Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

బన్నీ పార్టీ ఇంత నీరసంగా

బన్నీ పార్టీ ఇంత నీరసంగా

మహానటి సినిమా విడుదల తరువాత హీరో అల్లుఅర్జున్ మంచి పార్టీ ఇచ్చాడు. పార్టీ అనే కన్నా, మహానటి యూనిట్ కు మంచి సన్మానం చేసాడు. తన ఫామ్ హవుస్ లో దాదాపు ఇండస్ట్రీలోని డైరక్టర్ లు అందరినీ పిలిచి మరీ ఈ సన్మాన కార్యక్రమం జరిపాడు. అందరూ శహభాష్ అన్నారు. గీత గోవిందం హిట్ అయిన వెంటనే బన్నీ మరోసారి పార్టీ అనౌన్స్ చేసాడు. ఓహో మంచి పద్దతి పాటిస్తున్నాడు అనుకున్నారంతా.

కానీ తీరా గీతగోవిందం పార్టీ వ్యవహారం చూస్తే, పక్కా పరమ రొటీన్ అనేసుకున్నారు. అసలు ఆ మాటకు వస్తే ఈసారి ఎంత మందిని పిలిచినా పట్టుమని పదిమంది సెలబ్రటీలు కూడా హాజరుకాలేదు. సినిమా పార్టీలు బోలెడు జరుగుతూనే వుంటాయి. అయితే ఎవరో ఒకరి ఇంట్లో లేదా పబ్ ల్లో. వాటిల్లో కొత్తేలేదు. బన్నీ కూడా గీత గోవిందం పార్టీని తన స్వంత పబ్ లో ఏర్పాటు చేసాడు. అక్కడే ముందు సగం మైనస్ అయిపోయింది.

కొంతమంది సెలబ్రిటీలు పబ్ లో పార్టీ అనేసరికి దూరం అయ్యారని తెలుస్తోంది. భయంకరమైన సౌండ్, గోల, అందుకే ఓసారి మొహం చూపించి వచ్చేసా అని ఓ సినిమా పర్సన్ చెప్పారు దాన్ని బట్టి అర్థం అవుతుంది ఈ పార్టీ ఎలా జరిగిందో? అయినా స్వంత బ్యానర్ సినిమా సక్సెస్ అయితే మంచిగా, ఇంటి ఆవరణలోనో, ఫామ్ హవుస్ లోనో కాకుండా పబ్ లో పార్టీ ఇవ్వడం అంటే ఏముంది?

అన్ని సినిమా పార్టీల్లాగే అదోటి? ఇక బన్నీ ప్రత్యేకత ఏముటుంది? అన్న కామెంట్ లు వినిపిస్తున్నాయి. అందుకే ఈసారి ఒకరిద్దరు పేరున్న దర్శకులు మినహా పెద్దగా ఎవ్వరూ హాజరు కాలేదని వినికిడి. ఈ లెక్కన బన్నీ మళ్లీ మరోసారి పార్టీ ఇస్తాడో? ఇవ్వడో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?