‘దేవీశ్రీప్రసాద్’ – వికటించిన ‘షో’..?

ఇప్పుడు దేవీ స్టేజ్ షోలతో బిజీగా వుండి, పుష్ప 2 కు సరైన వర్క్ ఇవ్వడం లేదనో, సరైన టైమ్ ఇవ్వడం లేదో మొత్తానికి బన్నీకి కోపం వచ్చేసింది.

పెద్ద హీరోల దగ్గర అలాగే వుంటుంది. ఓన్లీ క్వాలిటీ మ్యాటర్. మొహమాటాలు, బేరాలు వుండడం లేదు. సరైన వర్క్ ఇవ్వకపోతే తమ కెరీర్ పోతుందనే నిర్ణయానికి వచ్చేసారు. సర్కారు వారి పాట తరువాత మళ్లీ థమన్ ను తీసుకోవడానికి హీరో మహేష్ బాబు చాలా గట్టిగా వ్యతిరేకించారని వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ కనుక పట్టు పట్టి తీసుకునేలా చేసారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ తో థమన్ సేఫ్ అయిపోయారు.

మహేష్ కన్నా చాలా పట్టుదలగా వుంటారు బన్నీ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరు. సినిమా విషయాలను దగ్గర వుండి ఓ కంట చూస్తూనే వుంటారు. గీతా సంస్థ, బన్నీ కలిసి సరైనోడు సినిమా స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు బోయపాటిని ఎంతగా ‘రాయించారో’ కథలు కథలుగా వినిపించింది. అప్పుడు కానీ సినిమా హిట్ కాలేదు. అదే బోయపాటి రామ్ చరణ్ తో, రామ్ తో ఎలాంటి స్క్రిప్ట్ లు ఇచ్చారో అందరికీ తెలుసు. దటీజ్ బన్నీ.

సంగీత దర్శకులకు ఎగస్ట్రా కార్యక్రమాలు, షో లు ఎక్కువైపోయాయి. థమన్ కు స్టేజ్ షో లు, లైవ్ షో వున్నాయి. దేవీ కూడా తరచు ఫారిన్ టూర్లు, షో లు పెట్టుకుంటారు. ఇవన్నీ వాళ్ల వర్క్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఓ రేంజ్ వరకు ఎవరూ ఏమీ చేయలేరు. వాళ్ల దగ్గర నుంచి టైమ్ కు వర్క్ రాబట్టడం అంత ఈజీ కాదు. ఓసారి ప్రసాద్ ల్యాబ్ వద్ద యంగ్ నిర్మాత ఒకరు థమన్ మీద క్వాలిటీ విషయంలో గట్టిగా అరిచేసారని వార్తలు వినవచ్చాయి.

ఇప్పుడు దేవీ స్టేజ్ షోలతో బిజీగా వుండి, పుష్ప 2 కు సరైన వర్క్ ఇవ్వడం లేదనో, సరైన టైమ్ ఇవ్వడం లేదో మొత్తానికి బన్నీకి కోపం వచ్చేసింది. బన్నీకి నచ్చలేదు అంటే దర్శకుడు సుకుమార్ కూడా ఏమీ చేయలేరు. ఎంత దేవీ మీద ప్రేమ వున్నా సరే. నిజానికి పుష్ప సినిమా విజయంలో దేవీ పాత్ర చాలా వుంది. ఎంత కాపీ పాట అయినా..’ఊ అంటావా పాట’ దేశాన్ని ఊపేసింది. మిగిలిన పాటలు కూడా అదే రేంజ్ హిట్. కానీ పుష్ప 2 పాటలు బాగున్నాయి కానీ అ రేంజ్ కు అన్ని భాషల్లో వెళ్లేలా లేవు. పుష్ప 2 టీజర్ కు మాత్రం దేవీ అద్భుతమైన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఇచ్చారు. దాన్ని కాదని అనలేరు.

