సహజం గా ఇంట్రవర్ట్స్ మరియు ఎక్సట్రోవర్ట్స్ అనే కోవలోకి చాలా మంది వస్తుంటారు. అందులో కూడా విభిన్న రకాలుగా ఉంటారు.
ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు నాయకుల గుణాలకు చెందిన మూలాలకు సంబంధించిన ఒక విశ్లేషణ ..దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు శ్రీ చంద్ర బాబు నాయుడు గారు గురించి. స్థూలంగా మాట్లాడుకుంటే వైయస్సార్ ఎక్సట్రోవర్ట్స్ లక్షణాలు ఉన్న నాయకుడు గాను చంద్రబాబు ఇంట్రవర్ట్స్ లక్షణాలు ఉన్న నాయకుడుగాను అనుకోవచ్చు.
మాట మీద నిలబడడం గురించి :
చాలా వరకు ఇంట్రవర్ట్స్ బుర్ర ని ఎక్కువగా.. మనస్సుని తక్కువ గా ఊయోగిస్తూ ఉంటారు. వారికి దేన్నయినా బుర్రతో చూసే లక్షణం ఎక్కువ. బుర్ర తో చేసే ఆలోచన కి ఒక లాజిక్ ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ మనస్సుతో చేసే ఆలోచన చాలా సార్లు లాజిక్ లేకుండా అన్పిస్తుంది.
రాజకీయాలలో మాట తప్పడం గురించి వింటూ ఉంటాం.చంద్రబాబు యూ టర్న్ కి బ్రాండ్ అంబాసిడర్ అనేది చాలా ప్రముఖం. ఒక వ్యక్తికి మాట ఇచ్చిన తర్వాత కాలం లో దాని తాలుక ఈక్వేషన్స్ చాలా మారతాయి. రాజకీయాలలో ఐతే ఇది మరీ ఎక్కువ. చంద్రబాబు మారిన ఈక్వేషన్స్ ప్రకారం తన మాట ని కూడా మార్చి లెక్కలు వేసి ఇంతకు ముందు చెప్పిన మాట మర్చిపోయే రకం.
రాయలసీమ ప్రాంత ప్రజలు సహజం గా కుటుంబ సంబంధ, వ్యాపార సంబంధ విషయాల్లోనే ఇచ్చిన మాట గురించి చాలా పట్టించుకుంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది ఒక మనసుకు సంబంధించిన విషయం అన్నది చంద్రబాబుకి ఎప్పటికి అర్థం కాదు. అందుకే ఇచ్చిన మాట కంటే అప్పటి పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలి అనే ఫక్తు రాజకీయ గుణం వల్ల ఆయన మాట మార్చే వ్యక్తి అని ప్రసిద్ధి. దీని మూలంగానే ఆయన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాయలసీమలోని జనాలు నమ్మలేని స్థితికి వచ్చింది.
ఇంకో వైపు ఎక్సట్రోవర్ట్స్..మైండ్ కంటే హార్ట్ ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. వారికి లాజిక్ కంటే ఎమోషన్ ఎక్కువ ఇంపార్టెంట్. వైఎస్ కి రాయలసీమ సామాన్య ప్రజానీకానికున్న గుణం అయినా మాట మీద నిలబడ్డం అన్నది చాలా సహజ సిద్ధంగా అబ్బింది అనొచ్చు. ఆయన ఒక మాట ఇస్తే తర్వాతి కాలంలో దాని తాలుకు లెక్కలు ఎంతగా మారినా అప్పుడు చెప్పాము కదా చేయాలి అని మనసు నుంచీ వచ్చే ఒక మొండితనం. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఆయన నిలబెట్టుకోడానికి మార్గం దొరికేది.
అందుకే అసెంబ్లీలో నీ విశ్వసనీయత మీద నీ /నా విశ్వసనీయత మీద రిఫరెండం పెడదాం అని వైఎస్సార్ అంత ధైర్యంగా సవాల్ విసరగలిగారు. నిజంగా ఈ విషయం మీద రిఫరెండం అన్నది జరిగి ఉంటే ఆనాటి ప్రతిపక్ష సభ్యులు కూడా వైఎస్సార్ కి అనుకూలం గా ఓటు వేసేవారేమో!!
