ఇవాంక‌తో భార‌తీయ యువ‌త స‌ర‌దాలు

అమెరికా బ్యూటీ, ఆ దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ అంటే భార‌తీయ కుర్ర‌కారు భ‌లే అభిమానాన్ని పెంచుకొంది. ఇప్ప‌టికి ఆమె రెండుసార్లు ఇండియా రావ‌డంతో…మాన‌సికంగా బంధం బ‌ల‌ప‌డింది. ఇవాంక‌కు సోష‌ల్ మీడియాలో…

అమెరికా బ్యూటీ, ఆ దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ అంటే భార‌తీయ కుర్ర‌కారు భ‌లే అభిమానాన్ని పెంచుకొంది. ఇప్ప‌టికి ఆమె రెండుసార్లు ఇండియా రావ‌డంతో…మాన‌సికంగా బంధం బ‌ల‌ప‌డింది. ఇవాంక‌కు సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద ఫాలోయింగ్ ఉంది.

ఇటీవ‌ల ఆమె ఇండియాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు కొంద‌రు ఇవాంక‌తో సెల్ఫీలు దిగి మోజు తీర్చుకున్నారు. మ‌రికొంద‌రికి మాత్రం నిరాశే మిగిలింది. అయితే ఆమెతో క‌లిసి ఫొటో తీసుకోక‌పోతే మాత్రం…ఏమీ చేయ‌లేమ‌నుకున్నారా అని కొంద‌రు యువ‌కులు త‌మ సృజ‌న‌కు ప‌దును పెట్టారు.

యువ‌త ప్ర‌తిభ‌కు సాంకేతిక ప‌రిజ్ఞానం తోడు  కావ‌డంతో…వారి క్రియేటివిటీకి ఆకాశ‌మే హ‌ద్దైంది. ఇవాంక‌తో క‌లిసి సెల్ఫీ తీసుకున్న‌ట్టు ఫొటోల‌ను ఎడిట్ చేసి త‌మ కోరిక‌ను తీర్చుకుంటున్నారు. 

ఇందులో భాగంగా ఓ యువ‌కుడు ఇవాంక అంటే వ‌ల్ల‌మాలిన అభిమానాన్ని పెంచుకున్నాడు. త‌న సైకిల్‌పై ఆమెను ఎక్కించుకుని అలా….అలా స‌ర‌దాగా చ‌క్క‌ర్లు కొట్టాల‌ని క‌ల‌లు క‌న్నాడు. అయితే ఇవాంక‌తో అలా చేయ‌డం కుద‌ర్లేదు. దీంతో త‌న సైకిల్‌పై వెనుక సీట్లో అమెరికా అంద‌గ‌త్తె ఇవాంక‌ను కూచో పెట్టుకుని చ‌క్క‌ర్లు కొడుతున్న‌ట్టు సృజ‌నాత్మ‌క ఫొటోను ఆవిష్క‌రించాడు.

అలాగే మ‌రో యువ‌కుడు కూడా ఇవాంక‌తో స‌ర‌దా తీర్చుకున్నాడు.  ఆమెతో తాజ్‌మహాల్‌ వద్ద పక్కపక్కన కూర్చోని ఉన్నట్లు ఫోటోను ఎడిట్‌ చేశాడు. ఇలా స‌ర‌దా తీర్చుకున్న వ్య‌క్తి  ప్రముఖ సింగర్‌ దిల్జిత్ దోసంజ్ కావ‌డం విశేషం. ఇలాంటివి ఎన్నో చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  తన దృష్టికి వచ్చిన పలు ఫోటోలపై ఇవాంక సోషల్‌మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. భారతీయు అభిమానాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానంటూ ఆమె స‌మాధాన‌మిచ్చారు.