వయనాడ్ బాధితుల కోసం, పునర్నిర్మాణం కోసం టాలీవుడ్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్, రష్మిక లాంటి కొంతమంది ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ప్రభాస్ కూడా చేరాడు.
కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఏకంగా 2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చాడు ప్రభాస్. టాలీవుడ్ నుంచి వయనాడ్ కు అందిన అతిపెద్ద విరాళం ఇదే.
ఛారిటీలో ఎప్పుడూ ముందుంటాడు ప్రభాస్. కాకపోతే తను చేస్తున్న సహాయ కార్యక్రమాల్ని బయటకు చెప్పడానికి ఇష్టపడడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్కూల్ లో చదివే దాదాపు వంద మంది పిల్లలకు ప్రతి ఏటా ఫీజులు కడతాడు ప్రభాస్.
భీమవరం చుట్టుపక్కలు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చాలా ఆలయాలకు ప్రభాస్ లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. ఇలాంటివి కొన్ని మాత్రమే బయటకొస్తుంటాయి. ఇప్పుడు వయనాడ్ కు విరాళం ఇచ్చి తన పెద్దమనసు చాటుకున్నాడు.
ప్రస్తుతం ఈ హీరో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా ప్రారంభించబోతున్నాడు. ఇవి కాకుండా చేతిలో కల్కి 2, సలార్ 2, స్పిరిట్ సినిమాలున్నాయి.
Super
Vc available 9380537747