నిర్ణయాలు తీసుకోవడం ::
ఇనుమును అయినా సాన పెడతారు అని చంద్రబాబు గురించి బిరుదు. ఆయన ఏ నిర్ణయాన్ని తొందరగా తీసుకోకుండా.. సంప్రదింపుల పేరుతో ఇండెసిసీవ్ గా ఉంటారు. దీన్ని ఇంట్రవర్ట్స్ యాంగిల్ లో చూసినట్టు ఐతే.. కేవలం బుర్ర ని మాత్రమే ఉపయోగిస్తే ఒక నిర్ణయం లో ఉన్న మంచితో పాటు నష్టాలు కూడా తెలిసి వస్తాయి. ఐతే లాజిక్ గల బుర్ర ఆ నష్టాల గురించి ఆలోచిస్తూ ఏ డెసిషన్ ని త్వరగా తీస్కోనీయదు. కర్ర విరగక పాము చావాలి తరహా లో స్కెచెస్ వేయడం అన్నమాట. పర్ఫెక్షన్ సాధించాలి అనే తహ తహ.
ఈ ఆలోచన విధానమే చంద్రబాబు ని తెలంగాణ ఇష్యూ మీద ఒక స్టాండ్ తీస్కోనీయక.. రెండు కళ్ళ సిద్ధంతం పేరిట… గోడ మీద పిల్లి వేషాలు వేయించింది. అదే ఎక్సట్రోవర్ట్స్ చాలా వరకు గట్ ఫీలింగ్ తొ డెసిషన్స్ తీస్కుంటూ ఉంటారు.
ఎందుకంటే వారికి ఒక డెసిషన్ లో లాస్సెస్ కంటే అనుకున్న డెసిషన్ ని ఇంప్లీమెంట్ చేయాలి అన్న మొండితనం ఎక్కువ. మైండ్ కంటే హార్ట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. వైఎస్సార్ ఈ కోవలోకి వస్తారు. వైఎస్సార్ ని తీసుకుంటే ఒక డెసిషన్ తాలుక ప్రోస్ అండ్ కన్స్ ఎనాలిసిస్ చేసి అందులో ఉన్న మంచి కోసం గట్ ఫీలింగ్ తో ముందుకు వెళ్లేవారు.మంచి అయినా చెడు అయినా శతాబ్ది ఎక్సప్రెస్ లాగ దూసుకెళ్లడమే.
చంద్రబాబు గారి ఇండెసిషవ్ నేచర్ ఆయన గారి గవర్నమంట్ ఆఫీసర్స్ వీడియో కాన్ఫరెన్స్ చెప్తాయి. అలాగే పార్టీ పదవుల గురించి కూడా ఎపుడు మీనా మేషలు లెక్కించడమే.డెసిషన్ వలన ఏదైనా నష్టం జరుగుతుంది అని అన్పిస్తే తనకున్న మీడియా ద్వారా జనాలకు ఫీలర్స్ వదిలి సర్వే చేసి న్యాక్ గా మడమ తిప్పేసేవాడు. ఆయన కింద ఉన్న క్యాడర్ కి ఇది పెద్ద తల నొప్పి. ఎపుడు ప్లేట్ ఎలా ఫిరాయిస్తాడో తెలీక కవరింగ్ కి రెడీ గా ఉండాల్సిన పరిస్థితి.
వైఎస్సార్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా అసంతృప్తి వచ్చినా మార్చే ప్రసక్తి ఉండేది కాదు. కింద క్యాడర్ కూడా ఒన్స్ డెసిషన్ వచ్చాక ఇక మైండ్ ట్యూన్ చేస్కోవడం ఈజీ అయ్యేది. జస్ట్ హైపోతిటికల్ గా..వైఎస్సార్ బ్రతికి ఉండి, ఒకవేళ హై కమాండ్ తెలంగాణ ఫార్మషన్ డెసిషన్ తీస్కుని ఉంటే ఖచ్చితంగా సమైక్య నినాదం తీస్కునే వారేమో. ఇర్రెస్పెక్టివ్ అఫ్ స్ట్రగుల్స్ ఇన్ తెలంగాణ. నిదానంగా రెండు ప్రాంత జనాలు కూడా ఒప్పుకునేవారేమో!!
ప్రజాకార్షణ :
సహజంగా మనిషి సంఘజీవి అంటారు. ఎవరైతే మనుషులతో నిజమైన ఆప్యాయతతో మాట్లాడతారో దాని తాలుక ప్రభావం అవతలి వ్యక్తి మీద ప్రభావం చూపుతుంది.
