ఒకవర్గం మీడియాపై చాగంటి శిష్యుల ఫైర్..!

ఆధ్యాత్మిక బోధనలతో.. భాగవతం గురించి పారవశ్యంతో బోధించే బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు కు ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న తెలుగు వాళ్లలో మంచి ఆదరణ విషయం తెలిసిందే. ఈయన భాగవత ప్రవచనానికి రాష్ట్రంలో లక్షల మంది…

ఆధ్యాత్మిక బోధనలతో.. భాగవతం గురించి పారవశ్యంతో బోధించే బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు కు ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న తెలుగు వాళ్లలో మంచి ఆదరణ విషయం తెలిసిందే. ఈయన భాగవత ప్రవచనానికి రాష్ట్రంలో లక్షల మంది అభిమానులున్నారు.

పోతన విరచిత భాగవత కావ్యంలోని పాదాలను అలవోకగా చెప్పగలడం ఈ పండితుడి ప్రతిభకు నిదర్శనం. జనరంజకంగా వాటిని వివరించే తీరు కూడా అద్భుతం. మరి ఈ పండితుడిని ఇప్పుడు కొన్ని మీడియా వర్గాలు రాజకీయంలోకి లాగినట్టుగా ఉన్నాయి. అది కూడా పుష్కర రాజకీయం లోకి.

తొలి రోజు రాజమండ్రిలో జరిగిన ప్రమాదం అనంతరం కొన్ని మీడియా వర్గాలు చాగంటిని లక్ష్యంగా చేసుకొన్నాయట. తమ ముఖ్యుడిని రక్షించుకోవడానికి అనేక ఎత్తులు వేసి.. చివరగా చాగంటిని కూడా వదలలేదని సమాచారం. దీంతో ఆగ్రహించిన చాగంటి శిష్యులు సోషల్ నెట్ వర్కింగసైట్లలో ఆ మీడియా వర్గాలపై ఫైర్ అవుతున్నారు. ఈ విధమైన పోస్టులు పెడుతున్నారు…

” ఒరేయ్ దొంగ మీడియా లారా ఈయన చేసిన నేరం ఏంటి ? మీలాగా హత్యలు చేసాడా ? దోపిడీలు .మాన భంగాలు చేసాడా ..దేశం లో సొమ్ము ..ప్రజల సొమ్ము అవినీతి చేసి బష్తాలకి బస్తాలు విదేశాలలో దాచాడా ?ప్రభుత్వ భూములు కబ్జా చేసాడా ? మోసాలు ..అబద్ధాలు చెప్పి ప్రజలని మోసగించి .బెదిరించి .హత్యలు చేసి వోట్లు వేయించుకున్నాడా ? లేక ప్రజా ధనం తో విదేశాలు తిరుగుతూ విలాసాలు చేస్తున్నాడా ?భారతదేశం లో హిందూ ధర్మం గురించి బోధించడమా ఈయన చేసిన పాపం ..ఏం చేసాడని అసత్య ప్రసారాలు చేస్తున్నారురా ..మీకు పుట్ట గతులు వుండవు ..ఈ విర్ర వీగే బతుకు ప్రజలకి తెలియంది కాదు ..ఒకడు విద్యార్ధుల బిక్ష తో గుడివాడ లో చదివాడు ..తినడానికి తిండి ..కట్టు కోవడానికి బట్ట వచ్చే సరికి పుట్టుక మర్చిపోయాడు ? ఇంకొకడు ఒక గూండాలా విలేఖరి అవతారం లో ఎంతో మంది అమాయకుల కష్టార్జితాన్ని దోచిన దుర్మార్గుడు ..ఒరేయ్ దోచేసే దొంగల్లారా ..బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మీద కధనాలు రాస్తే గుడ్డి వాళ్ళు అయిపోతారురా ..అడుక్కు తిందామన్నా దారి కనపడడురా ..ఛండాలపు జీవితాలు వెంటనే వస్తాయి ..నీచుల్లారా ..మీకు పాలకులని అడిగే దమ్ము లేని కొజ్జాల్లారా ..తలలు పది చెక్కలై చచ్చిపోతారురా ..బ్రాహ్మణుల ఇళ్ళలో అన్నం తిని వారు ఇచ్చిన బట్టలు కట్టుకుని పెద్ద వాడివి అయిపోయి తిరిగి ఆ బ్రాహ్మణులనే అవమానిస్తావా ? మీకు పోయే కాలం వచ్చింది ..పోతారు ..మీ చచ్చిన శవాలు రాబందులు పీక్కు తింటాయి ..మిమ్మల్ని దహనం చేసే వాడు కూడా ఉండడు…సిగ్గులేని చెత్త వెధవల్లారా ….''' 

మరి చాగంటి శిష్యులమాటలకు భుజాలు తడుముకోవాల్సింది ఎవరబ్బా..!