సెక్సువల్ అట్రాక్షన్ లేకుండా ఆడ-మగ స్నేహం ఉండదంటారు చాలా మంది మనస్తత్వ శాస్త్ర విశ్లేషకులు. ఎవరైనా ఆడ-మగ తమ మధ్య స్నేహం తప్ప ఎలాంటి లైంగికాకర్షణ లేదంటూ కుండబద్దలు కొడితే, వారిలో ఎవరో ఒకరు అబద్ధం అయినా చెబుతూ ఉండాలి, లేదా వారు ఎంతో మహనీయులు అయినా అయి ఉండాలంటాడు ఒక రచయిత!
అయితే స్నేహితులనుకునే ఆడ-మగ అంతా శృంగార సంబంధాలో, ఆకర్షణో కలిగి ఉంటారని కాదు. ఆ స్నేహంలో కూడా గాఢతల్లో తేడాలుంటాయి. తాము క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వారు, కలిసి నిత్యం తిరిగే వారు, అత్యంత సన్నిహితులమని చెప్పుకునే వారి విషయంలోనే కాంప్లెక్సిటీ అంతా! ఏదో క్లాస్ మేట్స్ గానో, హాయ్ అంటే హాయ్..అని చెప్పుకునే స్నేహాలను పక్కన పెడితే, క్లోజెస్ట్ ఫ్రెండ్షిప్ – రిలేషన్ షిప్ లోనే.. సెక్స్ వల్ అట్రాక్షన్ కూడా ఉంటుందనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తాయి.
లైంగికార్షణ కలగడం నేరం కాదు. స్త్రీ-పురుషుల మధ్యన అది అసహజమూ కాదు. చాలా మంది అబ్బాయిలు ఈ విషయంలో డైరెక్టుగా చెప్పడం జరగదు. అమ్మాయిలకూ ఈ సూత్రం వర్తిస్తుంది. అయితే అబ్బాయిలు తమకున్న చొరవతో స్నేహం అనే వారధిని ఉపయోగించుకుంటారు తమకు నచ్చిన అమ్మాయిలను చేరుకునేందుకు. స్నేహితులుగా దగ్గరయ్యే వారు, లేదా పరిచయాన్ని స్నేహంగా పెంచుకునే వారికి.. సదరు స్నేహితురాలిపై సెక్సువల్ ఇంట్రస్ట్ ఉంటుందనేది చాలా మంది చేసే విశ్లేషణ. అయితే దీన్ని బయటకు చెప్పుకోరు, మరి కొందరు ఒప్పుకోరు! స్నేహం అనేది పవిత్రమైనదన్నట్టుగా.. దానికి సెక్స్ తో ముడిపెట్టొద్దన్నట్టుగా వాదిస్తారు. అయితే వాస్తవంలోకి వచ్చే సరికి మాత్రం స్త్రీ- పురుషుల మధ్యన సెక్స్ లెస్ స్నేహం అనేది అసంబద్ధమైన మాటే. ఇది చాలామంది ఒప్పుకోని కఠినమైన వాస్తవం.
దీన్నే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ గా వ్యవహరిస్తారు కొన్ని సంస్కృతుల్లో. స్నేహం స్నేహమే, సెక్సువల్ ఇంట్రస్ట్ సెక్సువల్ ఇంట్రస్టే. ఈ రెండింటినీ వారు మిక్స్ చేయరు. స్నేహితుడిగా ఉన్నప్పుడు స్నేహితుడిగా, రొమాంటిక్ పార్ట్ నర్ గా ఉన్నప్పుడు రొమాంటిక్ పార్ట్ నర్ గా వ్యవహరించే వారూ ఉంటారు.
ఒకరి అవసరం స్నేహం కావొచ్చు, మరొకరి అవసరం శృంగార సాన్నిహిత్యం కావొచ్చు. ఇలా పరస్పర అవసరంతో.. ఈ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ వ్యవహరాలుంటాయి. వీటిని మరీ తప్పు పట్టడానికి కూడా లేదు. వేధింపులు ఉండవు, ప్రేమా-గీమా కథలుండవు, ఎవరి ఆసక్తి వారిది. ఒకరి పట్ల మరొకరికి అభ్యంతరం లేదు. ఒత్తిళ్లు ఉండవు. తలొగ్గడం ఉండదు. పరస్పరం అవసరం. ఒకరి సాన్నిహిత్యం మరొకరికి బాగుంటుంది. చూసే దృష్టి వేరే అయి ఉండవచ్చు. అయితే ఇద్దరికీ అభ్యంతరం లేని రీతిలో ఇద్దరి వ్యవహరణ తీరు ఉంటుంది. ఇలాంటి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కు బ్రేకప్ లు గట్రా ఇబ్బందులు కూడా ఉండవు. అలాగని అనునిత్యం వీరు సెక్సువల్ నీడ్స్ తీర్చుకుంటారనేదీ ఏమీ ఉండదు. కేవలం కంపెనీని ఎంజాయ్ చేయడం, సున్నిత స్పర్శలో కూడా ఆనందాన్ని వెతుక్కోవడం ఈ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లక్షణం.
ఇలాంటి స్నేహాలను ఆస్వాధించేవాళ్లు కోకొల్లలుగా ఉంటారు. అయితే వీరు ఎవ్వరిదగ్గరా తమ బంధం గురించి ఓపెనప్ కారు. తామిద్దరి మధ్యన ఏమున్నా, తమ సాన్నిహిత్యంలో ఎలాంటి సంబంధం ఉన్నా, ఒకరి స్పర్శను మరొకరు తరిస్తున్నా, తమ స్నేహంలో ఎలాంటి స్వర్గాలను ఆస్వాధిస్తున్నా.. ఇద్దరూ మరొకరికి వెల్లడించే అవకాశాలు ఉండవు. బయటి వాళ్లను ఎలా చూడనివ్వాలో అలాగే చూడనిస్తారు. సాన్నిహిత్యాన్ని తనివితీరా ఆస్వాధిస్తూ ఉంటారు.
స్త్రీ- పురుషుల స్నేహం అంటేనే అనుమానించే కళ్లు ఎక్కువ! అయితే ఈ అనుమానాలకు విలువ లేదు. వీటితో వారికి పని లేదు. స్నేహంలో కూడా ఇలాంటి ఆస్వాధన చేయగలిగే వాళ్లకు మాత్రం మజా తెలియవచ్చు. ఫ్రెండ్షిప్ లో సెక్స్ ను మిక్స్ కాదనుకోవడం, అలాంటిది ఉండదనుకోవడం అమాయకత్వం.