“హౌ టూ విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లున్స్ పీపుల్ ” అనే ఎవెరగ్రీన్ బుక్ దీన్ని ఉటంకిస్తుంది. కాకపోతే ఇంట్రవర్ట్స్ కి ఉన్న రిజర్వుడ్ నేచర్ మనుషులని ఒక హ్యూమన్ రిసోర్సస్ లా చూసేలా చేస్తుంది తప్ప జస్ట్ హ్యూమన్ లా చూడనీయదు. మనుషులతో పని ఉంటే మాట్లాడ్డం అది అయ్యాక వదిలేయడం. మనుషులని క్యారీ చేయడం బర్డెన్ లా అన్పిస్తుంది. పని అయ్యాక ఐతే అసలు పట్టించుకోబుద్ది కాదు.ఇక్కడ కూడా మైండ్ హార్ట్ ని డామినేట్ చేస్తుంది. ఇవన్నీ వింటే వాడుకుని వదిలేసే రకం అనే టాగ్ సొంతం చేసుకున్న చంద్రబాబు గుర్తుకు వస్తారు.
1994 నుంచీ 2004 వరకు దాదాపు 9 సంవత్సరాలు సీఎం గా చేసి మరల 2014 నుంచీ 2019 నుంచీ 5 సంవత్సరాలు… వెరసి 14 సంవత్సరాలు సీఎం గా చేసిన చంద్రబాబు తెలుగు ప్రజల మైండ్ లో స్థానం సంపాదించారు కానీ మనసులలో సంపాదించలేక పోయారు అన్నది ఎంత కాదనుకున్నా నిజమైన నిజం అనొచ్చు. దీనికి స్థూలంగా చంద్రబాబు స్వాతహాగ ఇంట్రవర్ట్స్ పార్శ్వాలు ఉన్న పర్సనాలిటీ కావడం వల్ల అనొచ్చు(ఇక్కడ ఇంట్రవర్ట్స్ ని జనరల్ గా గా కాటగారైజ్ చేయడం లేదు ). ఆయన 2004 వరకు నవ్వే వారే కాదు. చాలా స్ట్రిక్ట్ గా ఉండడానికి ట్రై చేసేవారు.
పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ పేరిట గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని సతాయిన్చేవారు. సాధారణ ప్రజలు కోసం ఏదైనా తప్పు చేస్తే శిక్ష వేయాలి అనే మైండ్సెట్ తొ ఉండేవారు (బషీర్ బాగ్ ఘటన ఆ కోవలోకి చెందేవి ). మనుషుల మీద ప్రేమ ఉంటే వారు చేసే తప్పులని కూడా క్షమించ వేయాలి బుద్ది అవుతుంది (క్షమార్హం అయినా తప్పులు ). కానీ ఈ ఇంట్రవర్ట్ నేచర్ మనుషులని జస్ట్ రక్త మాంసాలు ఉన్న ఒక వ్యక్తి లా చూస్తుంది. అందులో తన మన అనే తేడా ఉండదు.
ఇలాంటి బిహేవియర్ ఉండడం వల్లే చంద్రబాబు 2004 వరకు తన సహచర మంత్రులతో కూడా ఆప్యాయంగా మాట్లాడేవారు కాదు ఇక సామాన్య ప్రజనీకం గురించి చెప్పకర్లేదు. మా రాయలసీమ ప్రజనీకంతొ ఐతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
రాజకీయంగా కూడా తన కోసం ప్రేమగా బయటికి వచ్చి బాహాటంగా ప్రేమని వ్యక్త పరిచే సొంత పార్టీ నాయకులు కూడా కన్పించరు. తాను ఎలా ఐతే లాభనష్టాల లెక్కలతో మనుషులతో ఉంటారో తనతో ఉన్న వాళ్ళు కూడా అలాగే ఆయనతో పని ఉన్నంత వరకే ఉంటారు. చంద్రబాబు నష్టం లో ఉన్నప్పుడు తనని వదిలి వెళ్ళని నాయకులు ఉండడం అనేది చాలా అరుదు.
నీవు నేర్పిన విద్యయే నీరజక్షా అన్నట్టు ఉంటుంది. ఎవరైనా చంద్రబాబు ని రాజకీయం గా విమర్శించినప్పుడు తన మీద ఉన్న ప్రేమతో వచ్చి తీవ్రస్థాయిలో ప్రతి విమర్శ చేసే నాయకుడు కన్పియడు… ఎన్టీఆర్ భవన్ డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ తొ తప్ప.
