ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేయడం ఎలా?

ఆల్రెడీ ఆ సినిమా జీవితకాలం లేటు. ఇంకా లేటు చేస్తే ఫ్యాన్స్ బండబూతులు తిడతారు. మరి ఏం చేయాలి? ఏముంది.. వాళ్లను బకరాల్ని చేస్తే సరి. అసలు విషయం చెప్పకుండా మభ్యపెడితే ఓ పనైపోతుంది.…

ఆల్రెడీ ఆ సినిమా జీవితకాలం లేటు. ఇంకా లేటు చేస్తే ఫ్యాన్స్ బండబూతులు తిడతారు. మరి ఏం చేయాలి? ఏముంది.. వాళ్లను బకరాల్ని చేస్తే సరి. అసలు విషయం చెప్పకుండా మభ్యపెడితే ఓ పనైపోతుంది. ఓ పెద్ద సినిమా యూనిట్ ఇప్పుడు అదే పని చేస్తోంది.

ఓ వైపు సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ విషయం చెబితే మరోసారి ట్రోలింగ్ తప్పదు. ‘ఇన్నాళ్లూ గాడిదలు కాస్తున్నారా’ అనే తిట్టు చాలా చిన్నది సోషల్ మీడియాలో.

అందుకే సినిమా వాయిదా పడినట్టు ముందుగా లీకులు వదిలారు. కొంతమందితో పోస్టులు పెట్టించి, డిలీట్ చేయించారు. తమ మనుషులతో పనిగట్టుకొని వార్తలు రాయించారు. గడిచిన 2 రోజులుగా అభిమానుల మైండ్ సెట్ ట్యూన్ చేశారు. ఇంకో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది.

ఇక సినిమా చెప్పిన తేదీకి రాదంటూ మెల్లగా ప్రకటించి చేతులు దులుపుకుంటారు. అప్పటికే తిట్టితిట్టి అలసిపోయిన ఫ్యాన్స్, ఏం చేయలేక ఊరుకుంటారు. ప్లానింగ్ అదుర్స్ కదూ..!

నిజానికి ఇది సోషల్ మీడియా యుగం. ఈ పెద్ద సినిమాకు సంబంధించి చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది. అయినప్పటికీ నిర్మాతలు కళ్లు మూసుకొని పాలు తాగుతున్నారు. ఎవరికేం తెలియదులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అదే కామెడీ.

7 Replies to “ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేయడం ఎలా?”

  1. అది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ కదా.. రెండు వారాల కి తీసేసే డిసెంబర్ 25 డేట్ కాకుండా.. రెండు వారాల్లో రెండు వందల కోట్లు షేర్ వచ్చే జనవరి 10 కి మారింది

Comments are closed.