హైద్రాబాద్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ ఆచూకీ దొరికింది. ఆమెను పోలీసులు క్షేమంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన భార్య కన్పించడంలేదంటూ కార్తీక్ పోలీసులను ఆశ్రయించేసరికి, హైద్రాబాద్‌లో కలకలం సృష్టించింది భవ్యశ్రీ మిస్సింగ్ వ్యవహారం. అయితే పోలీసులు ఆమెను విశాఖ జిల్లాలో పట్టుకునేసరికి అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
‘రిలీఫ్ కోసమే విశాఖకు వెళ్ళా..’ అని భవ్యశ్రీ చెప్పడం షాకింగ్ థింగ్. కారణాలేవైనా.. భవ్యశ్రీ ఎపిసోడ్ సుఖాంతమయ్యింది. భర్తతో తగాదాల్లేవు.. కుటుంబ సభ్యులతోనూ విభేదాల్లేవు.. ఇంతకీ భవ్యశ్రీ ఎవరికీ చెప్పకుండా ఎందుకు విశాఖకు వెళ్ళినట్లు.? మీడియాలో ఒక రోజంతా తన గురించి గందరగోళం చోటుచేసుకున్నా తన ఆచూకీని భవ్యశ్రీ చెప్పకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే.
ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయిన దరిమిలా, భవ్యశ్రీ మిస్సింగ్ ఎపిసోడ్ కలకలం సృష్టించింది. ఎలాగైతేనేం.. ఆమె క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుంది. కథ సుఖాంతమయ్యింది. మధ్యలో పోలీసులకే టెన్షన్ టెన్షన్ అన్నమాట.