రాశిఫలాలు.. 26.07.20 నుంచి 01.0.20 వరకు

మేషం: అనుకున్న కార్యక్రమాలు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. మీ అభిప్రాయాలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వీరికి  శుక్రుడు, బుధ,రాహువులు గురు గ్రహాలు అనుకూలస్థితిలో…

మేషం: అనుకున్న కార్యక్రమాలు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. మీ అభిప్రాయాలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వీరికి  శుక్రుడు, బుధ,రాహువులు గురు గ్రహాలు అనుకూలస్థితిలో ఉన్నందున వీరికి కుటుంబపరంగా, ఆర్థికంగా, వత్తులపరంగా విశేషంగా కలసివస్తుంది. ఆరోగ్యం కాస్త కుదుటపడతుంది. ఆర్థికం…కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. రుణాలు తీరి ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబం….అందరి ప్రేమాభిమానాలు చూరగొంటారు. శుభకార్యాలు నిర్వహణలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు.. గతం కంటే కాస్త పుంజుకుంటాయి. పెట్టుబడులు క్రమేపీ సమకూరతాయి. ఉద్యోగాలు….కోరుకున్న మార్పులు సంభవం. పనిఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అనుకూల పరిస్థితులు. మహిళల ఆకాంక్షలు నెరవేరే సమయం. ఆంజనేయ స్వామిని పూజించండి.

వృషభం: పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఎంతటి వ్యక్తినైనా మాటలతో ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దేక్క ఛాన్స్. శుక్ర, రవి, కుజ గ్రహాలు అనుకూలమైనందున వీరికి తండ్రి తరఫు లాభాలు, జీవిత భాగస్వామితో సఖ్యత, భూలాభాలు కలిగే అవకాశాలున్నాయి. గురు, రాహు దోషం వల్ల లేని పోని అపవాదులు, ఆరోగ్యసమస్యలు ఎదురుకావచ్చు. ఆర్థికం…రావలసిన సొమ్ము అందినా ఏదో ఖర్చు ఎదురవుతూ చేతిలో సొమ్ము నిలపడని స్థితి. అయినా ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబం…. అందరితోనూ సఖ్యత మెలగుతారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు… క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగాలు… అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. సహచరుల సాయం అందుతుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా పడతాయి. మహిళలకు విశేష గౌరవం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మిథునం: వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే విధంగా ఆత్మస్క్థెర్యం పొందుతారు. వీరికి ఒక్క గురుగ్రహం తప్ప మిగతావి అనుకూలం కానందున కొన్ని సమస్యలు, వివాదాలు నెలకొన్నా గురు, చంద్రబలాల వల్ల అధిగమిస్తారు. అయితే అప్రమత్తత అవసరం. చేపట్టిన కార్యక్రమాలు కొంత నిదానించినా ఎట్టేకలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఆస్తుల విషయం పరిష్కారానికి కొంతకాలం నిరీక్షణ తప్పదు. ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు సోదరులతో మరింత సఖ్యత. అంగారక స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: చేపట్టిన పనులు క్రమేపీ పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి ఉత్సాహంగా గడుపుతారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. అలాగే, భూములు, ఇళ్లు వంటివి కొనుగోలు చేస్తారు. వాహనాల విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం. ఆర్థికం…సొమ్ములకు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. రుణాలు తీరతాయి. కుటుంబం….అందరితోనూ సఖ్యంగా మెలుగుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం.. కొంత నలత చేసి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు….లాభాల దిశగా సాగుతాయి. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలు… కోరుకున్న మార్పులు సంభవం. పైస్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. మహిళలకు సోదరీల నుంచి శుభవార్తలు. గణేశాష్టకం పఠించండి.

సింహం: కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. అయితే గురు, కుజ, శుక్ర ్రగ్రహాలు అనుకూలత కొంత ఉపకరిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థికం…రావలసిన సొమ్ము ఆలస్యంగా అందుతుంది. రుణాలు చేసే పరిస్థితులు రావచ్చు. అయితే, ఖర్చులు అదుపులో ఉంచుతారు. కుటుంబం….మీపై కుటుంబసభ్యులు ఉంచిన బాధ్యతలతో సతమతమవుతారు. మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను తిరస్కరిస్తారు. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆరోగ్యం…కొన్ని రుగ్మతలతో ఇబ్బంది పడతారు. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు…అనుకున్న లాభాలు అతికష్టంపై రావచ్చు. అయితే పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలు…పనిభారం, అదనపు బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు చికాకులు తప్పవు. మ్ళై ళలకు స్వల్ప ధనలబ్ధి. శివాష్టకం పఠించండి.

కన్య: ఏ కార్యక్రమమైనా సజావుగా పూర్తి చేస్తారు. వీరికి కుజ గ్రహం మినహా మిగతావి అనుకూల స్థితిలో ఉన్నందున అన్నివిధాలా అనుకూలం. అయితే కుజగ్రహ ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో వివాదాలకు ఆస్కారం ఉంటుంది. ఆర్థికం…డబ్బులకు లోటు ఉండదు. ఇతరులకు బకాయిలు సైతం చెల్లిస్తారు. ఆస్తుల విక్రయాలు పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు. కుటుంబం….మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై చర్చలు జరుపుతారు. ఆరోగ్యం… కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు….క్రమేపీ లాభాల దిశగా సాగుతాయి. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగాలు.. అనుకూల మార్పులతో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తల  కషి ఫలిస్తుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దత్తాత్రేయుని పూజించండి.

