దక్షిణ దిశ సింహద్వారం ఇంటిలో నివసించే వారికి అభివృద్ధి ఉండదా? జీవితంలో వారు ఎదగలేరా? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి.
తూర్పు, ఉత్తరం, పడమర సింహ ద్వారాలకి ఉండే ప్రాముఖ్యత దక్షిణ దిశ సింహ ద్వారానికి ఉండదనుకొంటారు. దక్షిణ దిశ సింహ ద్వారం ఇంట్లో నివసించేవారికి ఇటువంటి సందేహాలు అనుమానాలు అధికంగా ఉంటాయి.
ఏ సింహ ద్వారం లో నివసించినా వాస్తుకి అనుగుణంగా ఇల్లు నిర్మించుకొన్నట్లైతే శుభ ఫలితాలే కలుగుతాయి. ప్రతి దిశకి దానికి సంబంధించిన ప్రాముఖ్యత ఉంటుంది.
కొన్ని సందర్భాలలో ప్రతి ఒక్కరికి వారు కోరుకొన్న, లేదా కలిసి వచ్చే సింహద్వారం ఇంట్లో నివసించే అవకాశం ఉండకపోవచ్చు.
దక్షిణ దిశ సింహద్వారంలోనే ఉండాల్సి వచ్చినప్పుడు వారు అన్ని విధాలుగా భయపడుతూ మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు.
అంతే కాకుండా ఇంటికి ఎవరైనా వచ్చినా లేదా ఇరుగుపొరుగు వారు సైతం వారికి తోచిన సలహాలు ఇస్తుంటారు.
ఇటువంటి సందర్భంలో దక్షిణ దిశ సింహద్వారంలో నివసించేవారు ఏ పరిహారం పాటిస్తే శుభఫలితాలు పొందగలుగుతారు, పాజిటివ్ ఎనర్జీని ఎలా వృద్ధి చేసుకోవచ్చు అనే విషయాని కొస్తే “సింహద్వారం పైన ఒకవెండి స్వస్తి క్ప్రతిమని వెండిలో తయారుచేయించి ఒక మంగళ వారం రోజున కట్టాలి.” దీని వలన దక్షిణ సింహద్వారం పాజిటివ్ ఎనర్జీతో ఆక్టివేట్ అవుతుంది. రోజు దీనికి కొద్దిగా ధూపం/సాంబ్రాణి చూపించడం వీలైనప్పుడు పసుపు నీరుతో శుద్ధి చేసుకోవడం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి .
వక్కంతం చంద్రమౌళి (https://www.janmakundali.com/)