కేకేకి ఢోకా లేదు.. దళపతి చేయగలిగిందేం లేదు!

భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఎంచక్కా తన పదవికి రాజీనామా చేసేశారు. ఇప్పుడు ఆ ఖాళీకి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కాంగ్రెసు పార్టీ మళ్లీ కేకేనే…

భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఎంచక్కా తన పదవికి రాజీనామా చేసేశారు. ఇప్పుడు ఆ ఖాళీకి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కాంగ్రెసు పార్టీ మళ్లీ కేకేనే తమ అభ్యర్థిగా ప్రకటించడం దాదాపుగా గ్యారంటీ. ఆయన పదవిని పదిలంగా నిలబెట్టుకుంటారు. కాకపోతే మెడచుట్టూ ఉండే కండువా రంగులు మారుతాయి. కాకపోతే ఇక్కడ.. గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం తప్ప చేయగలిగింది ఏమీ లేకుండాపోయింది.

రాజ్యసభలో కొత్తగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9 రాష్ట్రాలనుంచి 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో పదిమంది లోక్ సభకు ఇటీవల ఎన్నిక కావడం వల్ల వచ్చిన ఎన్నికలు. అలాగే ఒడిశా, తెలంగాణల్లో ఒక్కొక్కరు రాజీనామాలు చేయడం వల్ల మరో రెండుస్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది.

తెలంగాణలో ఎంతో సీనియర్ నాయకుడు కే కేశవరావు తన పదవికి రాజీనామా చేశారు. భారత రాష్ట్ర సమితి తరఫున ఎంపీగా ఉన్న కేకే తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెసు పార్టీలోనే ఎంతో సీనియర్ అయిన ఆయనను కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. పార్టీలో పెత్తనం లేకపోయినా ఆయనను గౌరవంగానే చూసుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతను చేశారు.

కేసీఆర్ ఏ విస్తృతస్థాయి సమావేశం పెట్టినా.. పక్కనే కేకేను కూర్చుండబెట్టుకునే వారు. కానీ.. ఇటీవలి పరిణామాల్లో భారాస ప్రాభవం కొడిగట్టిపోయిందని గ్రహించిన కేకే, తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తద్వారా తన కూతురు రాజకీయ భవిష్యత్తుకు సుస్థిర పునాది వేయాలని ఆయన అనుకున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. కాంగ్రెసులో చేరగానే.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జరగబోతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఆయన పేరునే తిరిగి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.

ఈ ప్రకారం చూసినప్పుడు.. కేశవరావు కోల్పోతున్నది ఏమీ లేదు. కొన్ని రోజుల వ్యవధి ఎంపీ అనేది హోదా లేదు తప్ప.. ఆయనకు ఏం నష్టం లేదు. తెలంగాణ అసెంబ్లీలో హవా కాంగ్రెస్ దే గనుక.. ఆయన మళ్లీ ఎన్నిక కావడం గ్యారంటీ. కాకపోతే.. ఎంత ప్రాధాన్యం ఇచ్చినా కేకే వెళ్లిపోవడం పట్ల క్రుద్ధుడైన కేసీఆర్ ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేకుండా పోయింది.

రాజ్యసభ కు తిరిగి ఎన్నిక కావడం గ్యారంటీ గనుక.. కేకే రాజీనామా చేశారు గానీ.. అదే సాంప్రదాయాన్ని విలువలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో పాటించడం లేదన్నది గమనించాల్సిన సంగతి.

2 Replies to “కేకేకి ఢోకా లేదు.. దళపతి చేయగలిగిందేం లేదు!”

Comments are closed.