పవన్ కల్యాణ్ గురించి అడిగితే ‘చెప్పను బ్రదర్’ అన్నాడు బన్నీ. ఇది కొన్నేళ్ల కిందటి సంగతి. ఇప్పుడు హరీశ్ శంకర్ కూడా ఇదే విషయాన్ని కాస్త సున్నితంగా చెబుతున్నాడు. ప్రతి ఇంటర్వ్యూలో పవన్ గురించి అడుగుతుంటే, మరీ ముఖ్యంగా పవన్ రాజకీయాల గురించి అడుగుతుంటే సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. దీనికి కారణం కూడా చెబుతున్నాడు.
“పవన్ కల్యాణ్ చరిత్రలో గబ్బర్ సింగ్ కు ఓ పేజీ ఉండడం నా అదృష్టం. పవన్ కల్యాణ్ గురించి, గబ్బర్ సింగ్ గురించి, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి నేను మాట్లాడతాను, కానీ ఆయన రాజకీయ ప్రస్థానం గురించి, కూటమి గురించి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మాట్లాడలేను. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా చూస్తారని, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం వల్ల, ఆయనతో చేసిన సినిమాల వల్ల నేను పవన్ కల్యాణ్ ఫొటో పెట్టుకొని మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ చేయకూడదు, అది తప్పు.”
మిస్టర్ బచ్చన్ సినిమాను రవితేజ కోసం, రవితేజతో తన కాంబినేషన్ కోసం చూడాలని అంటున్న హరీశ్.. తన సినిమాను ప్రతి పార్టీ వాళ్లు చూడాలని, తను ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తిని అనే ముద్ర వేయించుకోవడం తనకు ఇష్టంలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పవన్ తో తన ప్రయాణం చాలా ప్రత్యేకమని, మరో సందర్భంలో ఆ చర్చ పెట్టుకుంటే బాగుంటుందని, మిస్టర్ బచ్చన్ తో పవన్ కల్యాణ్ పాలిటిక్స్ ను మిక్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు హరీశ్.
ఈ సందర్భంగా తనలో దాగున్న నటుడిపై కూడా స్పందించాడు హరీశ్. థియేటర్ ఆర్టిస్టును కాబట్టి, ఏదైనా పాత్రకు న్యాయం చేయగలనని అనిపించినప్పుడు కచ్చితంగా నటిస్తానని, కెమెరా ముందుకొస్తానని అంటున్నాడు.
Vc estanu
జనం పట్టించుకోరు