అమెరికాలో స్థిరపడిన, అమెరికాలో పనిచేస్తున్న ఎన్నారైల సంక్షేమం కోసం కృషిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) క్రమంగా విశేష ఆదరణ పొంది తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులకు కూడా 'తానా ఫౌండేషన్' పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపన్నహస్తం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ విభాగానికి చైర్మన్ గా శృంగవరపు నిరంజన్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. తాజా ఎన్నికతో 'తానా పౌండేషన్ ఛైర్మన్'గా ఆయన మరో రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.
రాబోయే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్య రంగంలో ఉత్తమ సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. అలాగే అమెరికాలో తెలుగు భాషకు, తెలుగు సంస్కృతుల పరిరక్షణకు సర్వదా కృషిచేస్తామని ఆయన భరోసాగా చెప్పారు. ఎంతోకాలంగా తానా ప్రజలకు చేస్తున్న సేవలకు మొన్నటి తానా మహాసభలకు వచ్చిన ఘన స్పందనే నిదర్శనమని ఆయన అన్నారు.
తనకు ఈ కీలక బాధ్యతలు అప్పజెప్పిన తానా ప్రముఖులు అందరికీ ఆయన కృతజ్జతలు తెలిపారు. ముఖ్యంగా తానా అధ్యక్షులు జయశేఖర్, తాజా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, గంగాధర్ నాదెళ్ల, జయరాం కోమటిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఝతలు తెలిపారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనుక జిల్లాల్లో ఎక్కువగా తానా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే, అమెరికాలో తెలుగు వ్యాప్తికి, తెలుగు వారిని ఓ గొడుగు కిందకు తెచ్చి స్నేహతత్వాన్ని పెంపొందించడానికి కృషిచేస్తామన్నారు.
తానాకు నిరంజన్, నిరంజన్ కు తానా కొత్త కాదు, ఆయన 2005 నుంచి తానాలో క్రియాశీలక కార్యకర్త. ఆయన వరుసగా పలు పదవుల్లో పనిచేశారు. ఆ వివరాలు.
* 2009-11 = తానా ఫండ్ రైజింగ్ కమిటీ చైర్మన్, తానా పైనాన్స్ కమిటీ చైర్మన్
* 2013-15 = తానా ఫౌండేషన్ ట్రస్టీ.
* 2015 = డెట్రాయిట్ తానా మహాసభకు ట్రెజరీ.
* 2015-17 = తానా ఫౌండేషన్ ట్రెజరీ.
* 2017-19 = తానా ఫౌండేషన్ చైర్మన్