క్రికెట్‌ దేవుడా.. నీ జ్ఞాపకాలు నిత్యస్ఫూర్తి!

యావత్‌ ప్రపంచపు క్రికెట్‌  చరిత్రలో ఒక శకం ముగిసింది. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే.. క్రికెట్‌ గురించి ఎవరైనా మాట్లాడుకోవాల్సిల వస్తే.. సచిన్‌కు ముందు` సచిన్‌కు తరువాత అని మాట్లాడుకోవాల్సిందే..! క్రికెట్‌ అనే క్రీడకు సంబంధించినంత…

యావత్‌ ప్రపంచపు క్రికెట్‌  చరిత్రలో ఒక శకం ముగిసింది. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే.. క్రికెట్‌ గురించి ఎవరైనా మాట్లాడుకోవాల్సిల వస్తే.. సచిన్‌కు ముందు` సచిన్‌కు తరువాత అని మాట్లాడుకోవాల్సిందే..! క్రికెట్‌ అనే క్రీడకు సంబంధించినంత వరకు ఈ దేవుడు ఒక శకపురుషుడు! ఆ శకం ఇవాళ్టితో ముగిసిపోయింది!

24 ఏళ్ల సుదీర్ఘమైన అనుబంధం.. క్రికెట్‌ మైదానాన్ని వీడిపోవాలంటే.. దేవుడికి కూడా కళ్లు చెమర్చాయి. కళ్లమ్మట నీళ్లు చిప్పిల్లాయి. కానీ ఆ దు:ఖాన్ని అభిమానుల కంటపడనివ్వడం ఇష్టం లేని క్రికెట్‌ దేవుడు .. తన సహచరులు అందరూ జట్టుగా అందించిన ఓ అత్యద్భుతమైన క్లీన్‌స్వీప్‌ సిరీస్‌ విజయాన్ని పదిలంగా ఆస్వాదిస్తూ.. తలవంచుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ గ్రీన్‌రూం చేరుకున్నాడు. 

విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ మూడోరోజు తెల్లవారే ముగిసిపోయింది. తొలి టెస్టును ముగించిన రీతిలోనే రెండో టెస్టును కూడా ఇన్నింగ్స్‌ తేడాతో భారత్‌ గెలుచుకుంది. మూడోరోజు ఉదయం 11.50 గంటలకు క్రికెట్‌ మైదానంతో క్రికెట్‌ దేవుడి అనుబంధం తెగిపోయింది. 

కుటుంబసభ్యులే కాదు.. జట్టు సభ్యులే కాదు… ప్రత్యర్థి జట్టు సభ్యులు, వేల సంఖ్యలో గ్యాలరీల్లోని జనం.. లక్షల సంఖ్యలో టీవీల ముందు వీక్షిస్తున్న అభిమానులు అందరూ ఆనందమో, దు:ఖమో తెలియని అశ్రుపూరిత నయనాలతో అభినందనలు కురిపిస్తూ చప్పట్లు కొడుతున్న వేళ.. సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌.. చాలా వినమ్రంగా క్రికెట్‌ మైదానం నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. 

అవర్‌ డియర్‌ సచిన్‌..
గ్రేట్‌ ఆంధ్ర నీకు హేట్సాఫ్‌ చెబుతోంది.
కేవలం క్రికెట్‌ మాత్రమే కాదు….
వ్యక్తిగా, విలక్షణ సులక్షణ సంపన్నుడిగా.. 
నీ జ్ఞాపకాలు అన్నీ మాకు సదా స్ఫూర్తిగా నిలుస్తాయి. 
వియ్‌ హేట్సాఫ్‌