సుప్రీంకు 627 మంది నల్లకుబేరుల జాబితా

కేంద్ర ప్రభుత్వం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి 627 మంది నల్ల కుబేరుల జాబితాను సమర్పించింది. అయితే ఈ జాబితాలో ఎవరి పేర్లున్నాయన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకు కేంద్రం, నల్ల కుబేరుల జాబితాను…

కేంద్ర ప్రభుత్వం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి 627 మంది నల్ల కుబేరుల జాబితాను సమర్పించింది. అయితే ఈ జాబితాలో ఎవరి పేర్లున్నాయన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకు కేంద్రం, నల్ల కుబేరుల జాబితాను సమర్పించగా ఇందులో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సుప్రీంకు కేంద్రం అందించిన నల్ల కుబేరులకు సంబంధించి రెండు జాబితాలు వున్నట్లు తెలుస్తోంది. ఒకటి నల్లధనానికి సంబంధించిన జాబితా కాగా, మరొకటి విదేశాల్లో బ్యాంక్‌ అకౌంట్లు కలిగి వున్నవారి వివరాలతో కూడిన జాబితా. సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం, జాబితాను సుప్రీంకు అందజేసింది.

అటార్నీ జనరల్‌ ముకుల్‌ రహోత్‌గీ నల్ల కుబేరులకు సంబంధించిన జాబితాను అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించారు. జాబితాలోని పేర్లు వెల్లడవుతాయా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా పేర్లను వెల్లడించరాదంటూ సుప్రీంకోర్టును ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కోరిన దరిమిలా.. న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.