తుల: వీరికి గతం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు తొలగి ఊరట లభి స్తుంది. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. వీరికి బుధ, రవి గ్రహాలు మినహా మిగతావి వ్యతిరేకంగా ఉన్నందున మధ్యమధ్యలో కొన్ని సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబపరంగా నెలకొన్నా రవిగ్రహ అనుకూలత వల్ల బయట పడతారు. ఆర్థికం…కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తొలగే సూచనలు. కుటుంబం…మీ అభిప్రాయాలను అం దరూ గౌరవిస్తారు. పెద్దల సూచనలు పాటిస్తారు. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా సర్దుకుంటాయి. వ్యాపారాలు.. ఆశించిన మేర లాభా లు అందుతాయి. బాగస్వాములతో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగాలు.. పనిభారం కాస్త తగ్గి ఊరట చెందుతారు. పైస్థాయి వారి నుంచి సహకారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వశ్చికం: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. వీరికి రాహు, బుధుల స్థితి తప్ప మిగతా గ్రహాలు అనుకూలం. అయితే రాహుదోషం అధికంగా ఉన్నందున వాహనాలు విషయాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థికం.. సొమ్ములకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. షేర్ల విక్రయాల వల్ల ఆశించిన డబ్బు అందుతుంది. కుటుంబం…శుభకార్యాల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంతాన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యం… వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.  వ్యాపారాలు…లాభాల దిశగా సాగుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు…కొన్ని మార్పులు జరిగినా అనుకూలంగానే ఉంటాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వీరికి ఈవారమంతా చంద్రబలమే శ్రీరామరక్షగా ఉంటుంది. మిగతా గ్రహాలు సామాన్యమే. ముఖ్యంగా శని, కుజుల సంచారం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థికం…కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. స్థిరాస్తుల విక్రయాలు సజావుగా సాగి మరింత డబ్బు సమకూరుతుంది. కుటుంబం…సోదరులు,సోదరీలతో వివాదాలు సర్దుకుంటాయి. శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. వ్యాపారాలు… వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. అయితే భాగస్వాముల ప్రోత్సాహం పూర్తిగా ఉంటుంది. ఉద్యోగాలు….విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఉన్నత పోస్టులకు అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.మహిళలకు కుటుంబంలో ఆదరణ లభిస్తుంది. హనుమాన్ ఛాలీసా పఠించండి.

మకరం: మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. పాతవిషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. మిత్రుల సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. వాహనాలు, గహం కొను గోలు యత్నాలు సానుకూలం. వీరికి కుజ, శుక్ర, బుధులు అనుకూలస్థితి వల్ల ముఖ్యంగా భూలాభాలు, వ్యాపారవద్ధి. వైవాహిక జీవితంలో ప్రశాంతత వంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థికం.. సొమ్ము అందినా ఖర్చులు కూడా పెరుగుతాయి. రుణబాధలు తట్టుకోవ లసిన సమయం. వ్యాపారాలు…కొంత మేర లాభాలు అందుతాయి. అయితే పెట్టుబడుల విషయంలో మీ నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు… కోరుకున్న మార్పులు జరిగే వీలుంది. విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం. మహిళలకు మానసిక ప్రశాంతత. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కుంభం: ప్రారంభంలో కొన్ని సమస్యలు వేధించినా ధైర్యంగా అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దష్టి సారిస్తారు. మీ సత్తా చాటుకుని అందరి లోనూ గుర్తింపు పొందుతారు. విలువైన వస్తువులు కొంటారు. వీరికి శుక్ర, గురుగ్రహాలు విశేషంగా ఉన్నందున ఆర్థికంగా, కుటుంబపరంగా మరింత అనుకూలత ఉంటుంది. ఆర్థికం.. రెండుమూడు విధా లుగా ధనప్రాప్తి. రుణవిముక్తి లభిస్తుంది. ఆస్తుల విక్ర యాలు పూర్తి చేసి మరింత డబ్బు అందుకుంటారు. కుటుంబం…మీ ప్రేమాభిమానాలకు కుటుంబసభ్యులు ఆనందిస్తారు. పెద్దలు మీకు చేదోడుగా నిలుస్తారు. వివాహాది వేడుకల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుం టారు. వ్యాపారాలు…క్రమేపీ లాభాల బాటలో నడు స్తారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు.. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. ఉన్నతస్థాయి వారు సైతం ప్రశంసిస్తారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: కొన్ని కార్యక్రమాలు కొంత నిదానించినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. వీరికి కుజ, రాహు, శుక్రబలం తక్కువగా ఉన్నందున మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురు కావ చ్చు. ముఖ్యంగా వాహనాలు నడిపే వారు అప్రమత్తం గా ఉండాలి. ఆర్థికం.. డబ్బులకు మాత్రం కొదవలే కున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. షేర్ల విక్రయాలు పూర్తిచేసి కొంత సొమ్ము సమకూర్చు కుంటారు. కు టుంబం.. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారవుతుంది. సంతాన పరంగా మరింత సౌఖ్యం. ఆరోగ్యం…కొంత నలత చేసి వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు…లాభాలు అందుతాయి. ఉద్యోగాలు.. విధుల్లో చికాకులు తొలగుతాయి. ఉన్నత స్థాయి నుంచి పిలుపు రావచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు సోదరీల నుంచి పిలుపు రావచ్చు. విష్ణుధ్యానం చేయండి.

Vakkantham Chandra Mouli 
www.janmakundali.com