ఇప్పటికి చంద్రబాబు రాయలసీమ జిల్లా లోని పర్యటనకు వచ్చినప్పుడు తనతో ఉండే అసలు సిసలైన జనసాంద్రత చూస్తే నవ్వొస్తుంది. పట్టుమని పది మంది కూడా ఉండరు. 40 ఏళ్ళ రాజకీయంలో ఈయన పచ్చిగా సంపాదించిన మనుసులు.. మనుషులు ఎందరు అని. సహజం గా ఒక ఇన్ ఛార్జ్ మంత్రి కి అప్పజెప్పిన జిల్లా లో ఫలితాలు సరిగా రాకపోతే.. అతడి మీద చర్యలు ఉంటాయి. అలాంటిది తన సొంత జిల్లా అని చెప్పే చిత్తూర్ లో ఆయన ఎప్పటికి పట్టు సాధించలేదు అంటే, తనకి స్థానిక నాయకులలో ఉన్న మానవ సంబంధాలు ఏంటి అని అర్థం అవుతుంది.
ఇవన్నీ గమనించే కాబోలు ఆయన “నన్ను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ” “నా చరిత్రను ఎవరు దాటలేరు ” “పోలీస్ లు వస్తే ఒక వలయం లా ఏర్పడి నన్ను మీరు కాపాడుకోవాలి ” లాంటి స్వయం ప్రకాశం లేని మాటలు అంటూ ఉంటారు.
అదే ఎక్సట్రోవర్ట్స్ సహజం గా మనుషులంటే ఇష్టంగా ఉంటారు. మనిషి సంఘజీవి అన్న టాగ్ కి వీళ్ళు సరిపోతారు అలాగే మెజారిటీ జనాలను ప్రభావితం చేయగలుగుతారు. వైస్సార్ ఈ కోవకే చెందిన వారు. ఆయనకు మనుషులు అంటే ఆప్యాయత. ఆ ఆప్యాయతే ఆయనను పార్టీ జనాలతో మరియు సామాన్య ప్రజనీకంతో ఎనలేని బంధాన్ని ఏర్పరిచింది.
ఆయన ఎవరితో మాట్లాడినా వారి హోదా పోసిషన్ తో సంబంధం లేకుండా, వాళ్ళతో భవిష్యత్ లో ఎలాంటి పనులు ఉంటాయి లాంటి లెక్కలు వేసే మైండ్ తో కాకుండా,ఒక మనిషిలా నే మాట్లాడేవారు. అది పార్టీ ఆఫీస్ లో ని క్లర్క్ అయినా తన సహచర నాయకులతో అయినా. అందుకే ఆయన కోసం అభిమానంతో పడి చచ్చేవాళ్ళు ఎక్కువ. ఆయన్ను ఒక మాట అన్నా పడనీయక అగ్రసివ్ గా విమర్శిస్తారు. అలాగే ప్రాణ స్నేహితులు ఉంటారు.
వైఎస్సార్ ఒక టర్మ్ లోనే జనాలలో నాయకులలో సంపాదించిన క్రేజ్ తాను కూడా సొంతం చేసుకోవాలి అని చంద్రబాబు 2014 లో అధికారం వచ్చాక ట్రై చేసాడు. కాకపోతే అది కూడా మైండ్ అప్లై చేసి ట్రై చేసాడు. తనకు లెఫ్టినెంట్స్ లా ప్రాణం ఇచ్చేలా ఉండే నాయకులు ఉండాలి అనుకున్నాడో ఏమో.. అవినీతి చేస్తున్నారు అని తెలిసిన కూడా సహచరులను ఏమి అనేవాడు కాదు.
పులి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఊహించింది ఒకటైతే జరిగింది ఇంకోటి అన్నట్టు, స్కెచ్ లు వేసి మానవ సంబంధాలు ఏర్పరుచుకోలేరు అనే విషయం ఆయనకీ అర్థము అవుతుందో లేదో తెలీదు. చివరకు ఎక్కడా చెల్లని బుద్ధ వెంకన్న లాంటి వారు మాత్రమే తనకి మిగిలారు.
వైఎస్సార్ సొంత జిల్లా కడప చంద్రబాబు లా కాకుండా వైస్సార్ అంటే కడప… కడప అంటే వైస్సార్ అనేలా అయింది. అంతేనా ఆ ప్రకాశం రాయలసీమ మొత్తం కూడా పాకి తిరుగు లేని కంచుకోటాల జగన్ కి అయింది.
ఇవన్నీ వారి వారి జీవితాల్లోని కొన్ని లక్షణాలను ఇంట్రవర్ట్స్ /ఎక్సట్రోవర్ట్స్ అనే మిర్రర్ లో చూసే ప్రయత్నం మాత్రమే.
ఇట్లు సంజయ్.