సినిమా చూపిత్త మావా…!

వురే అప్పోజీ..మళ్లీ సినిమా కెళ్లాలంటే కాస్త భయంగా వుందిరా.. Advertisement ఏట్రా గోపాలం..ఏమయింది. నిన్న సిన్మాకెళ్లాం మావా..చాన్నాళ్లయిందని సంపత్ నంది బొమ్మకు ఎళ్లా.. చాన్నాళ్లయింది..సినిమా చూసా…సంపత్ నంది సినిమా తీసా?  రెండూ అనుకో. ఇప్పుడది…

వురే అప్పోజీ..మళ్లీ సినిమా కెళ్లాలంటే కాస్త భయంగా వుందిరా..

ఏట్రా గోపాలం..ఏమయింది.

నిన్న సిన్మాకెళ్లాం మావా..చాన్నాళ్లయిందని సంపత్ నంది బొమ్మకు ఎళ్లా..

చాన్నాళ్లయింది..సినిమా చూసా…సంపత్ నంది సినిమా తీసా? 

రెండూ అనుకో. ఇప్పుడది కాదు ముఖ్యం..ఎలాటోడు ఎలాంటి బొమ్మ తీసాడు.

ఏం ఏటయిందేటి? పటం బాగానే వుంది..బాగానే ఎగుర్తోంది అంటున్నారుగా..

ఏటి ఎగరడం..డైలాగులు వింటే గుండె గుభేలైపోతాంది..అయినా వురే హైదరాబాద్ లో అబ్బాయిలకు ఇన్ని ఉద్యోగాలున్నాయనుకున్నా కానీ, ఇలాంటి 'డబుల్'పర్పస్ ఉద్యోగాలు వుంటాయనుకోలేదురా..

నీకు తెల్దులేరా..ఎక్కడో పెద్ద పెద్దోళ్ల దగ్గరుంటాయి.మామూలు జనానికి ఏం తెలుస్తాయి..

మరెందుకురా..మామూలు జనానికి చెప్పి ఆల్లని చెడగొట్టడం..

కొత్తగా ఏదైనా చెప్పాలని అంటుంటారుకదా..అందుకే కాబోసు..

బాగానే వుంది సంబడం..అయినా ఆ భార్గవి ఏట్రా అలా అడిగేస్తది..నాకు వారానికి నాలుగు రోజులు కావాలని వుంటదంటది..

దానికే వుంది ఆశలు ఎవరికైనా వుంటాయి..సంపత్ నందికి మాత్రం ఏడాదికి రెండు సినిమాలు చేయాలని వుండదేటి? పాపం ఒక్కసినిమాకే లాకైపోయి..ఇప్పటిదాకా మళ్లీ సినిమా చేయలేకపోయాడు..

అవును..నువు చూసావా..బొమ్మ…

ఆ మొదటిరోజే వెళ్లొచ్చీసాను కదా..

వెళ్లోచ్చేసావా..అంటే చూడలేదా?

వురే నువ్వూ డబుల్ మీనింగ్ లేసేస్తున్నావ్..చూసి,వచ్చాను అన్నా..

అసలు సినిమా లైనేంట్రా

అదేంట్రొయ్ అలా అడిగేసావ్..హీరో పెళ్లి పెటాకులైపోయింది..మళ్లీ ఇంకో పెళ్లి చేసుకుందామనుకున్నాడు. హీరోయిన్ కూడా అందుకు సై అంది..ఇంకో పెళ్లికి రెడీ అంది. 

బాగానే వుంది.హీరో పెళ్లి ఎందుకు పెటాకులైంది..

ఆ ఎందుకంటే హీరోయిన్ కు వంటిట్లో ఏ సామాను ఎక్కడుందో తెలియదంట..పైగా ఆలస్యంగా లేస్తదంట..

మరి నాకో డవుటు..మనం కూడా ఆలస్యంగానే లేస్తాం కదా..మన వంటింట్లో సామాన్లు ఏవో మనకీ తెలియదు కదరా

అంటే..ఇంకా ఏవో వుండేవుంటాయి..

వుంటాయి..కాదు చూపించారా?

లేదు..

సరే..ఇంతకీ ఆంటీలు అబ్బాయిల్ని తెచ్చుకోవడానికి, హీరో రూమ్ ఫ్రెండ్స్ అమ్మాయిని తెచ్చుకున్నా హీరో టచ్ చేయకపోవడానికి, అవ్వలు మందు కొట్టడానికి, సినిమా కథకు సంబంధం వుందట్రా?

అంటే…అదీ..సినిమా అన్నాక ఒక్క కథే వుంటదేటి? ఇంకా చాలా సంగతులుంటాయి కదా..

