సినిమాల్లో మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత చేస్తున్న మూడో సినిమా ఆచార్య. ఎప్పుడో ప్రారంభమైనా, ఇంకా సాగుతూనే వుంది ఈ సినిమా ప్రయాణం.
కరోనా రెండో దశ లేకుండా వుండి వుంటే ఈ పాటికి విడుదలకు రెడీ అవుతూ వుండేది. కానీ ఇప్పుడు ఇంకా చాలా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఈ సినిమా ఇంకా ఎడిట్ సూట్ లోకి ఎంటర్ కాలేదన్నది ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. సినిమా వర్క్ ఇంకా చాలానే మిగిలి వుందని, ఇది పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటే తప్ప థియేటర్ లోకి రావడం కష్టం.
ఆచార్య సినిమా దసరాకు విడుదలైపోతే బెటర్ అని ఇండస్ట్రీ వర్గాలు ఫీలవుతున్నాయి. ఎందుకంటే అలా అయితే మహేష్, పవన్ సినిమాలు సంక్రాంతికి ప్లాన్ చేసుకోవచ్చు.
అలా కాకుండా ఆచార్య కనుక సంక్రాంతికి షెడ్యూలు అయితే మాత్రం పలు పెద్ద సినిమాలు ఇరుకున పడతాయి. కానీ ఆచార్య వ్యవహారం చూస్తుంటే అలా ఇరుకున పెట్టేలాగే కనిపిస్తోంది.