శృంగారం అంటే కేవలం శారీరకమైన కలయిక కాదనే థియరీలున్నాయి. లైంగికావయవాల కలయిక మాత్రమే శృంగారం కాదు. శృంగారం మానసికమైన ఆనందాన్ని ఇచ్చేది కూడా అని శతాబ్దాలుగా మానవ మనుగడ చెబుతూ ఉంది.
శతాబ్దాలుగా శృంగారం గురించి గ్రంథస్తం చేసిన వారు, అధ్యయనాలు చేపట్టిన వారు కూడా శృంగారంలో కిటుకుల గురించి, శృంగారాన్ని ఆస్వాధించాల్సిన తీరు గురించి బోలెడన్ని విషయాలను ఏకరువు పెట్టారు. శృంగారాస్వాధన గురించి అవన్నీ విశదీకరించాయి.
మరి పరిపూర్ణమైన శృంగారాస్వాధన గురించి అధ్యయనాలు, గ్రంథాలు చెప్పే అంశాల్లో ముఖ్యమైనది ఫోర్ ప్లే. శృంగారంలో అసలు రసమంతా ఫోర్ ప్లేదే అని అంటున్నాయి వివిధ అధ్యయనాలు. ఫోర్ ప్లే శృంగారంలో ఎంత కీలకమో చెబుతూ.. ఫోర్ ప్లే వల్ల కలిగే శారీరకమైన, మానసికమైన ఉపయోగాల గురించి కూడా అధ్యయనాలు వివరిస్తున్నాయి. వాటి సారాంశం ఏమిటంటే..
శృంగారాన్ని గొప్ప అనుభూతిగా మార్చే శక్తి ఈ రతిక్రీడకు ఉందని అంటున్నాయి అధ్యయనాలు, ఫోర్ ప్లేతో కూడిన శృంగారం చాలా ప్రత్యేకమైన అనుభవంగా మిగులుతుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి.
సాన్నిహిత్యం పెంచడంలో కూడా ఫోర్ ప్లేకు మహత్యం ఉందట. శృంగారం అనుభవం కోసం, కోరికతో అనుకున్నా.. ఫోర్ ప్లే మాత్రం అంతకు మించి! ఫోర్ ప్లేతో కూడుకున్న శృంగారంతో ఇరువురి మధ్యనా సాన్నిహిత్యం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
హెల్దీ హార్ట్ రేట్ ను సెట్ చేయడంలో కూడా ఫోర్ ప్లే కీలక పాత్ర పోషిస్తుందట. ఫోర్ ప్లే సమయంలో హృదయస్పందన వేగం పెరగవచ్చు. అంతిమంగా హార్ట్ రేట్ ను ఆరోగ్యవంతంగా మార్చి.. బ్లడ్ ప్లజర్ ను సెట్ చేయడంలో కూడా ఫోర్ ప్లేతో సాధ్యం అవుతుందట.
ఫోర్ ప్లే వల్ల స్త్రీ ఆరోగ్యం పై కూడా సత్ఫలితాలను ఇస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి మసాజ్ వంటి చర్య ద్వారా స్త్రీ వక్షద్వయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట ఫోర్ ప్లే. రక్తప్రసరణ మెరుగు పరచగలదట.
ఒత్తిళ్లను దూరం చేస్తుంది. వృత్తిగత జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఉండే ఒత్తిళ్లను పోగొట్టే శక్తి ఆరోగ్యకరమైన శృంగార బంధంలోని ఫోర్ ప్లేకు ఉంటుందట. ఇలా డీస్ట్రెస్ చేయడంలో కూడా ఫోర్ ప్లేకు మంచి పాత్ర ఉంటుందని అంటున్నాయి అధ్యయనాలు.
శృంగారంలో స్త్రీ పతాక స్థాయిని చేరడానికి కూడా ఫోర్ ప్లే కీలక పాత్ర పోషిస్తుందట. శృంగారంలో స్త్రీని సంతృప్తి పరచడంలో ఫోర్ ప్లే దే కీలక పాత్ర అని అధ్యయనాలు అంటున్నాయి.
ఈ టచ్ లతో ఇరువరి మధ్యనా సాన్నిహిత్యం పెరుగుతుందని, ప్రతి సారీ లైంగిక కలయిక లేకపోయినా.. ఫోర్ ప్లే కూడా ఇద్దరినీ చేరువ చేయగలదని పరిశోధనలు చెబుతున్నాయి.