సరే..హీరో వాడేసిన అమ్మాయిని, మళ్లీ చేరదీసాడు. అలాగే హీరో వాడేసిన మరో అమ్మాయిని ఓ బకరా చేసుకున్నాడు. అంతే కానీ ఎవరో వాడేసిన అమ్మాయిని హీరో చేరదీయలేదు..అంతేనా?

ఛ..మరీ ఏంట్రా నువ్వు కూడా సంపత్ నందిలా..బోల్డ్ గా మాట్లాడుతున్నావ్..వాడేసిన..వాడేసిన అంటూ..

మరి బోల్డ్ సినిమా కదా..అలాగే అనాలి …కానీ, ఇంతకీ చెప్పు…హీరోయిన్ ది ప్రేమ కథ…ఓకె. హీరో ప్రేమను కాదని వెళ్లిన అమ్మాయి. మరెవరితోనూ, ఇంకే రకమైన 'రూఫ్ టాప్ రొమాన్స్'లు చేసినట్లు చూపించలేదు. అలా చూపించి వుంటే, హీరో చేసుకునేవాడంటావా?

అయినా ఆదికి గొప్ప సినిమా పడిందిరా..ఫైట్లు లేవు..సరైన పాటల్లేవు..వాళ్ల డాడీ చేయమన్నాడట తెలుసా?

అవును..నేనూ చదివాను..కుర్రాడు మరీ హీరో అయిపోతున్నాడు..తనలా క్యారెక్టర్ ఆర్టిస్టు అవ్వాలనేమో?

హీరో కాకపోడమేటి? ముద్దు సీను, వాటర్ టాంక్ పై రొమాన్స్ సీను చూడలేదా?

అది చూసాకే డవుటొచ్చేసింది..ఇలాంటి సీన్లు నీలంరంగు బొమ్మల్లో వుండాలి కదా..రంగుల సినిమాలోకి వచ్చేసాయి ఏటీ అని..

ఇదెక్కడి పిచ్చి డవుట్ రా బాబూ? …అందుకే నీకు గీతాంజలి లాంటి సినిమాలే కరెక్ట్.

అదీ చూసేసాను..

ఏమనిపించింది..

దెయ్యం అంటే బాగా చీపైపోయిందనిపించింది

ఎందుకు?

ఇన్నాళ్లు హాలీవుడ్ దెయ్యం సినిమాలు చూసి మనవాళ్లు ఇక్కడ తీస్తారనుకున్నా..కానీ ఇక్కడి దెయ్యం సినిమాలే చూసి ఇక్కడే తీస్తారనుకోలేదు

ఏటి ప్రేమకథాచిత్రమ్ చూసి తీసేసారనా నీ డవుటు?

నాక్కాదు..జనాలకు..బ్రహ్మానందం టేబుల్ దగ్గర కూర్చుని,రా.రా..అని దెయ్యాన్ని పిలుస్తూ వుంటే, సప్తగిరే బాగా పిలిచాడు అంటున్నారు.

సర్లే అంటే అననీ..బ్రహ్మనందం బూట్లు విప్పి, చెప్పులు వేసుకుని, నడుస్తుంటే, బ్యాక్ గ్రౌండ్ లో పవర్ స్టార్ పాట..అదిరింది కదా..

అవున్రా..దెయ్యాలకు బూట్లంటే పడవా?

అదేటి అలా అడిగేసావ్

మరి బ్రహ్మానందం బూట్లు వదిలి చెప్పులెందుకు వేసుకెళ్లాడ్రా

అదంతే కామెడీరా బాబూ..

ఓహో,..పవర్ స్టార్ పాటంటే కామెడీనా?

వురేయ్..చంపేస్తాను..అటు ఇటు అనీకు..

కానీ దేవదాస్ కనకాల పాట అదిరింది కదా..

అవును..ఆ సీన దగ్గరకు వచ్చేసరికి బొమ్మ తమిళ సినిమా డబ్బింగా అని అడిగాడు నా పక్కసీటువాడు.

టేస్ట్ లేదురా..జనాలకు, ఫ్యామిలీస్ రావద్దేటి సినిమాకు?

అవును,. థియేటర్ దగ్గర అమ్మోరి బొమ్మ కూడా పెట్టుంటే కలెక్షన్లు కాస్త కలిసొచ్చేవి. 

పోన్లే, సినిమా హీరోయిన్ అంజలికి కలిసొచ్చింది

అవును కొంచెం కొంచెం

అదేంటీ..

మరి కొన్ని సీన్లలోనే కదా..లావుగా కండ కలిసినట్లు కనిపించింది..

నువు మారవ్ రా..డబుల్ డైలాగులు విని విని సెడిపోయావ్..

విని కాదు..చూసి..వాటిల్లో విని..

'చిత్ర'గుప్త