రాశిఫలాలు… 19.07.20 నుంచి 25.07.20 వరకు

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. అందరిలోనూ పరపతి పెరుగుతుంది. సంఘంలో విశేష గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.…

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. అందరిలోనూ పరపతి పెరుగుతుంది. సంఘంలో విశేష గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థికం…ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. రుణాలు సైతం తీరుస్తారు. ఆస్తుల విక్రయాలు పూర్తి చేసి మరింత సొమ్ము సమకూరు తుంది. కుటుంబం…మీ ప్రయత్నాలలో కుటంబ సభ్యులు భాగస్వాములవుతారు. శుభకార్యాలు నిర్వహి స్తారు. సంతానపరంగా శుభవార్తలు. ఆరోగ్యం.. స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. వైద్యసేవలు. వ్యాపారాలు.. గతం కంటే లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాలు.. అనుకున్న ెదాలు దక్కించుకుంటారు. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. పదవులపై ఆశలు. మహి ళలకు మానసిక ప్రశాంత. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి. 

వృషభం: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంతగా ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. మీకష్టం వేరొకరికి లాభంగా మారుతుంది. ఒక సమాచారం కొంత ఆదుర్దా కలిగిస్తుంది. కాంట్రాక్టులు తుదిక్షణంలో చేజారతాయి. మిత్రులతో అకారణంగా తగాదాలు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థికం…రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడతారు. కొత్త రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆస్తుల విక్రయాలు నిలిచిపోయి రావలసిన సొమ్ము ఆగిపోవచ్చు. కుటుంబం….కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తండ్రి తరఫు వారు ఒత్తిడులు పెంచుతారు. ఆరోగ్యం….శారీరకరుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలు…స్వల్ప లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలు.. విధులు కాస్త చికాకు పరుస్తాయి. పారిశ్రామికవేత్తలకు గందరగోళం తప్పదు. మహిళలకు ఆస్తి తగాదాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. 

మిథునం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కాస్త అనుకూలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థికం…ఆకస్మిక ధనలాభం. రుణాలు తీరతాయి. ఆస్తి విక్రయాలు లాభించి కొంత లబ్ధి పొందుతారు. కుటుంబం.. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుం టారు. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. సంతాన పరంగా అనుకూల సమాచారం అందుతుంది. ఆరోగ్యం… కొన్ని రుగ్మతలు తీరి ఉపశమనం లభిస్తుం ది. వ్యాపారాలు…కొత్త పెట్టుబడులు సమకూరతాయి. లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగాలు….అనుకూల వాతావరణం నెలకొంటుంది. సహచరులతో ఉత్సాహం గా గడుపుతారు. పారిశ్రామికవర్గాలకు చికాకులు తొల గుతాయి. సంస్థల వికేంద్రీకరణ యత్నాలు సఫలం. మహిళలకు శుభవార్తలు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హదయం పఠించండి. 

కర్కాటకం: కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి కొంత బయటపడతారు. ఆర్థికం…రుణభారాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. కుటుంబం…శుభకార్యాలపై చర్చలు, ప్రణాళికలు రూపొందిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కొన్ని చికాకులు మీ మనస్సును బ్యాధించవచ్చు. ఆరోగ్యం…స్వల్ప అనారోగ్య సూచనలు, ఔషధసేవనం. వ్యాపారాలు… భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. లాభాలు అందుతాయి. ఉద్యోగాలు.. కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పైస్థాయి వారి నుంచి సమస్యలు తీరతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు గందరగోళం తొలగుతుంది. మహిళలకు ఆస్తిలాభం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తిని పూజించండి. 

సింహం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఇంటా బయటా మీ మాటకు ఎదురుండదు. ప్రస్తుత పరిస్థితుల నుంచి క్రమేపీ బయటపడతారు. ఆర్థికం.. ఇబ్బందులు అధిగమిస్తారు. రుణాలు తీరతాయి. కుటుంబం…సమస్యల నుంచి బయటపడతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానపరంగా కీలక సమాచారం అందుతుంది.  ఆరోగ్యం….కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాలు.. గతం కంటే లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు మరింతగా అందుతాయి. ఉద్యోగాలు.. మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విధుల్లో ప్రశాంత స్థితి. పారిశ్రామికవర్గాలకు పట్టిందిల్లా బంగారమే. మహిళలకు సోదరుల నుంచి ధనలాభం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి. 

కన్య: ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆర్థికం.. పెండింగ్ బాకీలు వసూలవుతాయి. రుణాలు సైతం తీరతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై కొంత ధనలాభం కలుగుతుంది. కుటుంబం.. ఉత్సాహవం తంగా ఉంటుంది. కొన్ని ఈతిబాధలు తొలగుతాయి. శుభకార్యాలపై ప్రణాళిక రూపొందిస్తారు. ఆరోగ్యం… స్వల్ప అనారోగ్య సూచనలు, వైద్యసేవలు పొందు తారు. వ్యాపారాలు.. కొత్త భాగస్వాములు జతకడ తారు. తగినంత లాభాలు అందుతాయి.  ఉద్యోగాలు.. విధి నిర్వహణలో ఒత్తిడులు తొలగుతాయి. అనుకున్న లక్ష్యాలు స్యాధిస్తారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహ కరంగా ఉంటుంది. మహిళలకు ఆస్తి లాభాలు గడిస్తారు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. 

