చికాగో స్టేట్ యూనివర్సీటీని సందర్శించిన మాణిక్యాలరావు

జేఎన్ టీయుతో కలిసి మరిన్ని అడుగులు వేస్తామన్న సీఎస్.యు Advertisement చికాగో: చికాగో స్టేట్ యూనివర్సీటీ (సీఎస్ యు)లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు ఘన స్వాగతం లభించింది. సీఎస్ యు అత్యున్నత…

జేఎన్ టీయుతో కలిసి మరిన్ని అడుగులు వేస్తామన్న సీఎస్.యు

చికాగో: చికాగో స్టేట్ యూనివర్సీటీ (సీఎస్ యు)లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు ఘన స్వాగతం లభించింది. సీఎస్ యు అత్యున్నత కమిటీ సభ్యులైన ఆంగ్లో అండర్సన్ మాణిక్యాలరావుకు స్వాగతం పలికారు.  ప్రస్తుతం చికాగో స్టేట్ యూనివర్సీటీతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, అనంతపురం జె.ఎన్. టీ. యూ కలిసి పనిచేస్తున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో పరస్పర అవగాహన.. సహయ సహకారాలతో ముందుకు సాగుతున్నఈ విద్యా సంస్థలు భవిష్యత్తులో మరింతగా కలిసి పనిచేయనున్నాయి. ముఖ్యంగా పాఠ్యాంశాల అభివృద్ధి, యూనివర్సీటీ, ఇండస్ట్రీ పార్టనర్ షిప్స్..  సీఎస్.యు, జేఎన్.టీయూ సంయక్తంగా నిర్వహిస్తున్నాయి.
తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒబామా , సింగ్ గ్రాంటు అవార్డు కూడా ఈ భాగస్వామ్యానికి వచ్చిందని  మంత్రి మాణిక్యాలరావుకు ఆంగ్లో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీ.ఎస్.యు, జేఎన్ టీయులు కలిసి ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభించనున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, నైపుణ్యల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని మంత్రి మాణిక్యాలరావు అన్నారు.సీఎస్ యు, జేఎన్.టి.యు సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్టులకు తమ పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు అటు కృష్ణా జిల్లాల్లో అక్వా ఎగుమతుల వలన నీటి కాలుష్యం పెరిగిపోయి..ప్రధాన సమస్యగా మారిందని మాణిక్యాలరావు అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎస్ యు ముందుకు రావాలని కోరారు. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి సీఎస్ యు టీంతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని మాణిక్యాలరావు హామీ ఇచ్చారు.

ఇండియాలో దక్షిణ ప్రాంతం.. చికాగోలోని దక్షిణ ప్రాంతం కలిసి పనిచేయటం ఆనందంగా ఉందని సీఎస్.యు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్  డేవ్ కనీస్ అన్నారు.మంత్రి మాణిక్యాలరావు చికాగో యూనివర్సీటీలో రావడం ఓ మైల్ స్టోన్ గా ఆయన అభివర్ణించారు. పరస్పర అవగాహన.. సహకారంతో రెండు ప్రాంతాల మధ్య కూడా అనుబంధం మరింత బలపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. గాంధీ అహింస ఉద్యమాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతీయ గొప్పతనాన్ని కనీస్ కొనియాడు. చికాగో స్టేట్ యూనివర్సీటీ ఇతర విద్యాసంస్థలతో కలిసి వేస్తున్న అడుగులు ఎన్నో కొత్త అవకాశాలకు బాటలు వేస్తున్నాయన్నారు. సీఎస్ యు, జేఎన్ టీయు ఉమ్మడి డిగ్రీ ఎలా ఉంటుందనే దానిపై డాక్టర్ పౌలా కార్నే వివరించారు.  భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు ప్రాంతానికి చెందిన విద్యార్థులే ఎక్కువగా చికాగో స్టేట్ యూనివర్సీటీలో చదువుకుంటున్నారని  మేథమ్యాటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ విభాగ ఛైర్మన్ డాక్టర్ రోహన్ అట్లే అన్నారు.

పరిశ్రమలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఇక జేఎన్ టీయు, సీఎస్ యులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడాన్ని సి.ఎస్.యు స్వాగతించింది. మళ్లీ ఐటికి మంచి రోజులొస్తాయని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ ను ఐటీ పవర్ హౌస్ గా మార్చిన ఘనత బాబుకే దక్కుతుందని వారు అన్నారు.. విజయవాడ, తిరుపతి, వైజాగ్ లను చంద్రబాబు ఐటీ హబ్స్ గా బాబు తీర్చిదిద్దగలరనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

ఇంకా ఈ సమావేశంలో ప్రొఫెసర్ దేవి పొట్లూరి, చికాగో తెలుగు అసోషియేషన్ ప్రతినిధులు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ బొప్పన్న,  వర ప్రసాద్, నాట్స్ కో ఆర్డినేటర్ కోట ప్రసన్న తదితరులు హజర్యారు. సీఎస్ యు ప్రొఫెసర్, సలహాదారు  రావు అచంట ఈ  మీటింగ్ ను ఏర్పాటు చేయడంతో పాటు  సమన్వయకర్తగాను వ్యవహరించారు.