తానా ఎన్నికల్లో తదుపరి అధ్యక్షునిగా నరేన్ కొడాలి

అనూహ్య మలుపులతో రెండేళ్లపాటు కొనసాగిన “తానా” ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. జనవరి 18న ప్రకటించిన ఎన్నికల ఫలితాల ప్రకారం మొత్తం అన్ని జాతీయ పదవులను గెలుచుకొన్న టీంకోడాలి డాక్టర్ నరేన్ కోడాలి సారధ్యంలో విజయం…

అనూహ్య మలుపులతో రెండేళ్లపాటు కొనసాగిన “తానా” ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. జనవరి 18న ప్రకటించిన ఎన్నికల ఫలితాల ప్రకారం మొత్తం అన్ని జాతీయ పదవులను గెలుచుకొన్న టీంకోడాలి డాక్టర్ నరేన్ కోడాలి సారధ్యంలో విజయం సాధించింది. ముఖ్యంగా నరేన్ కొడాలి సుమారు మూడు వేల ఓట్ల ఆధిక్యంతో సతీష్ వేమూరి పై ఎగ్జిక్యూటివ్ వైస్  ప్రెసిడెంట్ గా  ఘన విజయం సాధించగా బోర్డు డైరెక్టర్లుగా లావు శ్రీనివాస్, రవి పొట్లూరి మరియు మల్లి వేమన అలాగే సెక్రటరీ గా రాజా కసుకుర్తి ట్రెసురేర్ గా భరత్ మద్దినేని జాయింట్ సెక్రెటరీగా వెంకట్ కోగంటి మరియయు జాయింట్ ట్రెసురేర్ గా సునీల్ పాంత్రా తదితరులు ఎన్నికయ్యారు.

గత రెండు సంవత్సరాలుగా అనేక ఒడిదుడుగులకు లోనవుతూ అంతర్గత మరియు న్యాయ వివాదాల్లో చిక్కుకుని ఒకసారి ఎన్నికలు రద్దయ్యి తిరిగి మళ్ళీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికైనా పూర్తయి కార్యవర్గాలు పూర్తిస్థాయిలో ఏర్పడటంతో తానా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఒక వర్గం మితిమీరిన వ్యక్తిగత తదితర ప్రతికూల ప్రచారాన్ని నిర్వహించడం పలువురు నిరసించారు. అలాగే రద్దైన మొదటి ఎన్నికలలో నరేన్ కొడాలికి ముఖ్య ప్రత్యర్థి గా  ఉన్న శ్రీనివాస గోగినేని మళ్ళీ వచ్చిన ఎన్నికలలో పోటీనించి విరమించుకొని నరేన్ కొడాలి ప్యానెల్ కు పూర్తి మద్దతు ఇవ్వడం, ఘన విజయము సాధించడం ఒక ఆసక్తికర మరియు కీలక పరిణామంగా పలువురు భావిస్తున్నారు.

అలాగే నరేన్ కొడాలి ప్యానెల్ గెలుపుకై మునపటి అధక్షులైన ప్రముఖులు గంగాధర్ నాదెళ్ల, జయరాం కోమటి, సతీష్ వేమన, అంజయ్య చౌదరి లావు మరియు మోహన్ నన్నపనేని ల తో పాటు పలువురు చేసిన విశేష కృషి సత్ఫాలితాలను ఇచ్చింది.

తానా ఎన్నికల ఫలితాలు:============

ఈవీపీ

నరేన్ కొడాలి – 13225 ✌️
సతీష్ వేమూరి – 10362

బీవోడీ

లావు శ్రీనివాస్ – 12695 ✌️
రవి పొట్లూరి- 13044 ✌️
సురీష తూనుగుంట్ల – 11237
మల్లి వేమన – 11774 ✌️
శ్రీనివాస్ ఉయ్యూరు – 10520
వెంకట రమణ యార్లగడ్డ- 10131

కార్యదర్శి

రాజా కసుకుర్తి – 12456✌️
అశోక్ కొల్లా – 11083

కోశాధికారి

భరత్ మద్దినేని – 12827✌️
మురళి తాళ్లూరి – 10617

జాయింట్ సెక్రటరీ

వెంకట్ కోగంటి – 13015✌️
వంశీ వాసిరెడ్డి – 10501

జాయింట్ ట్రెజరర్

సునీల్ పంత్రా – 13013✌️
శశాంక్ యార్లగడ్డ – 10463

కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్

రజినీ ఆకురాటి – 10177
లోకేష్ కొణిదల – 13362✌️

సాంస్కృతిక సేవా సమన్వయకర్త

రజనీకాంత్ కాకర్ల – 10854
ఉమా ఆర్ కాటికి – 12638✌️

మహిళా సేవల సమన్వయకర్త

సోహిని అయినాల- 12009✌️
మాధురి యేలూరి – 11436

కౌన్సిలర్ ఎట్ లార్జ్

ప్రదీప్ గడ్డం – 10590
సతీష్ కొమ్మన – 12827✌️

అంతర్జాతీయ కో ఆర్డినేటర్

శ్రీధర్ కొమ్మాలపాటి – 10168
ఠాగూర్ మల్లినేని – 13300✌️

స్పోర్ట్స్ కోఆర్డినేటర్

శ్రీరామ్ ఆలోకం – 10213
నాగ పంచుమూర్తి -13261✌️

ఫౌండేషన్ ట్రస్టీ

రామకృష్ణ అల్లు – 12515✌️
భక్త బల్లా – 13552✌️
శ్రీనివాస్ కూకట్ల – 12286✌️
సత్యనారాయణ మన్నె -11196
రవికిరణ్ మువ్వ – 10490
నాగరాజు నలజుల – 9883
సుమంత్ రామ్ – 9643
రవి సామినేని – 10148
రాజా సూరపనేని – 13170✌️
ఎండూరి శ్రీనివాస్ – 12261✌️