబాయిలోనే వున్నారు. రాజమౌళి తెలుగుకు సంబంధించి ఇంతవరకు వెబ్ సైట్లకు ఇంటర్వూలే ఇవ్వలేదు. ఇంగ్లీష్ మీడియాను ఇక్కడ అస్సలు టచ్ చేయలేదు. 

సరే ఇంటర్వూలు ఏమీ కీలకం కాదు. సినిమా ఫినిషింగ్ ముఖ్యం. మొన్నటి దాకా ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడని ఓ టాక్ వినిపించింది. ఈ లెక్కన కనీసం ఒకటి రెండు రోజులు పని వుండి వుండాలని అని లెక్కలు కడుతున్నారు. మొత్తం మీద సోమవారం నాటికి పని పూర్తి కాకుండా టెన్షన్ మరింత పెరిగిపోతుంది.