కానీ టైమ్ ఫ్యాక్ట్ కావచ్చు, వర్క్ క్వాలిటీ కోసం కావచ్చు. ఇప్పుడు పుష్ప 2 బ్యాక్ గ్రవుండ్ వర్క్ ముక్కలు ముక్కలుగా థమన్ కు, మరో మ్యూజిక్ డైరక్టర్ కు అప్పగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ శిష్యుడు ఉప్పెన బుచ్చిబాబు తన రెండో సినిమాకు రెహమాన్ ను తీసుకున్నారు. ఉప్పెన హిట్ కు దేవీ కారణం అయినా కూడా ఇలా చేసారు అంటే ఇక్కడ టైమ్ ఫ్యాక్టర్ కారణం కావచ్చు.

అనిరుధ్, ధమన్, దేవీ వీళ్లంతా టైమ్ విషయంలో అంత పెర్ ఫెక్ట్ గా వుండరు అనే టాక్ వుంది. సమయానికి కంటెంట్ ఇవ్వడంలో అనిరుధ్ అందరి కన్నా వెనుక వుంటారు. దాదాపు దర్శకుడిని, హీరోని, నిర్మాతను ఏడిపించేస్తారు అనే వార్తలు వున్నాయి. ఫోన్ లు ఎత్తరని, జవాబు ఇవ్వరని అంటారు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తారని భరిస్తున్నారు. థమన్ విషయంలో మరీ అంత లేదు కానీ, అతగాడు కూడా టైమ్ కు ప్రశాంతంగా ఇవ్వకుండా, లాస్ట్ మినిట్ లో టెన్షన్ పెడతారని టాక్ వుంది. ఇప్పుడు దేవీ కూడా అదే స్కూల్ లో చేరినట్లుంది.

నిజానికి దేవీ ఇటీవల చేపట్టిన స్టేజ్ షో హిట్ కాలేదు. హైదరాబాద్ షో ఫ్లాప్ అయింది. అదే టైమ్ లో చేతిలో వున్న సినిమా బ్యాక్ గ్రవుండ్ స్కోర్ చేజారింది. బ్యాడ్ టైమ్.

17 Replies to “‘దేవీశ్రీప్రసాద్’ – వికటించిన ‘షో’..?”

  1. మరి అదే బన్నీ కి ఆర్య2 ఇచ్చిన సుకుమార్ అదే చరణ్ కి లైఫ్ లాంగ్ చెప్పుకునే రేంజ్ లో రంగస్థలం ఇచ్చారు… వెధవ ధీరీలు చెప్పకు

  2. Time matters GA garu. Sarainodu movie గనక వినయ విధేయ టైమ్ లో వచ్చి ఉండి ఉంటే… తొక్కలా ఉండేది. మనం ఏదో పెద్ద ఇది అని ప్లాన్స్ గీస్తాం.. అన్నీ వర్క్ ఔట్ అవ్వవు. ఐన వాటికి నా ప్లానింగ్ అండ్ caring వల్లే ఇదంతా అని జబ్బలు చరుచుకుంటాం… పోతే సైలెంట్ గా వేరే పనిలో పడిపోతాం.

  3. Ee madya 2nd half bore unte music diretcor BGM tho fix chestadu ani decide avuthunnaru makers. Story lekunda, BGM entha baaga kottina, aa good BGM kooda music party lo DJ noise laaga avuthundi…thats what happened with Saripoda sanivaram and Devara. @nd half story lo matter lekapothe entha BGM kottina waste

  4. DON’T SPERD FAKE NEWS!!!!

    The Whole Pushpa Team Members Respects DSP & Its Deserving To DSP. Dont Compare DSP With Thaman And Anirudh. DSP Is Work Holic Person & His Work For Any Movie Plays a Vital And Crucial Role In that Movie.

    Replacement of DSP is a blunder for the movie and putting Thaman is disaster decision of ever!!!! I hope Mythri Movie Makers or AA or Sukumar Won’t do that mistake 💯💯💯

  5. అన్నట్టు ‘సరైనోడు’ సినిమాలో హీరో పాత్ర కన్న విలన్ పాత్ర బాగా గుర్తుంది పోతుంది.

    ఆ పాత్ర నేటి సమకాలీన రాజకీయాల్లో ఒకరికి అచ్చు గుద్దెనట్టు సరిపోతుంది.

Comments are closed.