Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అయ్యో...మాస్టర్..ఏమిటిలా?

అయ్యో...మాస్టర్..ఏమిటిలా?

తమిళ సూపర్ స్టార్ విజయ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న సినిమా 'మాస్టర్'. దాదాపు మూడుగంటల ఈ సినిమా రేపు విడుదల కాబోతోంది. తెలుగులో కూడా భారీగా విడుదల ప్లాన్ చేసారు. 

అసలే 50శాతం ఆక్యుపెన్సీతో ఓ భారీ సినిమా విడుదల కావాల్సిన పరిస్థితి వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చినా కేంద్రం దాన్ని తోసిపుచ్చింది.అయినా అలాగే సర్దుకుని విడుదలవుతూ వుంటే, ఉరుములేని పిడుగులా పైరసీ మీద పడింది. 

సినిమాలోని కొన్ని సీన్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా ఓ ట్వీటు వేసారు. ఎక్కడన్నా మాస్టర్ సినిమా క్లిప్స్ కనిపిస్తే దయచేసి వాటిని షేర్ చేయవద్దని ఆయన కోరారు. 

తమిళనాట పైరసీ సమస్య చాలా ఎక్కువగా వుంది. ఎంతమంది ఎంత ఫైట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, దానిని అరకట్టడం అన్నది సవాలుగా మారింది. పెద్ద సినిమాలను పైరసీ బారిన పడకుండా కాపాడుకోవడం అన్నది కత్తిమీద సాముగా మారుతొంది.

దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?