మనందరం నెగెటివ్ అయిపోయాం – ఎన్టీఆర్

ప్రేక్షకుల్లో నెగెటివిటీ పెరిగిపోయిందంటున్నాడు ఎన్టీఆర్. అంచనాల్లేకుండా, నార్మల్ గా సినిమాలు చూడడం అందరం మరిచిపోయామని, విశ్లేషించడం కోసమే సినిమాలు చూస్తున్నామని అన్నాడు. Advertisement “ఈ రోజుల్లో మనం (ప్రేక్షకులు) చాలా నెగెటివ్ అయిపోయాం. ఓ…

ప్రేక్షకుల్లో నెగెటివిటీ పెరిగిపోయిందంటున్నాడు ఎన్టీఆర్. అంచనాల్లేకుండా, నార్మల్ గా సినిమాలు చూడడం అందరం మరిచిపోయామని, విశ్లేషించడం కోసమే సినిమాలు చూస్తున్నామని అన్నాడు.

“ఈ రోజుల్లో మనం (ప్రేక్షకులు) చాలా నెగెటివ్ అయిపోయాం. ఓ సినిమాను ఎలాంటి అంచనాల్లేకుండా నార్మల్ గా చూడడం మానేశాం. ఇంట్లో మా పిల్లలు సినిమాలు చూస్తుంటారు. హీరో ఎవరు, ఏ సినిమా అనేది వాళ్లకు అనవసరం. సినిమాను వాళ్లు ఎంజాయ్ చేస్తారు. మనం ఎందుకలా సినిమాలు చూడలేకపోతున్నానే ఆశ్చర్యం నాకు కలుగుతుంది. ఈ రోజుల్లో ప్రతి సినిమాను విశ్లేషించడం కోసమే చూస్తున్నాం. సినిమాలను జడ్జ్ చేయడం, విశ్లేషించడం, అతిగా ఆలోచించడం లాంటివి అదే పనిగా చేస్తున్నాం.”

అయితే ఇదంతా సైకిల్ లో భాగం అంటున్నాడు ఎన్టీఆర్. చుట్టూతిరిగి ప్రేక్షకుల మైండ్ సెట్ సాధారణ స్థితికి చేరుకుంటుందని, నార్మల్ గా సినిమాలు చూసే రోజులొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

“బహుశా, సినిమాపై ప్రేమ మనల్ని ఇలా తయారుచేసిందేమో. ఇలా అతిగా విశ్లేషించడంలో అందరూ పీక్ స్టేజ్ కు వెళ్లిపోయారని భావిస్తున్నాను. అయితే ఇదంతా ఓ సర్కిల్ అని నేను అనుకుంటున్నాను. ఈ ప్రక్రియ మొత్తం సహజసిద్ధంగా సర్దుకొని, తిరిగి ప్రేక్షకులంతా నార్మల్ గా సినిమాను చూసే రోజు వస్తుందని నా నమ్మకం.”

తారక్ చెప్పినదాంట్లో నిజం ఉంది. అయితే ప్రేక్షకుల్ని అలా తయారుచేసింది సినిమా జనమే. తమ సినిమాపై మేకర్స్ ఎప్పుడైతే అతిగా అంచనాలు పెంచడం మొదలుపెట్టారో, అప్పట్నుంచే ప్రేక్షకులు సినిమాను చూసే విధానం కూడా మారిపోయింది.

ఎప్పుడైతే సినీ జనాలు బడ్జెట్ లెక్కలు, వసూళ్లు చెప్పడం మొదలుపెట్టారో, అప్పుడే ప్రేక్షకుడి మైండ్ సెట్ మారిపోయింది. కరెక్షన్ ఇండస్ట్రీ నుంచే రావాలి, అప్పుడు ఆటోమేటిగ్గా ఆడియన్స్ కూడా మారతారు. ఎలాంటి ఆలోచనలు, అంచనాల్లేకుండా చిన్న పిల్లల మనస్తత్వంతో ప్లెయిన్ గా సినిమాలు చూస్తారు.

21 Replies to “మనందరం నెగెటివ్ అయిపోయాం – ఎన్టీఆర్”

    1. పొరబాటు, ప్రజలకి మంచి సినిమా కావాలి తప్ప క్యాస్ట్ పాలిటిక్స్ తో సంబంధం లేదు.

  1. Few months ago Kalki managed to attract audience, same negative audience gave Kalki 1000 crores collection. Why couldn’t you do that ? Introspect. Don’t blame audience.

  2. Devara 2nd half is total bore. Koratala failed as writer in this film. Colls are because of NTR. Distributors are in losses excluding GST (except ceeded) with the process that it will be covered in part 2

  3. We would watch movie like we used to, provided you guys create movies like from 1950 to 75, with good songs good singers and lyrics, story and direction and comedy. If it’s not in movies, audience would watch with critical analysis only. We have to love the movie instantly, that the test of a good movie

  4. మీ ఇంట్లో పిల్లలకి టికెట్ 1000 కాదు, 10000 పెట్టినా లెక్క కాదు! కానీ మాలాంటి సామాన్యులకి ఫ్యామిలీతో(నలుగురం) సినిమాకి వెళితే 2000 దాకా అవుతుంది, అది మాకు చాలా ఎక్కువ మొత్తం. ఎప్పుడైతే ఎక్కువ మొత్తం పెడతామో అది వర్త్ అవునా కాదా అనేది ఆలోచిస్తాము. అది కూడా తప్పంటే ఎలాగ 🤔

  5. మీరు తీసే చెత్త సినిమాలను ఏమాత్రం ఆలోచించకుండా మేమెందుకు థియేటర్లో చూడాలి

  6. మనిషి జీవితం లో చాలా వరకు చేసేది రొటీన్ పనులే ..కానీ సినిమా వరకు వచ్చే సరికి కొంత వెరైటీ కోరుకుంటాడు ఎందుకంటే అది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ..ఈరోజు మల్టీప్లెక్స్ కి ఫామిలీ తో వెళ్తే రెండు వేల పైనే ఖర్చు అయ్యే పరిస్థితి ..ఇలాంటి సిట్యుయేషన్స్ లో మనిషి అనేవాడు కాస్త వెరైటీ కోరుకోటం లో తప్పులేదు కదా .. తీసిన సినిమాలనే మల్లి ఎక్కువ బడ్జెట్ లో తీస్తాము అంటే బుక్ మై షో లో వారం కూడా తిరక్క ముందే హరిత విప్లవాలు ఉంటాయి మరి .ఎన్టీఆర్ లాంటి ఆక్టర్ ని బడ్జెట్ తో కాకుండా మంచి స్క్రిప్ట్స్ వాడుకోండయ్యా

Comments are closed.