కోహ్లీ సెంచరీ.. విండీస్‌ ఔట్‌.!

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? మైదానంలో విరాట్‌ కోహ్లీ విరుచుకుపడ్తోంటే భారత క్రికెట్‌ అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. సిరీస్‌ నుంచి విండీస్‌ ఔట్‌.. అన్న వార్త భారత ఇన్నింగ్స్‌ జరుగుతున్న…

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? మైదానంలో విరాట్‌ కోహ్లీ విరుచుకుపడ్తోంటే భారత క్రికెట్‌ అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. సిరీస్‌ నుంచి విండీస్‌ ఔట్‌.. అన్న వార్త భారత ఇన్నింగ్స్‌ జరుగుతున్న సమయంలోనే బయటకు వచ్చింది. వెస్టిండీస్‌ క్రికెటర్లకీ, క్రికెట్‌ బోర్డ్‌కీ మధ్య వివాదం గత కొన్నాళ్ళుగా కొనసాగుతోంది.

ఆటగాళ్ళ ఫీజులో విండీస్‌ బోర్డ్‌ కోత విధించడంతో అసలంటూ విండీస్‌ క్రికెటర్ల భారత టూర్‌ ఏమవుతుందోనన్న గందరగోళం నెలకొంది. ఎలాగోలా తొలి మ్యాచ్‌ జరిగింది.. రెండో మ్యాచ్‌ కూడా జరిగిపోయింది.. మూడో మ్యాచ్‌ హుద్‌ హుద్‌ తుపాను దెబ్బకు గల్లంతయ్యింది. నాలుగో మ్యాచ్‌ ఈ రోజు జరుగుతోంది. ఇంతలోనే బీసీసీఐ నెత్తిన పిడుగు పడిరది.

వెస్టిండీస్‌ క్రికెటర్లు తిరిగి వెళ్ళిపోవాలని అనుకోవడం, వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డ్‌ కూడా తమ ఆటగాళ్ళకు అర్థాంతరంగా తిరిగొచ్చేయాలని ఆదేశించడంతో, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంది బీసీసీఐ. వెస్టిండీస్‌కి బదులు శ్రీలంకతో సిరీస్‌ నిర్వహించాలనే యోచన చేస్తోందిప్పుడు బీసీసీఐ.

ఇక, ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 330 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది వెస్టిండీస్‌పై. మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ అయినా పూర్తిగా జరుగుతుందా.? లేదా? అన్నదీ సస్పెన్స్‌గానే మారింది.