శృంగార జీవితం ఆనందకరంగా ఉండే దంపతుల అలవాట్లు ఎలా ఉంటాయనే అంశం గురించి ఆసక్తిదాయకమైన అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. వైవాహికబంధంలో శృంగారం పట్ల దీర్ఘకాలం పరస్పర ఆసక్తి కొనసాగడం తేలికైన విషయం ఏమీ కాదు. కాలం గడిచే కొద్దీ దాంపత్యంలో శృంగారం బోర్ కొట్టడం అరుదైన జబ్బేమీ కాదు. చాలా మందికి ఇది అనుభవపూర్వకంగా జరిగేదే.
ఒక దశ వచ్చాకా భార్యవైపు మనసు మొగ్గకపోవచ్చు. శారీరకంగా వచ్చే మార్పులు కావొచ్చు, లేదా ఆమెపై లైంగికాసక్తి తగ్గిపోయి వేరే వాళ్ల పై మనసు మొగ్గుచూపవచ్చు. మరి ఈ పరిస్థితి దాంపత్యంలో రాకూడదంటే… తాము సెక్సువల్ లైఫ్ ను ఆనందంగా ఆస్వాధిస్తున్నామనేవారు చెప్పే సూత్రాలకు, వారు పాటించే చిట్కాలకు మించిన పాఠాలు ఉండకపోవచ్చు.
మరి అలాంటి ఇన్ పుట్స్ నుంచి తెలిసే వివరాలు ఏవంటే..
సెక్సీ ఐడియాస్ తట్టాలి!
దాంపత్య శృంగార జీవితం తనివితీరా ఆస్వాధించడానికి ఉన్న మార్గాల్లో .. సెక్సీ ఐడియాస్ ను తట్టించుకోవడం కీలకమైన అంశం. పార్ట్ నర్ ను లైంగికంగా ఉద్రేక పరచడానికి తగిన ఐడియాస్ ప్రధానంగా స్త్రీల చేతుల్లోనే ఉంటాయని అంటున్నాయి పరిశీలనలు. స్త్రీకి ఈ కిటుకులు తెలియాలని, లేదా తెలుసుకోవాలని, ఆలోచించి ఐడియాలు తెచ్చుకోవాలని.. డ్రస్సింగ్ తోనా లేక సెక్సీ పోజులతోనో.. పార్ట్ నర్ లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చే శక్తి స్త్రీకే ఉందంటున్నాయి అధ్యయనాలు.
గిఫ్ట్ ఇవ్వాలి!
శృంగారంలో స్త్రీ పాసివ్ పార్ట్ నర్ గానే కాకుండా..యాక్టివ్ పార్ట్ నర్ గా ఉండటం కీలకమని మరో అధ్యయనం చెబుతూ ఉంది. పార్ట్ నర్ కు సెక్సీ గిఫ్ట్ ను ఇవ్వడం స్త్రీకి చాలా ఈజీ అని ఈ పరిశోధన చెబుతూ ఉంది. తన పార్ట్ నర్ ఏం కోరుకుంటాడో.. స్త్రీకి అర్థం కావడం మరీ కష్టం కాదు. అతడు కోరకుండానే అలా చేస్తే శృంగారం మరో ఎత్తుకు చేరుకున్నట్టే!
మసాజ్ ..మత్తెక్కిస్తుంది!
మసాజ్ వల్ల మత్తెక్కించవచ్చని మరో పరిశీలన చెబుతూ ఉంది. పార్ట్ నర్ బాగా అలసివచ్చినప్పుడో, మరో సందర్భంలోనో.. నఖశిఖ పర్యంతం మంచి మసాజ్ చేస్తే.. దానికి మించిన సెక్సీ థింగ్ ఉండదు.
రోల్ ప్లే..!
కొందరు బాగా ఇష్టపడతారట ఈ ఆటను! శృంగారం సమయంలో తమను తాముగా కాకుండా.. మరొకరిగా గుర్తించుకోవడం కాబోలు రోల్ ప్లే అంటే. వేరే పేర్లతో పిలుచుకుంటారో.. ఈ రోల్ ప్లే టెక్నిక్స్ ఏమిటో కానీ.. శృంగారంలో సరికత్త ఉత్తేజాన్ని ఇచ్చే శక్తి రోల్ ప్లేకు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
కామసూత్రను కలిసి చదవడం!
ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన సెక్సీ గిఫ్ట్ కామసూత్ర. అయితే కాలక్రమంలో ఇదోక అప్రకటిత నిషేధం అయ్యింది ఇదే దేశంలో. అయితే దంపతులు కలిసి కామసూత్రను చదవడం జరిగితే, ఆచరణలో అద్భుత శృంగారానుభవం సొంతం కావొచ్చు.