సెక్సువల్ సీక్రెట్స్.. చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి! మరొకరి సెక్స్ లైఫ్ గురించి తెలుసుకోవడం..! ఇదొక క్రేజీ థింగ్. అయితే సాధారణంగా తెలిసిన వాళ్లతో ఇలాంటి అనుభవాలను పంచుకునే తత్వం అరుదుగా ఉంటుంది. అయితే రోజులు మారాయి. సెలబ్రిటీలతో చాట్ షో ల్లో అయితే.. సెక్స్ గురించినే చర్చ ఎక్కువగా ఉంటోంది! బాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ వరకూ ఇదే కల్చర్ అలవాటు అయ్యింది. ఈ చాట్ షోల్లో సెలబ్రిటీలు తమ సెక్సువల్ ప్రయారిటీస్ గురించి విపులంగా కాకపోయినా పొడిపొడిగా అయినా చెబుతూ ఉంటారు! ఇలా నోరు విప్పిన వారి జాబితా పెద్దదే!
ఒక చాట్ షో లో అలియా భట్ మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన సెక్సువల్ పొజిషన్ గురించి చెప్పింది. క్లాసిక్ మిషనరీ పోజు అంటే తనకు చాలా ఇష్టమని అలియా చెప్పింది. ఇప్పుడంటే అలియా వివాహిత కానీ, ఈ విషయాన్ని చెప్పినప్పటికి ఆమెకు అధికారికంగా ప్రియుడు కూడా లేడు! అప్పటికి రణ్ భీర్ తో ఆమె ప్రేమాయణాన్నే మొదలుపెట్టలేదు. కానీ తనకు ఇష్టమైన సెక్స్ వల్ పోజు గురించి ఈ అమ్మడు ఓపెన్ గానే చెప్పింది.
కేవలం అలియానే కాదు, ప్రస్తుత ఆమె భర్త రణ్ భీర్ కపూర్ కూడా తన సెక్సువల్ సీక్రెట్ ఒకటి పంచుకున్నాడు. తను 15 యేళ్ల వయసులోనే తొలి అనుభవాన్ని పొందినట్టుగా రణ్ భీర్ కపూర్ వివరించి చెప్పుకున్నాడు. మరీ టీన్ ఏజ్ లో సెక్సువల్ వాంఛలు పెరిగే వయసు అది. మరి బాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి.. రణ్ భీర్ కు అప్పుడే అనుభవాన్ని పంచుకునే అవకాశం దక్కింది కాబోలు. మరి ఏం చేయాలో.. ఎలా చేయాలో పూర్తిగా బోధపడని వయసులోనే అనుభవాన్ని పొందడం అంటే ఇతడు రియల్ ప్లే బాయ్!
ఇక రణ్ వీర్ సింగ్ కూడా ఈ తరహా వాడేనట. ఇతడు మరీ ముదురు. తనకు 12 యేళ్ల వయసులోనే ఆ అనుభవం ఉందని చెప్పుకున్నాడు. అంతేకాదట..తన ఈడు పిల్లలకు, టీనేజ్ లో తనే సెక్స్ కబుర్లు చెప్పేవాడట. పాఠాల్లా ఉండేవట ఆ మాటలు!
ఇక రణ్ భీర్ భార్య దీపికా పదుకోన్.. సెక్స్ అంటే అదొక ఎమోషన్ అంటోంది. సెక్సువల్ రిలేషన్ షిప్ ను లీడ్ చేసేది ఎమోషన్సే అని ఈమె చెప్పింది. శృంగారం అంటే అది కేవలం ఫిజికల్ థింగ్ కాదని, దాన్ని పరిపూర్ణం చేసే ఎమోషన్సే నిజమైన అనుభవాలని దీపిక అంటోంది.
ఇక వయసుతో పాటు సెక్సీ ఫీలింగ్స్ కూడా మారిపోతాయని అంటోంది ట్వింకిల్ ఖన్నా. చాలా యేళ్ల కిందటే వివాహం చేసుకున్న ఈమె.. తన భర్తలో తనను ఆకట్టుకునే అంశాలు వయసుతో పాటు మారాయని సెక్స్ కు అసలు అర్థం చెబుతోంది. యుక్త వయసులో ఉన్నప్పుడు, పెళ్లైన కొత్తలో బాగా నచ్చిన అంశాలూ, ఇప్పుడు తమ బంధంలో ఆసక్తిని కొనసాగించే అంశాలూ వేరు వేరని ట్వింకిల్ నిర్వచించింది.
ఇక తమ దాంపత్య జీవితంలో సెక్స్ కు మంచి ప్రాధాన్యత ఉందని చెప్పారు షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్. బెడ్ మీద తన భర్త కంట్రోల్ ఫ్రీక్ అంటూ మీరా చెప్పుకొచ్చింది. గ్లామరస్ లైఫ్ లో సెక్స్ ది ప్రధాన పాత్ర అని ఈ దంపతులు వివరించారు.
ఇవీ సెలబ్రిటీలు ఓపెన్ గా చెప్పుకున్న తమ సెక్సువల్ సీక్రెట్స్. మరి సామాన్యులు తమ సెక్సువల్ సీక్రెట్స్ ను ఇలా టీవీలకు ఎక్కి చెప్పాల్సిన అవసరమూ లేదు, అవంత ఆసక్తినీ ఎవరికీ కలిగించవు. అయితే శృంగార ప్రాధాన్యతల గురించి బయటి వారికి చెప్పినా చెప్పకపోయినా.. దాంపత్యంలో పరస్పరం ఈ ప్రాధాన్యతలు, ఆసక్తులు చెప్పుకుంటే మంచిదనేది రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ సలహా!