తరచూ లేదా రెగ్యులర్ గా పోర్న్ ను వీక్షించే వారు ఎవరైనా వారు మానసికంగా ఒకింత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్టే అంటున్నాయి అధ్యయనాలు. రెగ్యులర్ గా పోర్న్ ను వీక్షించడం అంటే.. దాన్నొక వ్యసనంగా మార్చుకోవడం అంటే.. మనిషి అందులో కూరుకుపోతున్నట్టే అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ యుగంలో పోర్న్ కేవలం కొన్ని టచ్ ల దూరంలోనే ఉంది! 15 యేళ్ల కిందటి వరకూ కూడా పోర్న్ చూడటం అంటే ఒకింత సాహసమే.
సీడీలు, డీవీడీ ల రోజుల్లో ఒక్క పోర్న్ ఫిల్మ్ ను సంపాదించడానికే జనాలు చాలా కష్టపడేవారు. సీడీ షాపుకు వెళ్లి పోర్న్ డిస్క్ లను అడిగే సాహసం ఎంతమందికి ఉండేది? ఇంటర్నెట్ కెఫేల రాకతో పరిస్థితి మారిపోయింది. తెలివైన నిర్వాహకులు తమ సెంటర్లలోని కంప్యూటర్లలో ఫిల్మ్ లను డౌన్ లోడ్ చేసి పెట్టి జనాలకు శ్రమను తగ్గించి, తాము సొమ్ము చేసుకోవడం చేశారు. ఆ తర్వాత జనాలకు డైరెక్టుగా నెట్ తో పోర్న్ యాక్సిస్ ఈజీ అయ్యింది. ఈ క్రమంలోనే పోర్న్ విపరీత స్థాయి వీక్షకాదరణను కూడా పొందడం మొదలైంది. ఒక్క డీవీడీతోనే సంతృప్తి పడిపోయే రోజుల దగ్గర నుంచి, వందల, వేల వీడియోలపై యాక్సిస్ లభించింది. ఇదే ప్రమాదకరమైన ధోరణికి కారణం అవుతోందని కూడా పరిశీలకులు అంటున్నారు.
పోర్న్ ఒక ట్రాన్స్!
పోర్న్ ను అతిగా చూస్తున్న వారు క్రమంగా దాని ట్రాన్స్ లోకి వెళుతున్నట్టే అని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీరికి రియల్ లైఫ్ మనుషుల మీద పూర్తిగా ఆసక్తి తగ్గిపోవడం ఒక ప్రమాదకరమైన ప్రభావం. తెరపై పోర్న్ ను చిత్రీకరించిన యాంబియన్స్ కు వీరు పూర్తిగా అడిక్ట్ అయిపోవచ్చు. పోర్స్ కోసమే సర్జరీలు చేయించుకున్న శరీరాలను వీక్షించి, వీక్షించి వీరు నిజ జీవితంలో శృంగార భావనలను పోగొట్టుకోవచ్చని, పోర్న్ మాత్రమే నిజమైన శృంగారం అనే భావనలోకి క్రమంగా వెళ్లిపోవచ్చని అధ్యయనకర్తలు హెచ్చరిస్తున్నారు. అతిగా పోర్న్ వీక్షణ వల్ల సహజసిద్ధమైన భావనలను కోల్పోతారనేది ఈ హెచ్చరిక సారాంశం.
సెక్స్ స్పందనలు పూర్తిగా!
శృంగార స్పందన కలిగినప్పుడు పోర్న్ చూడటం మొదలైతే.. ఈ అలవాటు అతిగా మారితే.. దాన్ని ప్రతి రోజూ చూడక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చనేది మరో ప్రమాద సూచిక! శృంగారాన్ని పొందాలనుకున్న ప్రతిసారీ పోర్న్ చూడక తప్పని పరిస్థితికి దిగజారిపోయే వారూ ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరికి సెక్స్ స్పందనలు పూర్తిగా పోర్న్ తో మమేకం అవుతాయని అతిగా పోర్న్ ను చూడటం ఇలాంటి పరిస్థితికి దారి తీయవచ్చు.
నిజ జీవితంలోనూ అలా చేయాలనే యత్నం!
ఇది మరో తీవ్ర పర్యవసనం. పోర్న్ ను అతిగా వీక్షించే వారు దాన్ని తమ జీవితంలోనూ ప్రతిబింబించాలనే అపోహల్లోకి వెళ్లే ప్రమాదమూ ఉండవచ్చంటున్నారు. యుక్త వయసులోని వారు పోర్న్ ను వీక్షించి నిజంగానే శృంగారం అలా ఉంటుందనుకునే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. అయితే పోర్న్ అనేది వాస్తవం కాదని తెలుసుకోవడానికి వారికి చాలా సమయం పట్టవచ్చు. అయితే ఎప్పటికీ దాన్ని తెలుసుకోలేని వారు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలుంటాయి. పోర్న్ లో చేసినట్టుగానే తాము చేయాలనుకోవడం, తమ పార్ట్ నర్ ను అలా డిమాండ్ చేయడం.. చాలా డిస్ట్రబెన్సెన్స్ ను క్రియేట్ చేయవచ్చు. తమ భర్త పోర్న్ చూసి తమతో అనుచితంగా ప్రవర్తిస్తుంటాడని పోలిస్ స్టేషన్లకు ఎక్కే ఆడవాళ్లూ అడపాదడపా వార్తల్లో నిలవడాన్నిఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.
స్వీయ నియంత్రణ కోల్పోతారు!
పోర్న్ ను అతిగా వీక్షించే వాళ్లు మోరల్ గా తమ స్వీయ నియంత్రణను కోల్పోయే అవకాశాలూ ఉంటాయి. పోర్న్ ను అతిగా వీక్షించడం వల్ల ఉచ్ఛనీఛాలను మరిచిపోయే అవకాశాలు ఉండవచ్చు. ఇది కూడా పోర్న్ విషప్రభావమే.
పోర్న్ ను వీక్షించడం అత్యంత పాపం అయితే కాకపోవచ్చు. మెచ్యూర్డ్ మెంటాలిటీలు అయితే పార్ట్ నర్ తో కలిసి పోర్న్ ను ఒక సరదా కోణంలో చూడటం కాస్త సరదాతో కూడిన అంశమే అని సెక్సువల్ థెరఫిస్టులు చెబుతూ ఉంటారు. అయితే రెగ్యులర్ గా పోర్న్ చూడటం, దాన్నొక అలవాటుగా లేదా వ్యసనంగా మార్చుకోవడం, పోర్న్ వీక్షణకు బానిసగా కావడం మాత్రం మానసికంగా ప్రమాదకరమైన అంశమే అని వారే స్పష్టం చేస్తున్నారు.