జయప్రదకి ఈ అవమానాలు మామూలే

ఎంచక్కా తెలుగునేల రాజకీయంగా ఆమెకు స్వాగతం పలుకుతోంటే, అబ్బే.. సొంతూరు వేస్ట్‌.. పరాయి గడ్డ బెస్ట్‌.. అనుకుంటారామె. తెలుగు సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒకప్పటి అందాల రాశి జయప్రద, తెలుగుదేశం…

ఎంచక్కా తెలుగునేల రాజకీయంగా ఆమెకు స్వాగతం పలుకుతోంటే, అబ్బే.. సొంతూరు వేస్ట్‌.. పరాయి గడ్డ బెస్ట్‌.. అనుకుంటారామె. తెలుగు సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒకప్పటి అందాల రాశి జయప్రద, తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం విదితమే. కొన్ని కారణాలతో ఆమె, తెలుగునాట రాజకీయాలకు గుడ్‌ బై చెప్పేసి, ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అక్కడి నుంచే ఆమె లోక్‌సభకు ఎంపికయ్యారు గతంలో. 

2009 ఎన్నికల సమయంలో మళ్ళీ ఏపీ రాజకీయాలపై దృష్టిపెట్టి, కాంగ్రెస్‌, టీడీపీ, పీఆర్పీ (అప్పట్లో చిరంజీవి స్థాపించిన పార్టీ) చుట్టూ చక్కర్లు కొట్టారు. 2014 ఎన్నికల్లో కూడా ఆమె తెలుగు రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలనుకున్నారుగానీ, ఆమె పప్పులుడకలేదిక్కడ. అఫ్‌కోర్స్‌, తెలుగు రాజకీయాలంటే ఆమె అంత శ్రద్ధ కూడా పెట్టలేదనుకోండి.. అది వేరే విషయం. 

అమర్‌సింగ్‌ ఆమెకు పొలిటికల్‌ గాడ్‌ పాధర్‌. ఆయన ఎలా చెబితే ఆమె అలా వ్యవహరిస్తుంటారంతే. అలా తిరిగి సమాజ్‌ వాదీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన జయప్రదకు ఇటీవలే అక్కడ క్యాబినెట్‌ ర్యాంక్‌ పదవి ఒకటి దక్కింది. యూపీ ఫిలిం ప్రమోషన్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ పదవి దక్కించుకున్న జయప్రదకి, తాజాగా ఆ పదవి నుంచి ఉద్వాసన పలికారు ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌. ఊహించని ఈ షాక్‌తో జయప్రద కుదేలయ్యారు. 

నిజానికిది అత్యంత అవమానకరమైన ఘటన. కానీ, ఆమెకు ఇలాంటి అవమానాలు యూపీలో కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే, ఓసారి ఎన్నికల్లో ఆమె నగ్న ఫొటోలతో యూపీ సజాజ్‌ వాదీ నేతలే షాకిచ్చారు. పార్టీ నుంచి పలుమార్లు ఆమెను బయటకు గెంటేశారు కూడా. ఎన్ని అవమానాలు జరిగినాసరే, సమాజ్‌ వాదీ పార్టీ అన్నా ఉత్తరప్రదేశ్‌ అన్నా జయప్రదకు అదో ఇది.! సో, అవమానాలు ఆమెకు కొత్త కాదు.. ఈ అవమానం ఆమెకు లెక్కలోకి రాదు.! ఎనీ డౌట్స్‌.?