మగాడితో స్త్రీ ఎలా నడుచుకోవాలో.. సమాజం చాలానే నేర్పిస్తుంది. అధికారికంగా కొన్ని విషయాలను, సామెతలు, శ్లోకాల పేరుతో మరి కొన్ని విషయాలను, అనధికారికంగా, గద్దింపులు, హెచ్చరికలతో మరి కొన్ని విషయాలనూ స్త్రీకి చాలా విషయాలనే నేర్పుతుంది సమాజం. ఇవిగాక.. స్త్రీ ఎలా నడుచుకోవాలనే విషయం గురించి బోలెడన్ని అధ్యయనాలు, పరిశోధనలు, సర్వేలు సరేసరి!
అయితే ఇంతకీ పురుషుడు స్త్రీతో ఎలా నడుచుకోవాలనే అంశం గురించి మాత్రం చర్చ తక్కువగా జరుగుతూ ఉంటుంది. మగాడికి ప్రత్యేకంగా ఏదీ నేర్పించాల్సిన అవసరం లేదనే తత్వమే సర్వత్రా ఉంటుంది. అయితే ఇది పూర్తిగా అబద్ధమని వేరే చెప్పనక్కర్లేదు. మనిషి రకరకాల సందర్భాల్లో మ్యానర్స్ ను ఎంతో కొంత అదనంగా ఎలా నేర్చుకోవాల్సి ఉంటుందో, దాంపత్యంలోనూ, శృంగారం విషయాల్లో కూడా నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. ఒకవేళ మగాడు ఏదీ కొత్తగా నేర్చుకోవాల్సిన, అలవరుచుకోవాల్సిన అవసరమే లేకపోతే..ప్రపంచం ఇప్పుడున్నట్టుగా అయితే ఉండదు! మనిషన్నాకా ఎప్పుడూ, ఏదో ఒకటి నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఉంటాడు. దీనికి పడకగది కూడా ప్రత్యేకం కాదు!
పడకగదిలో శృంగార సమయంలో.. చిన్న చిన్న విషయాల్లోనే అయినా మగాడి తీరు స్త్రీకి నచ్చని విధంగా కూడా ఉంటుందట. ఆ తరహాలో ఉండటం స్త్రీకి నచ్చదు. స్త్రీల అభిప్రాయాల నుంచినే అధ్యయనకర్తలు తీసుకున్న సమాచారం ప్రకారం.. ఆ సంగతులివి!
కామ్ గా పని చేసుకోకూడదు!
శృంగార సమయంలో పురుషుడు కామ్ గా తన పని తను చేసుకుపోవడాన్ని స్త్రీలు హర్షించరట. పడకగదిలో బోలెడన్ని ఊసులుంటాయి. శృంగార సమయంలో కూడా స్త్రీ వాటిని ఎక్స్ పెక్ట్ చేస్తుందట! టూ క్వైట్ గా ఉండటం, ఏమీ మాట్లాడకపోవడం.. స్త్రీని మూడ్ ఆఫ్ చేస్తుందట. మరేం చేయాలంటే.. ఫీలింగ్స్ ను ఎక్స్ ప్రెస్ చేయడాన్ని స్త్రీ ఎక్స్ పెక్ట్ చేస్తుందట. ఆమె పేరును పలవరించడం, మాటలకు అందని ఆనందం ఉంటే.. దాన్ని మాటల్లో ఎక్స్ ప్రెస్ చేయడాన్ని స్త్రీ ఆస్వాధిస్తుందట. కామ్ గా ఉంటే మాత్రం ఆ శృంగారం యాంత్రికం కాగలదనేది అధ్యయనకర్తల మాట.
సమన్యాయం చేయాలి!
ఫోర్ ప్లేను ఆస్వాధించే వాళ్లు కూడా ఒకే చోటపై అధికంగా కాన్సన్ ట్రేట్ చేయడం ఇబ్బంది పెడుతుందంటున్నారు అధ్యయనకర్తలు. స్త్రీలోని ఒకే స్పాట్ పై ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేయడం, ఫోర్ ప్లే అంటే అదే అన్నట్టుగా స్పందించడం సరి కాదట. శరీరంపై సమన్యాయం చేయాలని స్త్రీ మనసెరిగిన అధ్యయనం చెబుతోంది.
బట్టలు మార్చుకోవాలి, ముఖ్యంగా సాక్స్!
ఆఫీసుకు వెళ్లి వచ్చిన బట్టలతోనే అలాగే బెడ్ మీదకు వెళ్లడం, సినిమాల్లో చూపించినట్టుగా రాగానే మీద పడిపోవడం, ఆ సాక్సులైనా వదలక అలాగే చొచ్చుకుపోవడం గొప్ప సంగతేమీ కాదంటోంది ఈ అధ్యయనం. ఇన్ స్టాంట్ గా సెక్స్ వైపు మొగ్గుచూపడం ఉత్సాహమే కానీ, మగాడు వాడిపోయిన తీరున శృంగారం అంత హ్యాపీగా అయితే ఉందడట స్త్రీకి!
చెప్పకుండా ప్రయోగాలు వద్దు!
శృంగారం రోజులు గడిచే కొద్దీ భిన్నమైన రుచులను కోరుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఆమెను ప్రిపేర్ చేయకుండానే ఆసక్తి గురించి వివరించి చెప్పుకుండానే.. ప్రయోగాలను చేయడం, ఏకపక్షంగా వ్యవహరించడం కూడా వారికంత నచ్చదని అధ్యయనం చెబుతోంది.
ఆమెకేం కావాలో అడగాలి!
ఈ అధ్యయనం చెప్పే ఇంకో ముఖ్యమైన విషయం శృంగారంలో స్త్రీ ఆసక్తి ఏమిటో తెలుసుకోవాలనేది. తన ఇష్టానుసారం, తనకు తెలిసిన రీతిలో పురుషుడు చేసేదే శృంగారం అనుకుంటే పొరపాటు అని, లైంగిక చర్యలో కూడా స్త్రీ ఇష్టాయిష్టానికి ప్రాధాన్యత ఇవ్వడమే నిజమైన శృంగారం అవుతుందని ఈ అధ్యయనం వివరిస్తోంది.