ఇలా అంటే బాధనిపించవచ్చు..రెండు వేలు ఇవ్వండి..కావాల్సినంత తాగి తినండి..ఆ డబ్బులో ఖర్చులు పోగా మిగిలిన దానిని హుద్ హుద్ బాధితులకు విరాళంగా ఇస్తారు. ఎంత మహత్తర కార్యక్రమం. విరాళాల సేకరణ అంటే పాటలు వినిపించి, టికెట్ పెట్టి డబ్బులు సేకరించవచ్చు..లేదా వివిధ కార్యక్రమాలు నిర్వహించి డబ్బులు సేకరించవచ్చు. కానీ తాగినంత మందు పోయించడం ఏమిటో?
థమన్, నీరజ కోన, ఇంకా చాలా మంది సెలబ్రిటీలు కలిసి ఈ నెల 19న అంటే రేపే..ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నాగ్ చైతన్య, హన్సిక కూడా పాల్గొంటారు. దీనికి ఎంట్రీ అయిదు వందలు. రెండు తరగతలు. ఒకటి మరో 500 అదనంగా ఇవ్వాలి. దానికి కార్యక్రమం వీక్షించే అవకాశం వుంటుంది. అది కాకుండా మరో విభాగం వుంది. అయిదు వందలు ఎంట్రీ . 1500 కవర్. ఈ విభాగానికి వచ్చేవారికి వుండే సదుపాయం తాగినంత ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్. అందులోకి మంచింగ్. ఫ్రీ,.,.ఫ్రీ,.,.ఫ్రీ,,మాంచి హుషారైన సంగీతం వింటూ, తాగినంత తాగచ్చు. ఆ విధంగా వచ్చిన డబ్బులను హుద్ హుద్ బాధితులకు ఇస్తారట.
ఇలా ఎంత పోగు చేస్తారు..వెయ్యి మంది..రెండు వేల మంది..ఈ విభాగంలో కొంటారనుకుందాం..వెయ్యి రూపాయిల వరకు ఖర్చులే పోతాయి. రవాణా, సంగీతం..మందు..విందు వగైరా. అంటే మిగిలిన వెయ్యి ..రెండు వేల మంది. అంటే ఇరవై లక్షలు. ఇంతమంది సెలబ్రిటీలు కలిసి పోగు చేసేది.
ఎలా వస్తాయో ఇలాంటి అయిడియాలు. హడావుడి ఎక్కువ. ఫలితం తక్కువ.