పోర్న్ పై ఇండియన్ మహిళల వ్యూ మారుతోందా?!

తరచుగా పోర్న్ చూసే వాళ్లలో దైవభక్తి పెరుగుతుందట.. ఇటీవల ఒక అధ్యయనం ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. మరి వీళ్ల లెక్కలేమిటో.. భారత్ వరకూ ఆ రెండూ పరస్పర విరుద్ధమైన అంశాలు. అయితే ఆ రెండింటికీ…

తరచుగా పోర్న్ చూసే వాళ్లలో దైవభక్తి పెరుగుతుందట.. ఇటీవల ఒక అధ్యయనం ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. మరి వీళ్ల లెక్కలేమిటో.. భారత్ వరకూ ఆ రెండూ పరస్పర విరుద్ధమైన అంశాలు. అయితే ఆ రెండింటికీ మానసికమైన సంబంధం ఉందని ఒక విదేశీ అధ్యయనకర్తల బృందం చెబుతోంది.  మరి ఆ సంగతలా ఉంటే.. ఒకవైపు ఇండియన్ ఇంటర్నెట్ స్పేస్ లో చెలరేగిపోతున్న పోర్న్ ను కట్టడి చేయాలని సుప్రీం కోర్టు స్థాయిలో కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదే సమయంలో భారత సమాజం పోర్న్ విషయంలో తన దృక్పథం మార్చుకుంటోందేమో అనే అభిప్రాయాలూ కలుగుతున్నాయి. ఎక్కడి వరకూ వచ్చేశారంటే.. పోర్న్ ను నిషేధించేస్తే, అటు అమ్మాయిలతో సాన్నిహిత్యమూ లేక ఇటూ పోర్నూ లేక మేమేం అయిపోవాలి.. అని అబ్బాయిలు అందోళన చెందడంపై లైటర్ వెయిన్ లో సినిమాల్లో కామెడీ సీన్లే రాసుకుంటున్నారు! కుటుంబ కథా చిత్రం ‘ప్రేమమ్’ క్లైమాక్స్ ఈ తరహా సరదా సంభాషణం ఒకటి ఉంటుంది.

పోర్న్ చూడను కానీ.. స్కాండల్స్ ను చూస్తా.. అని ఓపెన్ గా తన అభిప్రాయాన్ని పంచుకొంటాడొక మధ్య వయసు భారతీయుడు. ఒక ర్యాండమ్ సర్వేలో మనోళ్ల అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పోర్న్ లో కృత్రిమత్వం ఉండవచ్చు.. సెక్స్ స్కాండల్స్ లో మాత్రం సహజత్వం ఉంటుంది.. అనేది ఈ మానవుడి ఆశ! అయితే తన పిల్లలు మాత్రం పోర్న్ చూడకూడదని ఈయన కోరుకుంటాడు. అదేమంటే.. పోర్న్ వీడియోల్లో శృంగారం అబద్ధం, పెళ్లి కాని పిల్లలు ఆ వీడియోలు చూసి.. అదంతా నిజం అనుకుంటారు, రేపు పెళ్లి అయ్యాకా.. పోర్న్ పిక్చర్ లలో చూసింది జరగకపోతే అది వాళ్లపై మానసికంగా ప్రభావం చూపవచ్చు అనేది ఆ వ్యక్తి అభిప్రాయం. ఒక వయసు వచ్చాకా.. సరదాగా పోర్న్ చూస్తే తప్పు లేదు, కానీ దాన్ని చూసి అభిప్రాయాలను ఏర్పరుచుకోవడం మాత్రం జీవితాన్ని  విచ్ఛిన్నం చేస్తుందని ఆయన హెచ్చరించాడు కూడా!

ఇక మహిళల విషయానికి వస్తే.. నేటి నవీన నాగరికతలో, మెట్రో జీవితాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటే మాత్రం, పోర్న్ వీళ్లకు చాలా చిన్న విషయం! వైఫ్ స్వైపింగ్ వరకూ వెళ్లిన హైక్లాస్ జీవితాల్లో పోర్న్ చూస్తారా.. చూడరా.. అనేదొక సిల్లీ కొశ్చన్. ఆ స్థాయి కన్నా కొంచెం దిగువకు వచ్చి పరిశీలిస్తే, కార్పొరేట్ ప్రపంచంలో బాస్ లుగా చలామణి అవుతున్న మహిళామణుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావిస్తే.. పోర్న్ ను ఖరీదైన సీడీల్లో కొనుగోలు చేసి  చూశామని వీరిలో కొందరు చెప్పారు. దీన్ని వాళ్లు పూర్తిగా బెడ్ రూమ్ ఎఫైర్ అంటున్నారు. భర్తతో కలిసి లేదా.. పూర్తి ఒంటరిగా చూశామని  వీరు చెప్పారు.

మిడిల్ క్లాస్ లెవల్ కు వచ్చి చూసినా.. ఉద్యోగాల్లో ఉన్న వివాహితల అభిప్రాయాన్ని తీసుకుని చూసినా.. ఏ యూట్యూబ్ లో కంటబడిన వీడియోనో, లేదా మరో రకంగానో లైటర్ వెయిన్ శృంగార వీడియోలను చూశాం, అప్పుడప్పుడు చూస్తాం అనే వారి శాతం చాలానే ఉంది.