శృంగార ఆస్వాదనలో ఇండియన్స్ ముందున్నారు!

ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల పరిధిలోని ప్రజల శృంగార జీవితం గురించి జరిపిన ఒక అధ్యయనంలో భారతీయులకు ప్రముఖ స్థానమే దక్కింది. టాప్ టెన్ లో చోటు దక్కింది. ఎనిమిదో స్థానంలో ఉన్న భారతీయులు…

ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల పరిధిలోని ప్రజల శృంగార జీవితం గురించి జరిపిన ఒక అధ్యయనంలో భారతీయులకు ప్రముఖ స్థానమే దక్కింది. టాప్ టెన్ లో చోటు దక్కింది. ఎనిమిదో స్థానంలో ఉన్న భారతీయులు సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని గడుపుతున్నట్టుగా ఈ సర్వే పేర్కొంది.

ఎక్కువమంది సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని గడుపుతున్న గణాంకాల ప్రకారం స్విట్జర్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ఎక్కుమంది స్త్రీ, పురుషులు శాటిస్ ఫైడ్ సెక్సువల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

ఆ తర్వాత స్పెయిన్. ఇటలీ, బ్రెజిల్. గ్రీస్, హాలెండ్, మెక్సికో, ఇండియా, ఆస్ట్రేలియా, నైజిరియాలు నిలిచాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జనాలు చక్కటి శృంగార జీవితాలను గడుపుతున్న దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలే ముందున్నాయి. జీవన ప్రమాణ రేటు మంచి స్థాయిలో ఉన్న దేశాలకే ఇందులో చోటు దక్కింది. అయితే దీనికి ఇండియా, నైజీరియా, బ్రెజిల్ లు మినహాయింపు!

ఈ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్న జాబితాలో ఉన్నాయి. ఆర్థికంగా కష్టనష్టాలను ఎదుర్కొంటున్న జాబితాలో ఉన్నాయి. అయినా ఆ ప్రభావాలు ఆయాదేశాల ప్రజల సెక్సువల్ లైఫ్ పై ప్రభావం చూపించడం లేదని ఈ సర్వే చెబుతోంది.

విశేషం ఏమిటంటే.. ప్రపంచ పెద్దన్నగా పేరు పొందిన అమెరికా, శాస్త్రసాంకేతికరంగాల్లో ఎంతో అభ్యున్నతి సాధించిన దేశాలు.. చక్కటి సామాజిక పరిస్థితులు ఉన్న బ్రిటన్ వంటి దేశాలు కూడా టాప్ టెన్ లో నిలవలేకపోయాయి. ఆయాదేశాల ప్రజల వ్యక్తిగత జీవితాల్లో శృంగారం విషయంలో అసంతృప్తి ఎక్కువగానే ఉందని ఈ సర్వే తేల్చింది.