ఎవరు డైరక్టర్ మల్టీ స్టారర్

యంగ్ డైరక్టర్లు అంతా కొత్త కొత్త కథల వైపు చూస్తున్నారు. కేవలం హీరోయిజం కాకుండా, మరిన్ని బలమైన పాత్రలు సృజించాలని చూస్తున్నారు. దాంతో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆర్ఎక్స్ 100తో హిట్ కొట్టిన అజయ్…

యంగ్ డైరక్టర్లు అంతా కొత్త కొత్త కథల వైపు చూస్తున్నారు. కేవలం హీరోయిజం కాకుండా, మరిన్ని బలమైన పాత్రలు సృజించాలని చూస్తున్నారు. దాంతో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆర్ఎక్స్ 100తో హిట్ కొట్టిన అజయ్ భూపతి తన తరువాత సినిమా కోసం అలాంటి కథే రాసుకున్నారు. సముద్రం అనే ఈ స్క్రిప్ట్ కు ఇద్దరు హీరోలు కావాలి.

లేటెస్ట్ గా మరో డైరక్టర్ కూడా ఇదే బాటలో వున్నారు. ఎవరు సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు రామ్ జీ కూడా తన తరువాత సినిమా కోసం మాంచి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. దీంట్లో కూడా రెండు బలమైన పాత్రలు వున్నాయి. అందువల్ల ఇది కూడా ఇద్దరు హీరోలను డిమాండ్ చేసే స్క్రిప్ట్ గా మారింది.

ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా హీరో కావాల్సి వుంది. దీంతో ఈ స్క్రిప్ట్, ఈ ప్రాజెక్టు ఇప్పుడు నిర్మాత దిల్ రాజు దగ్గరకు చేరింది. ఆయన హీరోల డేట్ లు సంపాదిస్తే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది

స‌రిలేరు టిమ్ తిరుమ‌ల ద‌ర్ష‌నం