Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అయినా ట్రెండింగ్ కాలేదేమి?

అయినా ట్రెండింగ్ కాలేదేమి?

1,59,99,669 ... వ్యూస్ , 1,55,046....కామెంట్లు , 2 మిలియన్లు లైక్ లు

ఇదీ కేజిఎఫ్ 2 టీజర్ సాధించిన ఘనత. యూ ట్యూబ్ ను షేక్  చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే షార్ట్ టైమ్ లో ఇన్ని వ్యూస్ ఓ రికార్డు. అన్ని కామెంట్లు మరో రికార్డు.  అంతా బాగానే వుంది. కానీ చిన్న అనుమానం ఒక్కటే.

ఎందుకు యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లోకి రాలేదు. ఇప్పటికీ ఇంకా ట్రెండింగ్ లో అల్లుడు అదుర్స్ ఫస్ట్ ప్లేస్ లో వుంది? ఈ మాత్రం ఆ మాత్రం వ్యూస్ వస్తేనే ట్రెండింగ్ లోకి వెళ్లిపోతుంది కదా?అలాంటిది ఇన్ని మిలియన్ల వ్యూస్, ఇన్ని మిలియన్ల లైక్ లు, అన్ని లక్షల కామెంట్లు వుండి ట్రెండింగ్ కు రావడం లేదేమి?

సినిమా జనాలకు ఓ అలవాటు వుంది. హీరోల మెహర్బానీ కోసం యూట్యూబ్ డిజిటల్ అప్రిసియేషన్ కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. లక్షకు ఇంత, మిలియన్ కు ఇంత అని ఫీజలు చెల్లించి వర్క్ చేయించుకుంటారు. అలాంటివి ట్రెండింగ్ లోకి యూ ట్యూబ్ తీసుకోదు. 

ఇది కూడా అలాగేనా? లేక మరేమైనా సాంకేతిక అంశం దాగి వుందా? అన్నది తెలియాల్సి వుంది.

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

సక్సెస్ మీట్ లో కలుద్దాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?