తుల: వీరికి పట్టింది బంగారమే. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, ఆభర ణాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. దూరమైన సన్నిహితులు తిరిగి దగ్గరకు చేరతారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితులను చాకచక్యంగా అధిగమిస్తారు. ఆర్థికం…ఆదాయం మరింత పెరుగుతుంది. అవస రాలు తీరతాయి. అప్పులు సైతం చాలావరకూ తీరతాయి. కుటుంబం…కొన్ని విషయాలలో నిర్ణ యాలు తీసుకుని సభ్యులను ఉత్సాహపరుస్తారు. ఆరోగ్యం…కొద్దిపాటి రుగ్మతలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు.. భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యో గాలలో మీకు అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు కుటుంబంలో మరింత గౌరవం పెరుగుతుంది. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి. 

వశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు కొంత శ్రమపడ్డా పూర్తి చేస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను క్రమేపీ అధిగమిస్తారు. ఆర్థికం.. అనుకున్న విధంగా సొమ్ము సమకూరుతుంది. రుణబాధలు తీరతాయి. క్రయవిక్రయాలలో లాభాలు ద్వారా మరింత ధనలాభం కలుగుతుంది. కుటుంబం.. అందరితోనూ సంతోషంగా గడుపుతారు. సోదరులతో వివాదాలు తీరతాయి. సంతానం నుంచి ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం….దీర్ఘకాలిక రుగ్మతలు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు….తగినంత లాభాలు అందుతాయి. భాగస్వాములతో ఒప్పందాలు పునరుద్ధరిస్తారు. ఉద్యోగాలు…విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. కొన్ని సంస్థలను పునరుద్ధరిస్తారు. మహిళలకు కొన్ని సమస్యలు తీరతాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. వాహన, గహయోగాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు ఫలితాలు మరింత ఊరటనిస్తాయి. ఆర్థికం….రావలసిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి విక్రయాలు పూర్తి చేసి లబ్ధి పొందుతారు. కుటుంబం.. ఒకరి ఆరోగ్యం కుదుటపడి ఊపిరిపీల్చుకుంటారు. సంతానం వివాహ విషయాలలో నిర్ణయాలు తీసుకుం టారు. ఆరోగ్యం…కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు….తగినంత లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు.. కోరుకున్న మార్పులు సంభవం కావచ్చు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. రాజకీయవేత్తలకు ఆదరణ మరింత పెరుగుతుంది. మహిళలకు భూలాభాలు కలుగుతాయి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం: కొత్త పనులు చేపడతారు. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు ఎట్టేకలకు దక్కించుకుంటారు. ఆర్థికం…ఊహించని విధంగా ధనప్రాప్తి కలుగవచ్చు. రుణబాధలు తొలగుతాయి. షేర్ల విక్రయాల ద్వారా మరింత లాభం కలుగుతుంది. కుటుంబం….అందరూ మీరంటే మరింత ఇష్టపడతారు. వివాహాది వేడుకల నిర్వహణకు సంసిద్ధులవుతారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం….కొంత నలత చేసి ఇబ్బంది పడ్డా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు….గతం కంటే లాభాలు మరింత దక్కుతాయి. పెట్టుబడులు అనూహ్యంగా అందుతాయి. ఉద్యోగాలు….పనిభారం తొలగుతుంది. ఉన్నతాధికారుల నుంచి పూర్తి సాయం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. మహిళలకు శుభవార్తలు అందుతాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణ్యుధ్యానం చేయండి.

కుంభం: కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుని పనులు చక్కదిద్దుతారు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. ఎన్నడో నిలిచిపోయిన ముఖ్య వ్యవహారం ప్రస్తుతం నెరవేరుతుంది. ఆర్థికం….రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. ఎటువంటి ఖర్చు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబం….మీపై అందరికీ ప్రేమ పెరుగుతుంది. మీ నిర్ణయాలు స్వాగతిస్తారు. కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. సంతానం నుంచి సైతం ముఖ్య విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు…ఆశించిన మేరకు లాభాలు గడిస్తారు. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలు….ఒత్తిడుల నుంచి బయటపడతారు. కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మహిళలకు సోదరీల నుంచి లబ్ధి చేకూరుతుంది. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మీనం: కొన్ని కార్యక్రమాలను ఎట్టేకలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. ఆర్థికం.. ఆశించిన మేర ఆదాయం లభిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వారాంతంలో ఆకస్మిక ధనప్రాప్తి యోగం. కుటుంబం.. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. సంతానపరంగా క్షేమసమాచారాలు అందుకుంటారు. తండ్రి తరఫు నుంచి ప్రోత్సాహం. ఆరోగ్యం….కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు.. తగినంత లాభాలు అందుతాయి. పెట్టుబడులకు భాగస్వాములు ముందుకు వస్తారు. విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలు… విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు తొలగుతాయి. మహిళలకు విశేష ఆదరణతో పాటు, కుటుంబసభ్యుల ప్రోత్సాహం అందుతుంది. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

Vakkantham Chandra Mouli 
www.janmakundali.com