Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్జీవీ మధ్యలో ముంచేసారా?

ఆర్జీవీ మధ్యలో ముంచేసారా?

ఆర్జీవీని నమ్ముకుంటే అదేదో పట్టుకుని గోదారి ఈదినట్లే. ఆయనను, ఆయన హడావుడిని, ఆయన టుమ్రీ సినిమాలను నమ్ముకుని రంగంలోకి దిగిపోయారు శ్రేయాస్ మీడియా  అండ్ దాని పార్టనర్లు. అందరూ కలిసి శ్రేయాస్ ఈటి అంటూ ఎటిటి ని రెడీ చేసారు. కరోనా లాక్ డౌన్ టైమ్, జనం 'కరువు' తీర్చే సినిమాలు వదలడం ప్రారంభించారు. ట్విట్టర్ లో ఆర్జీవీ హడావుడి ఇలాంటివి తోడై కాస్త బాగానే అనిపించాయి.

దాంతో చాలా మంది తామూ రెడీ, ఇదిగో మా ఓటిటి అంటూ తెగ హడావుడి చేసారు. ఇంతలో ఆర్జీవీ తీసిన సినిమాలు ఎటిటిలో తుస్సుమనడం ప్రారంభమైంది. దాంతో ఎటిటి ల మీద జనం దృష్టి పక్కన పెట్టేసారు. కానీ శ్రేయాస్ ఈటి మాత్రం కిందా మీదా పడుతోంది. ఆర్జీవీ హ్యాపీగా డైరక్టర్ థియేటర్ సినిమాలే ఇంక అంటూ మూడు నాలుగు సినిమాలు ఒకసారి తయారుచేస్తున్నారు. 

ఇదిలా వుంటే శ్రేయాస్ ఈటీ ఆరంభంలో వచ్చిన బజ్ చూసి అనేక మంది సినిమా జనాలకు అయిదు, పది వంతున అడ్వాన్స్ లు పంచేసింది. ఇప్పుడు అవి అన్నీ ఫినిష్ చేసి వదలాలా? వద్దా? వదలాలి అంటే డబ్బులు కావాలి. వదలాలి అంటే అడ్వాన్స్ లు వెనక్కు రావు. పోనీ ఫినిష్ చేసి వదిలేద్దాం అనుకుంటే ఆ వేళకు థియేటర్లు ఓపెన్ అయిపోతాయి. అప్పుడు ఎటిటి మొహం ఎవరన్నా చూస్తారో? చూడరో?

నిజానికి ఎటిటి అందరికీ వర్కవుట్ కాదు. ఆర్జీవీ లాంటి వాళ్ల సపోర్ట్ వుంటే, ఆ హఢావుడి, ఆ ప్రచారం అంతా కలిసి ఎంతో కొంత వర్కవుట్ అవుతుంది. అలాంటి ఆర్జీవీ ఎటిటిని ఇలా మధ్యలో వదిలేస్తే..? అయినా మనలో మాట ఆర్జీవీని నమ్ముకుని ఎవరు లాభపడ్డారు కనుక? హాయిగా ఇంతో అంతో మార్కెట్ వున్న మంచు ఫ్యామిలీ హీరోలను సైతం రాంగ్ రూట్లోకి నెట్టేసారు. వర్మ హ్యాండ్ నే అంతేమో?

నాకు జగన్ ఇచ్చిన గౌరవం అది 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?