కెసిఆర్ అదృష్ట జాతకుడు

ఎన్ని చెప్పండి కేసిఆర్ అంత అదృష్ట జాతకుడు మరొకరు లేరు. గడచిన అయిదారేళ్ల కాలంగా సాగిన తెలంగాణ ఉద్యమాన్ని రివైండ్ చేసి చూడండి. ఎప్పటికప్పుడు పడిపోయాడు అనుకున్న టైమ్ లో ఏదో ఒకటి జరిగి…

ఎన్ని చెప్పండి కేసిఆర్ అంత అదృష్ట జాతకుడు మరొకరు లేరు. గడచిన అయిదారేళ్ల కాలంగా సాగిన తెలంగాణ ఉద్యమాన్ని రివైండ్ చేసి చూడండి. ఎప్పటికప్పుడు పడిపోయాడు అనుకున్న టైమ్ లో ఏదో ఒకటి జరిగి కెసిఆర్ టక్కున లేచి కూర్చున్న సంఘటనలు అనేకం కనిపిస్తాయి.పైగా ఇవన్నీ ఉద్యమ మలుపులే. కాంగ్రెస్ నేతలు చేసిన తప్పిదాలు కావచ్చు, సీమాంధ్ర నేతల చాతకానితనం కావచ్చు, కెసిఆర్ రాజకీయ జీవితానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక సంఘటన జరిగి, ఊపిరి పోస్తూ వస్తోంది. 

ఇప్పుడు తాజాగా కోర్టు ఆదేశం కూడా ఇదే విధంగా మారుతుందనిపిస్తోంది. ఎందుకంటే, విభజన జరిగి ఎన్నికలు వచ్చాక, ప్రచారం ముదురుతున్నకొద్దీ కెసిఆర్ భయం పెరుగుతూ వస్తోంది. ఇటు భాజపా-తేదేపా కూటమి, అటు కాంగ్రెస్ చెరోవైపు కాస్త గట్టి దాడే చేస్తున్నాయి. ముక్కోణపు పోటీలో టీఆర్ఎస్ కాస్త దెబ్బతినే అవకాశాలు కాస్త స్పష్టమవుతున్నాయి.సెటిలర్లు ఎక్కువగా వున్న హైదరాబాద్, రంగారెడ్టి, ఖమ్మం, వరంగల్, నిజమాబాద్ ప్రాంతాల్లో, అటు ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోంటొందన్నది ఖాయం. మరోపక్క పవన్ కళ్యాణ్ రూపంలో ఇంకో సమస్య. 

ఇలా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుంటే, ఇప్పుడు కెసిఆర్ పై సిబిఐ విచారణ జరపాలని కోర్టు ఆదేశం. నిజానికి ఎవరో పిటిషన్ వేసారు. కోర్టు ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ కు ఏ మాత్రం సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ వ్యవహారం తెలిసిన సామాన్యజనం ఏమనుకుంటారు. అదిగో పొత్తు పెట్టుకొలేదని కెసిఆర్ పై కేసుల పెడుతున్నారు అనుకుంటారు. టీఆర్ఎస్ కూడా అదే విధంగా ప్రచారం ప్రారంభించేసింది. నిజానికి బుర్ర వున్నవాడు ఎవరైనా కోర్టు ఆదేశిస్తే, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని అడగొచ్చు. కానీ అలా అడిగేవారి సంఖ్య తక్కువ. 

ఏదైతేనేం తమ కోసం ఉద్యమించి, తెలంగాణ సాధించిన కెసిఆర్ పై దర్యాప్తు, కేసులు అంటే తెలుంగాణ జనం కాస్త తల్లడిల్లడం, లేదా ఆగ్రహించడం ఖాయం. అలా జరగకున్నా టీఆర్ఎస్ ఆ దిశగా ప్రచారం సాగించడం ఖాయం. దీంతో  కాస్తయినా అనుకూల ఓటింగ్ జరిగే అవకాశం వుంది,. కెసిఆర్ ఎంతయినా అదృష్టవంతుడు.

చాణక్య

[email protected]