ప్రలోభాలకంటె ‘పవర్’ చేసే పని ఎక్కువ!

చిన్న స్థాయి స్థానిక సంస్థల ప్రతినిధులకు ‘అధికారంలో ఉన్న పార్టీ’ అనే ఒక్క మాట సరిపోతుందని అంటున్నారు.

ఎక్కడైనా అధికార మార్పిడి జరిగిన తర్వాత.. ఓడిపోయిన పార్టీనుంచి గెలిచిన పార్టీలోకి వలసలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. బలం కోల్పోతున్న పార్టీ వారు.. ‘తమ నాయకుల్ని ప్రలోభ పెడుతున్నారని, భయపెడుతున్నారని, బెదిరించి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని’ రకరకాలుగా ఆరోపిస్తూ ఉంటారు. కానీ స్థానిక సంస్థల ప్రతినిధుల విషయానికి వచ్చినప్పుడు.. ఇలాంటి కారణాల కంటె ‘పవర్’ ఎక్కువగా పనిచేస్తుంది అని ఇప్పుడు అర్థమవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే.. విశాఖపట్నం కార్పొరేషన్ లో జరిగిన స్థాయీ సంఘం ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులు పూర్తిస్థాయి హవా చూపించడమే ఇందుకు నిదర్శనంగా ఉంది.

మామూలుగా అయితే గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ లో వైసీపీ బలం ఎక్కువ. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత.. చాలా మంది కార్పొరేటర్లు కూటమిపార్టీల్లో చేరిపోయారు. ఇంకా పలువురు అధికారికంగా చేరకపోయినప్పటికీ.. కూటమి పార్టీలతో టచ్ లో ఉంటూ, వారికి సన్నిహితంగా మెలగుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో స్థాయీ సంఘం ఎన్నికలు జరిగాయి. పార్టీ వీడుతారనే అనుమానం ఉన్న కార్పొరేటర్లతో మంతనాలు జరిపి, వారితో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి పలువిడతలుగా మంతనాలు జరిపారు. కార్పొరేటర్లతో క్యాంపులు కూడా నిర్వహించారు. ఇన్ని చేసినా సరే.. స్థాయి సంఘం ఎన్నికల్లోని మొత్తం పది స్థానాలను కూటమి గెలుచుకుంది. వైసీపీ హ్యాట్రిక్ విజయాల తర్వాత కూటమి, ఈ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసింది.

అయితే చిన్నస్థాయి ప్రజాప్రతినిధులు.. ఇలా పార్టీ మారడానికి ప్రధానంగా ‘పవర్’ కారణం అవుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని ధిక్కరించి కార్పొరేటర్లుగా, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులుగా వారు చేయగలిగేది ఏమీ ఉండదని, అందువల్ల వారు అనివార్యంగా అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండాలని కోరుకుంటారని అంటున్నారు.

ఎమ్మెల్యే స్థాయి నాయకుల్ని పార్టీ ఫిరాయించేలా చేయడానికి ఇతరత్రా ప్రలోభాలు, బెదిరింపుల అవసరం ఏర్పడుతుందేమో గానీ, చిన్న స్థాయి స్థానిక సంస్థల ప్రతినిధులకు ‘అధికారంలో ఉన్న పార్టీ’ అనే ఒక్క మాట సరిపోతుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా ఫలితం.. బయటకు కనిపించే బలాలకు అనుగుణంగా ఉండకపోవచ్చునని కూడా అంచనాలు సాగుతున్నాయి.

6 Replies to “ప్రలోభాలకంటె ‘పవర్’ చేసే పని ఎక్కువ!”

  1. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓడిపోతామ్ అని డిసైడ్ అయ్యారు అన్నమాట

  2. మా అన్న పదవి పోయాక వుండలేక .. కేసులు ఏసుకుంటున్నాడు ..నాకు హోదా ఇవండీ.. కార్ మార్చండి ..సెక్యూరిటీ పెంచండి అని .. వాళ్ళు ఎంత ..

  3. మరి స్థానిక సంస్థ ల ఎన్నికలప్పుడు..ఈ విశ్లేషణ ఏమైందిరా గ్రేటాంధ్ర? పవర్ చూపించి ..ప్రతిపక్షాల నుండి అభ్యర్థులను నిలవనీకుండా చేసి.. ఏకపక్షం..అయ్యినప్పుడు..ఈ ఎదవ ఏడుపులు .విశ్లేషణలు లేవేం

  4. మొదటిది డబ్బు ఆశ…టారువాతడి ఎవ్వడు ఏమూల ఏ కిరికిరి పెడతాడో అనే భయం…..మారేలా చేస్తాది..

Comments are closed.