మానవ సంబంధాల్లో శృంగారం కూడా కీలక పాత్ర పోషించే అంశం. పరిణతి చెందిన మానవ నాగరికతలో శృంగారం అనేది దాంపత్యంలో భాగం అనుకుంటున్నప్పటికీ.. శృంగార ఆలోచనల్లో మాత్రం ఇలాంటి పరిమితులు ఉండకపోవచ్చు!
ఎంత నాగరికత అనుకున్నా.. మనిషి కూడా ఒక రకమైన జంతువే! జంతువుల్లో శృంగారానికి పరిమితులు ఉండనట్టుగా మనిషి ఆలోచనల వరకూ అయినా పరిమితులు ఉండవు. మనుషుల్లో మగవాడు బలవంతుడు కావడంతో తన శృంగార కాంక్షలను రకరకాలుగా తీర్చుకునే అవకాశాలు ఎక్కువ.
ఎక్కువమంది స్త్రీలతో గడపడం అనేది మగవాడి శృంగార కాంక్షకు సంబంధించి తరచూ కలిగే ఆలోచన. తనకు ఇష్టమైన స్త్రీతో, లేదా అందమైన స్త్రీతో రమించాలని వాంఛించడం, ఇందుకోసం అన్ని అర్హతలనూ సంపాదించుకోవడానికి లేదా, సదరు స్త్రీని ఆకట్టుకోవడానికి మగవాడు ఏదైనా చేస్తాడు.
ఆర్థికంగా బలవంతుడికే అందమైన స్త్రీ అనేది సమాజం సహజంగా నిర్దేశించుకున్న ప్రమాణం! ఇలా చూస్తే మనుషుల్లో మగవాడు అనే జంతువు తన బలం లేదా అర్హతలతో తన జాతిలోని అందమైన స్త్రీతో సంబంధాన్ని ఏర్పరుచుకుంటుంది.
ఇదంతా మనిషి శృంగార ప్రవర్తన, ఆలోచనల్లో భాగమైన ఒక విధానం. అయితే మనిషి ఆలోచనలు అంతటితో ఆగవు. దాంపత్యంతో శృంగార ఆలోచనలు ఆగిపోవు. దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టకముందు, అడుగుపెట్టిన తర్వాత కూడా శృంగారం గురించి బోలెడన్ని ఆలోచనలు, కాంక్షలు ఉండటమూ అసహజం ఏమీ కాదు. ఇవి అసహజం అని సమాజం చెప్పింది.
ఆయా సామాజిక పరిస్థితులను బట్టి సమాజం, మతం, పద్దతులు, కట్టుబాట్లు.. ఇవన్నీ కూడా మనిషి శృంగార లక్షణాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. సమాజం మెరుగైన పద్ధతిలో నడవడానికి ఆయా సామాజిక పరిస్థితుల దృష్ట్యా వచ్చిన కట్టుబాట్లే మనిషి తప్పనిసరిగా ఫాలో కావాల్సిన పద్ధతులు ఇవి అని అంగీకరించేలా చేశాయి. వీటన్నింటి ఫలితంగా మనిషిలో లైంగికాసక్తికి సంబంధించి జంతు ప్రవృత్తి మరుగయ్యింది!
మరి నిజంగానే మరుగయ్యిందా? అంటే… ఇది అందరి విషయంలో కాదు! మనిషిలో సహజంగా ఉండి, సామాజిక కట్టుబాట్లతో నిద్రాణమైన అసలు శృంగార ప్రవృత్తి ఎక్కడికీ పోలేదు. అది అవకాశాన్ని బట్టి చాలా మందిలో మేలుకొనవచ్చు. ఇలాంటి వారు మనిషిలోని అతి సహజమైన శృంగార ప్రవృత్తిని ఆస్వాధింవచ్చు. అయితే అది వారికి అవకాశాల మేర మాత్రమే సాధ్యం అవుతుంది!
నయా నాగరికతలో కాల్ గర్ల్స్ కల్చర్ తో పాటు, మసాజ్ పార్లల్, రెడ్ లైట్ ఏరియా లకు అలవాటు పడ్డవారు బోలెడంతమంది కనిపిస్తారు. ఆర్థికంగా తమకున్న స్వేచ్ఛను ఇలా శృంగార స్వేచ్ఛకు అనుగుణంగా వాడుకోవడం అతి సహజంగా మారింది. ఇది కాల క్రమంలో వచ్చిన మార్పేమీ కాదు. ఆయా నాగరికతల్లో, ఆయా సమాజాల్లో ఎప్పుడూ ఉన్న కథే ఇది. పాతకాలంలో మగాడు రెండు పెళ్లిళ్లు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు బోలెడంతమంది ఉంటారు.
అది వారికి ఆర్థిక స్వతంత్ర ద్వారా లభించిన లైంగిక స్వేచ్ఛ. ఇప్పటి కల్చర్ లో వీలైనన్ని పెళ్లిళ్లు అనే కాన్సెప్ట్ లేకుండా పోయింది. అతి రహస్యంగా మసాజ్ పార్లల్ కు వెళ్లడం, వేశ్యలతో గడపడం ఇదంతా మనిషిలో నిద్రలేచిన లైంగిక ప్రవృత్తికి నిదర్శనాలే అనుకోవచ్చు!
చాలా వరకూ ఈ తరహా లైంగిక స్వేచ్ఛను మగవాళ్లు, అందునా ఆర్థికంగా, సామాజికంగా హెచ్చు స్థాయిలో ఉన్న మగవాళ్లే ఆస్వాధించే అవకాశం ఉంది. ఈ తరహా స్థాయికి ఎదిగినా స్త్రీ పై మాత్రం కట్టుబాట్ల ప్రభావం ఇంకా అధికమే. ఆమె ప్రవర్తనను గమనించే వాళ్లు ఎక్కువ!
మగవాడు అవకాశాలను క్రియేట్ చేసుకోగలడు. ఉపయోగించుకోగలడు. ఉద్యోగం, వృత్తి ముసుగులోనే అన్ని అవసరాలను తీర్చుకుంటాడు. స్త్రీకి ఈ ఆప్షన్లు తక్కువ. పిల్లలు ఈ ఆలోచనలు కూడా అన్ని విధాలుగానూ కట్టడి చేస్తాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో స్త్రీలకూ వివాహేతర సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉండనే ఉంటాయి. దీనికి కారణమూ మళ్లీ మరో మగవాడే! తన లైంగిక స్వేచ్ఛను వివాహేతర సంబంధాల వైపు మళ్లించే ఆసక్తికీ మగవాడు మినహాయింపు ఏమీ కాదు సుమా!