చరణ్ కు పోటీగా అరవింద్ సినిమా?

నాగ్ చైతన్య- సాయి పల్లవిల తండేల్ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతుందా? అంటే ఔను అనే మాట వినిపిస్తోంది ఇండస్ట్రీ వర్గాల్లో. కానీ ఇదే జ‌రిగితే కాస్త సంచలనమే. ఎందుకంటే సంక్రాంతికి ఈసారి వీలయినన్ని…

నాగ్ చైతన్య- సాయి పల్లవిల తండేల్ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతుందా? అంటే ఔను అనే మాట వినిపిస్తోంది ఇండస్ట్రీ వర్గాల్లో. కానీ ఇదే జ‌రిగితే కాస్త సంచలనమే. ఎందుకంటే సంక్రాంతికి ఈసారి వీలయినన్ని తక్కువ సినిమాలు వచ్చేలా చూస్తున్నారు. గేమ్ ఛేంజ‌ర్, బాలయ్య- సితార సంస్థ సినిమాలు మాత్రమే ఇప్పటికి ఫిక్స్ అయ్యాయి. అజిత్ సినిమా వస్తుందనే వార్తలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో డిసెంబర్ మూడో వారంలో డేట్ వేసిన తండేల్ సినిమా సంక్రాంతికి మారితే కాస్త సంచలనమే.

ఎందుకంటే మిగిలిన రెండు సినిమాల కన్నా ఎక్కువ బజ్‌ తండేల్ కు వుంది. అది వాస్తవం. అదీ కాక ఇలా చేయడం వల్ల రామ్ చరణ్ కు పోటీగా గీతా కాంపౌండ్ సినిమా విడుదల చేసినట్లు అవుతుంది. ఇప్పటికే గీతా కాంపౌండ్ కు మెగా కాంపౌండ్ కు అంతగా పొసగడం లేదనే వదంతులు వున్నాయి. ఇప్పుడు ఇలా చేస్తే అవి మరింత బలపడతాయి.

పైగా డిసెంబర్ మూడో వారం వదిలేస్తే అది బన్నీ పుష్ప 2 కు దారి ఇవ్వడానికి చేసినట్లు అవుతుంది. పుష్ప వచ్చిన మూడు వారాలకు తండేల్ రావాల్సి వుంది. అలాగే అదే డేట్ కు మైత్రీ సంస్థ రాబిన్ హుడ్ రావాలి. ఒక వేళ ఏ కారణం చేత అయినా ఈ రెండూ రాకపోతే, పుష్ప 2 కి బాగా దారి వదిలేసినట్లు అవుతుంది.

ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి వుంది.

7 Replies to “చరణ్ కు పోటీగా అరవింద్ సినిమా?”

Comments are closed.