హీరో శివాజీ నా కష్టం దోచుకుంటున్నారు -రేవన్ యాదా

Click here for video Advertisement బూచెమ్మ-బూచోడు సినిమా విడుదలై వారం కాలేదు. ఏ మేరకు విజయవంతమైందన్న సంగతి పక్కన పెడితే, ఆ విజయానికి కారణం నేనంటే నేను అనే రీతిలో ప్రచారం సాగుతోంది.…

Click here for video

బూచెమ్మ-బూచోడు సినిమా విడుదలై వారం కాలేదు. ఏ మేరకు విజయవంతమైందన్న సంగతి పక్కన పెడితే, ఆ విజయానికి కారణం నేనంటే నేను అనే రీతిలో ప్రచారం సాగుతోంది. సినిమా విడుదలైన దగ్గర నుంచి హీరో శివాజీ వివిధ చానెళ్లలో కూర్చుని మాట్లాడుతున్నారు. దాదాపు సినిమా అంతా తనదే, తన కష్టమే అనే అర్థం వచ్చేటట్లు మాట్లాడుతున్నారని, డైరక్టర్ రేవన్ యాద ఆవేదన చెందుతున్నారు. సినిమా విడుదలకు ముందు ఎక్కడా ఏమీ మాట్లాడని శివాజీ, ఏళ్ల తరబడి విజయానికి మొహం వాచిన శివాజీ, ఇప్పుడు తనదే ఘనత అని మాట్లాడుతున్నారని, తన కష్టం దోచుకుంటున్నారని బాధ పడ్డారు. ఆయన 'గ్రేట్ ఆంధ్ర'కు ఫోన్ చేసి తన గోడు వెళ్ల బోసుకున్నారు. ఆయన అభిప్రాయం అంతా రికార్డు చేయడం జరిగింది. దాని సారాంశం ఇది.

'నేను రేవన్ యాదా..నా మనసులో బాధ చెప్పుకోవాలనుకుంటున్నా, ఇది కొంచెం నెగిటివ్ గానే వుంటుంది..మీరు ఏమీ అనుకోవద్దు. గుణశేఖర్ గారి దగ్గర పదేళ్లు పనిచేసా. ఈ కథ లైన్ తయారుచేసుకున్నా. నా మిత్రులు ఇద్దరితో కలిసి దాన్ని డెవలప్ చేసాను. శివాజీగారు హీరో అనుకున్నాం. కథ వినిపించాం. ఆయన తాను నిర్మాతను చూస్తానన్నారు. అలా ప్రాజెక్టు ప్రారంభమైంది. టీవీ 9 వారి స్నేహితులు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసారు. సుమారు 18నెలలు కష్టపడ్డాను. మధ్యలో శివాజీ గారు మూడు నెలలు అమెరికా వెళ్లారు. ఓపిగ్గా వెయిట్ చేసాం. మొత్తానికి నా కష్టానికి తగిన ఫలితం దక్కింది.ప్రేక్షకులు ఆదరిస్తున్నారనుకుంటే, ఇప్పుడు మొత్తం క్రెడిట్ అంతా హీరో శివాజీగారు తీసేసుకుంటున్నారు. చానెళ్లలో కూర్చుని, తానే అంతా చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇది నాకు చాలా బాధగా వుంది. మా గురువు గుణశేఖర్ కూడా ఫోన్ చేసి తిట్టారు. 'ఏరా..శివాజీ సినిమా చేస్తే, నువు పేరు వేసుకున్నావా' అని అన్నారు. నాకు చాలా బాధేసింది. నేను కూడా ప్రమోషన్లకు వస్తాను అని అడిగాను. కానీ ఆయన పెద్దగా స్పందించలేదు. ఈ విషయం నిర్మాతలకు కూడా తెలిపాను వారు శివాజీకి చెబుతామన్నారు. శివాజీ ముందు రేపు వద్దువుగానిలే అన్నారు. కానీ ఇప్పుడు, నాకు తెలియదు, నీకు కావాలంటే నిర్మాతలతో మాట్లాడుకో అంటున్నారు.

అసలు సినిమా బడ్జెట్ లో కూడా తేడా జరిగింది. కోటికి పైగా బడ్జెట్ అన్నారు. ఓ లైట్లు లేవు. నేను అన్ని రోజులు నా బైక్ పై వెళ్లాను. మేకప్ మాన్ కూడా పెట్టలేదు. శివాజీ గారి పర్సనల్ మేకప్ మెన్ నే అందరికీ వాడారు. ఆయన మాత్రం ఆయన కారువేసుకు వచ్చారు. నేను నటీనటులందరితో వున్న పరిచయాలు ఉపయోగించి, చాలా తక్కువ రెమ్యూనిరేషన్ కు ఒప్పించాను. డైరక్షన్ నేను చేసానో, శివాజీ చేసారో నటించిన వారిని అడిగితే చెబుతారు. మొత్తం మీద 36 నుంచి 40 లక్షల్లో సినిమా చేసిచ్చాను. 

ఇంత కష్టపడితే, ఇప్పుడు ఆ కష్టం అంతా శివాజీ తన్నుకుపోతున్నారు..ఇదీ నాబాధ,. ఇదే మీడియా ముందు కూడా చెప్పబోతున్నాను. సినిమా విజయం అంతా నాదే అని చెప్పబోవడంలేదు. కానీ నేను సినిమాకు మూలం అన్నది నా భావన. పైగా ఇదే సినిమా విజవవంతం కాకపోతే, నన్నే తిట్టే వారు కదా..ఇప్పుడు కూడా కొన్ని సమీక్షల్లో నాపైనే రాసారు. అందువల్ల కొత్తవాడిని నా శ్రమ దోచుకుని, నాకు అవకాశాలు రాకుండా చేయద్దు అనేదే నా విన్నపం

Click here for video

ఇదీ రేవన్ యాదా..ఫోన్ సంభాషణ సారాం​శం. పూర్తి పాఠం రికార్డు రూపంలో మాదగ్గర వుంది.

చాణక్య

[email protected]