ఆప్త సభ్యులు శ్రీకాంత్ కాట్రగడ్డ గారుఅమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ తరుపున మరియు వారి తాత గారు స్వర్గీయ కాజ సాంబశివరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యములో (పదవ వర్ధంతి సందర్భముగా) సంయుక్తముగా ఈరోజు గురువారం కుంచనపల్లి గ్రామము, తాడేపల్లి మండలములో నిర్వహించిన ఆప్త మెగా ఉచిత మెడికల్ క్యాంపుకి వెయ్యి మందికి పైగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు విచ్చేసి, మన డాక్టర్స్ సేవలను వినియోగించుకున్నారు. ఈ మెడికల్ క్యాంపుకి ముఖ్య అతిధులుగా శ్రీ పి. మధుగారు (సిపిఎం రాష్ట్ర కార్యదర్శి), మాజీ మంత్రివర్యులు శ్రీమతి శనక్కాయల అరుణ గారు, అడిషనల్ డీజీపీ పి.వి. సునీల్ గారు IPS సభకు విచ్చేసారు.
ఈ మెడికల్ క్యాంపు లో మన ఆప్త సేవ కార్యక్రమాలు: ASEP, AMAP, AWEP, రక్తదాన క్యాంపులు & మెగాస్టార్ చిరంజీవి గారి మెసేజ్ మన ఆప్త గురించి రెండు LED స్క్రీన్స్ మీద చక్కగా ప్రెజెంట్ చెయ్యటం జరిగినది. మెడికల్ క్యాంపు కి వచ్చిన ప్రజానీకం ఆప్త సేవలను వేనోళ్ళ కొనియాడారు. ఈ మెడికల్ క్యాంపు దిగ్విజయముగా జరగటానికి తోడ్పడిన డాక్టర్స్, మెయిన్ స్పాన్సర్ శ్రీకాంత్ కాట్రగడ్డ గారు, లోకల్ వాలంటీర్స్ కి, కుంచనపల్లి గ్రామ వాసులందరికి ఆప్త కార్యవర్గ సభ్యులందరు పేరు పేరున ధన్యవాదములు తెలియ చేసారు.
డాక్టర్ శనక్కాయల భాను ఉదయశంకర్ గారు, డాక్టర్ శనక్కాయల రాధా మాధవిగారు, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారు, డాక్టర్ బిందేశ్ దాదిగారు, డాక్టర్ లంకా దుర్గ కళ్యాణ్ గారు, డాక్టర్ చప్పిడి అరుణ్ కుమార్ గారు, డాక్టర్ నరాలశెట్టి అనిల్ కుమార్ గారు, డాక్టర్ తోట నవీన్ కుమార్ గారు, డాక్టర్ పృథ్విరాజ్ కాట్రగడ్డ గారు, డాక్టర్ పోతుల పవన్ సాయిగారు, డాక్టర్ చాగంటి సింధుగారు, డాక్టర్స్ అఫ్ ఫార్మసీ డిపార్ట్మెంట్ నుండి డాక్టర్ చిద్రుపి గారు, డాక్టర్ నందిని గారు, మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్ అమూల్య గోవాడ గారు, డాక్టర్ గిరీష్ గారు, డాక్టర్ రేష్మ గారు మరియు కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మి ప్రసన్న గారు ఈ మెడికల్ క్యాంపు లో పాల్గొని ఆరోగ్య సమస్యలపై ల్యాబ్ టెస్ట్ లు మరియు ఉచితముగా మందులు ఇవ్వడము జరిగినది.
డాక్టర్స్ అందరూ గత కొన్ని వారాలుగా ఈ మెడికల్ క్యాంపు ప్లానింగ్ మీద వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సోదరుడు శ్రీకాంత్ కాట్రగడ్డ గారు అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజము చేసారు. డాక్టర్ సూర్య రగుతుగారు మెడిసిన్ స్పాన్సర్ చేసారు మరియు లక్ష్మి చిమట గారు షుగర్ కిట్స్ ని స్పాన్సర్ చేసారు.
ఈ కార్యక్రమానికి మన ఆప్త లీడర్షిప్ నుండి పని చేసిన డాక్టర్ నీరజ చవాకుల గారికి, లక్ష్మి చిమట గారికి, శివ మొలబంటి గారికి, శ్రీకాంత్ మన్నెం గారికి, బనారసీ తిప్పా గారికి, ఇన్నయ్య యనుమల గారికి, అమాప్ చైర్ డాక్టర్ సురేష్ అలహరి గారు, ఈశ్వర్ అరిగే గారు, నాగకుమారి అరిగే గారు, త్రినాధ్ ముద్రగడగారు, గోపాల గూడపాటి గారు, విజయ్ గుడిశేవ గారు, వెంకట్ చలమలశెట్టి గారు మరియు ఆప్త కార్యవర్గ సభ్యులందరికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నటరాజు యిల్లూరి గారు మరియు బోర్డు చైర్ కిరణ్ పల్లా గారు పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసారు.